RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, మార్చి 2024, ఆదివారం

తొలి వలపులలో ఏ చెలికైన | Tolivalapulalo ye chelikaina | Song Lyrics | Ganga Manga (1973)

తొలి వలపులలో ఏ చెలికైన



చిత్రం: గంగ - మంగ (1973)

సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


తొలి వలపులలో ఏ చెలికైన 

అలక ఉండునని విన్నాను..

అది కవుల కల్పననుకున్నాను ..

అది కవుల పైత్యమనుకున్నాను ..

నీలో నాపై అలకను చూసి 

వలపు చేష్టలనుకున్నాను ..

నీ చెలిమి కోరుతూ ఉన్నాను..


మాయలు చేసి మీ మగవారు 

మాటలు చాలా నేర్చారు..

ప్రతి మగువకిలాగే చెబుతారు..

ఆడది తానే చెంతకు వస్తే 

అలిగే పనులే చేస్తారు..

ఆ అలకే వలపనుకుంటారు ..


చరణం 1:


కోరినవాణ్ని కొంగు ముడేసి 

తిప్పదలచుకుంటారు..

మరో మగువతో మాటాడగనే 

మూతి ముడుచుకుంటారు..

మొగము తిప్పుకుంటారు..


సేవ పేరుతో చేకిలి నొక్కి 

సరసం మాడుతుంటారు..

నిజం తెలిస్తే బుజం తడుముకొని 

నీతులు పలుకుతు ఉంటారు..

సాకులు చెబుతూ ఉంటారు


తొలి వలపులలో ఏ చెలికైన 

అలక ఉండునని విన్నాను..

అది కవుల కల్పననుకున్నాను

మాయలు చేసి మీ మగవారు 

మాటలు చాలా నేర్చారు..

ప్రతి మగువకిలాగే చెబుతారు..


చరణం 2:


ఆడవారు తమ అనురాగంలో 

అనుమానం పడుతుంటారు

లోపల మమత పైన కలతతో 

సతమతమవుతూ ఉంటారు

కుత కుత లాడుతూ ఉంటారు


తేనెటీగలో ఉన్న గుణాలు 

మగవారలలో ఉంటాయి

వీలు దొరికితే వారి తలపులు 

దారి తప్పుతూ ఉంటాయి

పెడదారి పట్టుతూ ఉంటాయి...


చరణం 3:


కలలోనైనా నా కన్నులలో 

వెలుగుతున్నది నీ రూపం

నీ అందాలను ఆరాధిస్తూ 

పూజించడమే నా ధ్యేయం

జీవించడమే నా గమ్యం


కోరినవారు దూరమవుదురని 

గుబులుపడును నా మనసు

నీ హృదయంలో నాపై ప్రేమ 

నిండుగ ఉందని తెలుసు

అది పొంగుతున్నదని తెలుసు...

ఆ..అహ..ఆ..అ..అహ..ఆ..ఆ

ల.ల.లా..ఉ..ఊ..ఉ..


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు