శ్రీశైలా మల్లయ్య దైవమే నీవయ్య
చిత్రం: కృష్ణవేణి (1974)
సాహిత్యం : సి నారాయణ రెడ్డి
సంగీతం: విజయ భస్కర్
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
శ్రీశైలా... మల్లయ్య
శ్రీశైలా ..మల్లయ్య ...దైవమే ..నీవయ్య
శ్రీభ్రమరాంబతో వెలసిన జంగమయ్యా ...
శ్రీశైలా... మల్లయ్య....
చరణం 1:
ఇదియే దక్షిణ కైలాసము ..
ఇది నాగార్జున నివాసం...
ఇదియే దక్షిణ కైలాసము ..
ఇది నాగార్జున నివాసం...
ఇందున్న శిలలే..ఏ..ఏ...
ఇందున్న శిలలే శివలింగాలు..
సెలయేళ్ళన్ని దివ్యతీర్థాలు....
శ్రీశైలా ...ఆ..మల్లయ్య ...ఆ..
చరణం 2:
వరుసవేదుల రాశి ప్రత్యక్ష కాశీ ..
పాతాళ గంగకు కాణాచి ...
వరుసవేదుల రాశి ప్రత్యక్ష కాశీ ..
పాతాళ గంగకు కాణాచి ..
ఈ శిఖర దర్శనమే..ఏ..ఏ..
ఈ శిఖర దర్శనమే.. పాపహారము ..
భక్త కోటికి జన్మ పావనము..
శ్రీశైలా ...మల్లయ్య
చరణం 3:
పర్వతుడు నిను గొల్చి మెప్పించగా..
చంద్రవతి మల్లెపూల పూజింపగా ..
పర్వతుడు నిను గొల్చి మెప్పించగా..
చంద్రవతి మల్లెపూల పూజింపగా ..
మల్లిఖార్జున రూపమై ..ఐ...ఐ...
మల్లిఖార్జున రూపమై నిలిచావులే ..
తెలుగుగడ్డకు ముక్తి నిచ్చావులే..
శ్రీశైలా మల్లయ్య ..శ్రీశైలా మల్లయ్య...
దైవమే నీవయ్య
శ్రీభ్రమరాంబతో వెలసిన జంగమయ్యా...
శ్రీశైలా మల్లయ్య
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి