RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, మార్చి 2024, శుక్రవారం

గడసాని దొరసాని | Gadasani Dorasani | Song Lyrics | Ganga Manga (1973)

గడసాని దొరసాని



చిత్రం : గంగ - మంగ (1973)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


గడసాని దొరసాని 

ఒడుపు చూడండి

ఓ బాబు...  ఒడుపు చూడండి

మెరుపులాంటి చినదాని 

సొగసు చూడండి

సొగసు చూడండి...  అబ్బొ..

దాని ఒడుపు చూడండి

గడసాని... దొరసాని..


చరణం 1 :


అరెరెరె నడకంటె నడక కాదు

చలాకి నడక.. బల్ కిలాడి నడక

నవ్వంటే నవ్వుగాదు తారాజువ్వ...   

అది వడిసెల రువ్వ 

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా


వగలంటే వగలు కాదు వలపుల సెగలు

చూపంటే చూపు కాదు మదనుడి తూపు

ఆ నడక...  ఆ నవ్వు...  ఆ వగలు...  ఆ చూపు

అన్ని కలిపి యిసిరితే గుమ్మైపోతారు 

తల దిమ్మైపోతారండి

   

గడసాని..హేయ్..గడసాని దొరసాని

ఒడుపు చూడండి... 

ఓ బాబు ఒడుపు చూడండి

మెరుపులాంటి చినదాని 

సొగసు చూడండి

సొగసు చూడండి...  అబ్బొ... 

దాని ఒడుపు చూడండి 


గడసాని... దొరసాని..


చరణం 2 :


మాటలతోటే నన్ను మురిపించకురా

ఏమేమో పొగిడేసి బులిపించకురా

మాటలతోటే నన్ను... మురిపించకురా

ఏమేమో పొగిడేసి... బులిపించకురా

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

కవ్వించాలని నువ్వు కలలు కనకురా

కత్తితోటి చెలగాడి చిత్తు గాకురా

గడ ఎక్కి...  తాడెక్కి...  గంతేసి...  చిందేసి

అందరు మెచ్చేలాగా ఆడీ చూపాలిరా 


గడసాని..హేయ్..హేయ్..

గడసాని దొరసాని

ఒడుపు చూడండి 

ఓ బాబు ఒడుపు చూడండి

మెరుపులాంటి చినదాని 

సొగసు చూడండి

సొగసు చూడండి 

అబ్బొదాని ఒడుపు చూడండి

గడసాని... దొరసాని...    


చరణం 3 :


తళుకు బెళుకు చూపిస్తా..

గజ్జె ఘల్లుమనిపిస్తా..


తళుకు బెళుకు చూపిస్తే....  

తటపట తటపటపట లాడాలి

గజ్జె ఘల్లుమనిపిస్తే... 

గిలగిల గిలగిలగిల లాడాలి

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

తళుకు బెళుకు చూపిస్తే....  

తటపట తటపటపట లాడాలి

గజ్జె ఘల్లుమనిపిస్తే... 

గిలగిల గిలగిలగిల లాడాలి


ఆ తళుకు...  ఆ బెళుకు... 

ఆ బిగువు...  ఆ బింకం

అన్నికలిపి చూపితే ఐసై పోవాలండీ..

పైసలు రాలాలండీ


గడసాని..ఆహా..గడసాని దొరసాని 

ఒడుపు చూడండి

ఓ..బాబు ఒడుపు చూడండి

మెరుపులాంటి చినదాని 

సొగసు చూడండి

సొగసు చూడండి అబ్బొ..

దాని ఒడుపు చూడండి 


గడసాని... దొరసాని..


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు