RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ganga manga movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ganga manga movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, మార్చి 2024, ఆదివారం

తొలి వలపులలో ఏ చెలికైన | Tolivalapulalo ye chelikaina | Song Lyrics | Ganga Manga (1973)

తొలి వలపులలో ఏ చెలికైన



చిత్రం: గంగ - మంగ (1973)

సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


తొలి వలపులలో ఏ చెలికైన 

అలక ఉండునని విన్నాను..

అది కవుల కల్పననుకున్నాను ..

అది కవుల పైత్యమనుకున్నాను ..

నీలో నాపై అలకను చూసి 

వలపు చేష్టలనుకున్నాను ..

నీ చెలిమి కోరుతూ ఉన్నాను..


మాయలు చేసి మీ మగవారు 

మాటలు చాలా నేర్చారు..

ప్రతి మగువకిలాగే చెబుతారు..

ఆడది తానే చెంతకు వస్తే 

అలిగే పనులే చేస్తారు..

ఆ అలకే వలపనుకుంటారు ..


చరణం 1:


కోరినవాణ్ని కొంగు ముడేసి 

తిప్పదలచుకుంటారు..

మరో మగువతో మాటాడగనే 

మూతి ముడుచుకుంటారు..

మొగము తిప్పుకుంటారు..


సేవ పేరుతో చేకిలి నొక్కి 

సరసం మాడుతుంటారు..

నిజం తెలిస్తే బుజం తడుముకొని 

నీతులు పలుకుతు ఉంటారు..

సాకులు చెబుతూ ఉంటారు


తొలి వలపులలో ఏ చెలికైన 

అలక ఉండునని విన్నాను..

అది కవుల కల్పననుకున్నాను

మాయలు చేసి మీ మగవారు 

మాటలు చాలా నేర్చారు..

ప్రతి మగువకిలాగే చెబుతారు..


చరణం 2:


ఆడవారు తమ అనురాగంలో 

అనుమానం పడుతుంటారు

లోపల మమత పైన కలతతో 

సతమతమవుతూ ఉంటారు

కుత కుత లాడుతూ ఉంటారు


తేనెటీగలో ఉన్న గుణాలు 

మగవారలలో ఉంటాయి

వీలు దొరికితే వారి తలపులు 

దారి తప్పుతూ ఉంటాయి

పెడదారి పట్టుతూ ఉంటాయి...


చరణం 3:


కలలోనైనా నా కన్నులలో 

వెలుగుతున్నది నీ రూపం

నీ అందాలను ఆరాధిస్తూ 

పూజించడమే నా ధ్యేయం

జీవించడమే నా గమ్యం


కోరినవారు దూరమవుదురని 

గుబులుపడును నా మనసు

నీ హృదయంలో నాపై ప్రేమ 

నిండుగ ఉందని తెలుసు

అది పొంగుతున్నదని తెలుసు...

ఆ..అహ..ఆ..అ..అహ..ఆ..ఆ

ల.ల.లా..ఉ..ఊ..ఉ..


పాటల ధనుస్సు 

8, మార్చి 2024, శుక్రవారం

తాగాను నేను తాగాను | Taganu Nenu Taganu | Song Lyrics | Ganga Manga (1973)

తాగాను... నేను తాగాను



చిత్రం : గంగ - మంగ (1973)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : సుశీల 


పల్లవి :


తాగాను... నేను తాగాను... 

బాగా నేను తాగాను..తాగాను

భలే నిషాలో ఉన్నాను..ఉన్నాను..

తాగాను..నేను తాగాను   


చరణం 1 :


కైపులో ఉన్నాను కలలుకంటున్నాను

మదిలోని వేదన మరువలేకున్నాను

కైపులో వున్నాను కలలు కంటున్నాను

మదిలోని వేదన మరువలేకున్నాను

మ్మ్ హూ మ్మ్ హూ వలపులో పడ్డాను

వెత తీర్చ వచ్చాను... వలపులో పడ్డాను

నే నెవ్వరో నేనే చెప్పలేకున్నాను

తాగాను...  నేను తాగాను...  

బాగా నేను తాగాను....  తాగాను    


చరణం 2 :


కోటి తారలు నిన్నే కోరుకుంటాయి

అందాలు చందాలు అందజేస్తాయి

కోటి తారలు నిన్నే కోరుకుంటాయి

అందాలు చందాలు అందజేస్తాయి 

మ్మ్ హూ మ్మ్ హూ


ఆ నెలరాజుతో చెలిమి నే కోరలేను

నీ దారిలో నుండి తొలగిపోతాను

మన్నించమన్నాను....  

మరచిపొమ్మంటాను


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు