శారదా... నను చేరగా
చిత్రం : శారద (1973)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : రామకృష్ణ
పల్లవి :
శారదా... నను చేరగా
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ... శ్రావణ నీరదా... శారదా..
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ....ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా
చరణం 1 :
ఏమి రూపమది.. ఇంద్ర చాపమది
ఏమి కోపమది.. చంద్ర తాపమది
ఏమి రూపమది.... ఇంద్ర చాపమది...
ఏమి కోపమది.. చంద్ర తాపమది
ఏమి ఆ హొయలు...!
ఏమి కులుకు.. సెలయేటి పిలుపు..
అది ఏమి అడుగు.. కలహంస నడుగు..
హోయ్...ఏమి ఆ లయలు..!
కలగా కదిలే ఆ అందం..
కలగా కదిలే ఆ అందం
కావాలన్నది నా హృదయం..
కావాలన్నది నా హృదయం..
ఓ.... శ్రావణ నీరదా...శారదా...
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ.. ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా
చరణం 2 :
నీలి కళ్ళలో... నా నీడ చూసుకొని..
పాల నవ్వులో... పూలు దోచుకొని
నీలి కళ్ళలో.. నీడ చూసుకొని..
పాల నవ్వులో.. పూలు దోచుకొని..
పరిమళించేనా...!
చెండువోలే..విరిదండవోలే..
నిను గుండె కద్దుకొని..
నిండు ముద్దు గొని..
పరవశించేనా..!
అలలై పొంగే అనురాగం..
అలలై పొంగే అనురాగం
పులకించాలి కలకాలం...
పులకించాలి కలకాలం
ఓ.... శ్రావణ నీరదా...శారదా...
ఓ..శారదా... నను చేరగా
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ.. ఏమిటమ్మా సిగ్గా..
ఎరుపెక్కే లేతబుగ్గా..శారదా..
ఓ.... శ్రావణ నీరదా...శారదా...
అహా..ఒహో..అహా..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి