ఆకలుండదు... దప్పికుండదు...
చిత్రం : కేడి. నెం. 1 (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆకలుండదు... దప్పికుండదు...
పక్క కుదరదు... నిదురపట్టదు...
ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు
ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు
ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు
ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు
ఆకలుండదా... దప్పికుండదా
పక్క కుదరదా... నిదురపట్టదా...
ఏమిస్తానో చూడు కాయో పండు నీకు
ఏమిస్తానో చూడు కాయో పండు నీకు
ఏమిస్తానో చూడు కాయో పండు నీకు
ఏమిస్తానో చూడు కాయో పండు నీకు
చరణం 1 :
దిబుదిబుదిబుదిబుదిబుదిబుదిబుదిబు
దీపావళి
పెదవులు వెతికే పెదవులనడుగు
పెరపెర ఎందుకని
పైపైకెగిరే పైటను అడుగు
రెపరెపలెందుకని
గుచ్చిగుచ్చి అడుగుతు ఉంటే
గుట్టు దాచుకోకు
రుతువుంటే బెట్టు చేయబోకు...
అక్కడ నొప్పి... ఇక్కడ దప్పి
ఎట్టా ఎట్టా చెప్పను విప్పి
ఆకలుండదు... అహా..
దప్పికుండదు... ఓహో
పక్క కుదరదు... నిదురపట్టదు...
అహా.. హా.. అహా.. హా...అహా.. హా.. ఓహో..ఓ...
చరణం 2 :
దిగులు కానీ దిగులొకటుంది
గుబులుగుబులుగా
పగలు రేయి పగపడుతుంది
వగలు రగులగా
వయసు రోగమై మనసు
తాపమై వేదిస్తే అంతే
ఏ వయసుకా ముచ్చటన్నది
లోపిస్తే గల్లంతే
ఇప్పుడు చెప్పు ఎక్కడ నొప్పి...
అక్కడా.. ఇక్కడా.. ఎక్కడా... ఎక్కడా
ఆకలుండదా... దప్పికుండదా
పక్క కుదరదా... నిదురపట్టదా...
ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు
ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు
చరణం 3 :
దిబుదిబుదిబుదిబుదిబుదిబుదిబుదిబు
దీపావళి
కొత్త బరువులు మెత్తమెత్తగా
ఆరడి పెడుతుంటే
కోడె చూపులు వెచ్చవెచ్చగా
రాపిడి పెడుతుంటే
దాయలేని వయసు కన్నా
మోయలేని బరువేముంది
దాచుకున్న మనసు కన్నా
పెంచుకున్న జ్వరమేముంది
దాయని వాపు తీయని తీపు...
తీరే దారి తెన్నో చూపు
ఆకలుండదు... దప్పికుండదు...
పక్క కుదరదా... నిదురపట్టదా...
ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు
ఏమిస్తానో చూడు కాయో పండు నీకు