RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, మార్చి 2024, ఆదివారం

హుషారు కావాలంటే | Husharu kavalante | Song Lyrics | Ganga Manga (1973)

హుషారు కావాలంటే



చిత్రం : గంగ - మంగ (1973)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : బాలు 


పల్లవి :


హుషారు కావాలంటే... 

బేజారు పోవాలంటే

మందొక్కటే మందురా... 

ఇది మించి ఏముందిరా 


హుషారు కావాలంటే... 

బేజారు పోవాలంటే

మందొక్కటే... మందురా  


చరణం 1 :


అన్ని చింతలూ మరపించేది... 

ఎన్నో వింతలు చూపించేది

అన్ని చింతలూ మరపించేది... 

ఎన్నో వింతలు చూపించేది

మదిలో దాగిన నిజాలనన్ని 

మనతోనే పలికించేదీ

అహ అహ ఆ... ఏది?....  

మందొక్కటే మందురా       


చరణం 2 :


జీవితమెంతో చిన్నదిరా... 

ప్రతి నిమిషం విలువైనదిరా

జీవితమెంతో చిన్నదిరా... 

ప్రతి నిమిషం విలువైనదిరా 


నిన్నా రేపని తన్నుకోకురా...  

ఉన్నది నేడే మరువబోకురా

అహ .... అహ....  అహా..ఆ   

హుషారు కావాలంటే... 

బేజారు పోవాలంటే

మందొక్కటే....  మందురా 


చరణం 3 :


ఇల్లు వాకిలి లేనివాడికి... 

రహదారే ఒక రాజమహలురా

ఇల్లు వాకిలి లేనివాడికి... 

రహదారే ఒక రాజమహలురా

తోడూ నీడా లేని వాడికి... మ్మ్ చొ...  చొ..

తోకాడించే నీవే తోడురా  

  

హుషారు కావాలంటే... 

బేజారు పోవాలంటే

మందొక్కటే మందురా... 

ఇది మించి ఏముందిరా


హుషారు కావాలంటే... 

బేజారు పోవాలంటే

మందొక్కటే మందురా...



పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే | Brahmamokkate Parabrahmamokkate | Annamacharya Keerthana | Annamayya (1997)

 బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య సంకీర్తనలు  గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు