కొట్టేసిండు జింజర జింజర
చిత్రం : మగాడు (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం : పి.సుశీల
పల్లవి :
కొట్టేసిండు.. జింజర.. జింజర..
జింజర.. జింజర
కొట్టేసిండు బంగారం లాంటి
మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి
కనపడకుండా చెక్కేసిండు
కొట్టేసిండు జింజర జింజర
జింజర జింజర కొట్టేసిండు
చరణం 1 :
ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా
గాలి రెక్కలపై ఏ వేళవస్తాడో..
పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
గాలి రెక్కలపై ఏ వేళ వస్తాడో..
పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
వాడు తుమ్మెదలంటాడు..
ఆ తుంటరిదంటాడు
తుమ్మెదలంటాడు
ఆ తుంటరిదంటాడు
ఒక రేకైన నలగకుండా
దోచుకుపోయిండు..
తేనెలు దోచుకుపోయిండు
కొట్టేసిండు జింజర జింజర
జింజర జింజర
కొట్టేసిండు బంగారం లాంటి
మనసు.. కొట్టేసిండు.... కొట్టేసిండు
చరణం 2 :
ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా... ఆ...
వాని చూపుల్లో కైపారు మెరిసింది..
వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది
వాని చూపుల్లో కైపారు మెరిసింది..
వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది
వాడు పగటి సందురూడు...
నిశి రాతిరి సూర్యుడు
పగటి సందురూడు...
నిశి రాతిరి సూర్యుడు
కదిలేటి వెన్నెల్లో సెగలు రేపుతాడు . .
భల్ సెగలు రేపుతాడు
కొట్టేసిండు జింజర జింజర
జింజర జింజర
కొట్టేసిండు బంగారం లాంటి
మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి
కనపడకుండా చెక్కేసిండు
కొట్టేసిండు జింజర జింజర
జింజర జింజర కొట్టేసిండు
జింజర జింజర జింజర జింజర
- పాటల ధనుస్సు








