ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యా
చిత్రం: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు
పల్లవి:
మాటంటే బాణం..
ఏ మగువన్నా ప్రాణం
ఆ ఇద్దరు దేవుళ్ళు కలసి..
ఎత్తిన అవతారం..ఊ
మనం..
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
డండర డండర డాండాండ..
డండర డండర డాండాండ
డండర డండర డాండాండ..
డండర డండర డాండాండ
చరణం 1:
భార్య అడిగితే ఏది లేదనను..
బంగారు లేడి తెమ్మన్నా కాదననూ..
హా..ఆ ఆ హా హా.. ఆహ..ఆహ..ఆహ..హా..ఆ..ఆ
భార్య అడిగితే ఏది లేదనను..
బంగారు లేడి తెమ్మన్నా కాదననూ..
ఇల్లు దాటితే నేను.. నేను కాను..హ..హా..
ఇల్లు దాటితే నేను.. నేను కాను
ఎన్ని పడకగదులు ఏలుతానో చెప్పలేను..
అసలే చెప్పలేను
అందుకే మనం..
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
చరణం 2:
ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను..ఊ..ఊ
పది తలలెదురైనా ఎగురగొట్టుతాను
ఆ..ఆ..ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను..
పది తలలెదురైనా ఎగురగొట్టుతాను
మనసైతే మురళిని చేపట్టుతాను..
మనసైతే మురళిని చేపట్టుతాను..
వేల మంది గోపికలకు గజ్జ కట్టుతాను..
గజ్జ కట్టుతానూ..
హా..ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
చరణం 3:
ఒక్క భార్య వున్నవాడు దేవుడే..
మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే
ఆ..ఆ హా హా..ఆ..ఆ ఆహ ఆహ ఆహ..హా..ఆ
ఒక్క భార్య వున్నవాడు దేవుడే..
మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే
ఆ ఇద్దరు దీవించిన చిరంజీవిని..
ఆ ఇద్దరు దీవించిన చిరంజీవిని..
విల్లు వేణువు పట్టిన సవ్యసాచిని..
అపర సవ్యసాచిని
అందుకే మనం..
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
మాటంటే బాణం..
ఏ మగువన్నా ప్రాణం
ఆ ఇద్దరు దేవుళ్ళు కలసి..
ఎత్తిన అవతారం
మనం..
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
డరడ డరడ డడడ..
డడ్డర డడ్డర డడడ
డడ.. డడ.. డడ.. డడ..
డండరడాడ.. డండరడడ..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి