RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఏనాడు అనుకోనిదీ | Yenadu Anukonidi | Song Lyrics | Doralu Dongalu (1976)

ఏనాడు అనుకోనిదీ



చిత్రం :  దొరలు దొంగలు (1976)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  మల్లెమాల

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ


వెల లేనిది... కల కానిది... ఇలలోన సరి రానిదీ

ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ



చరణం 1 :


వెన్నెల పొదిగిన దొన్నెలు... కన్నులు

పెదవుల కందించనా.. పరవశ మొ౦దించనా


అందం విరిసిన ఆమని వేళా

విందులు కొదవుండునా.. వింతలు లేకుండునా

వేడుక.. వాడుక.. కాకుండనా...


ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ



చరణం 2 :


కౌగిట అదిమి...  హృదయం చిదిమి

మధువులు కురిపించనా.. 

మదనుని మురిపించనా   


అందని స్వర్గం ముందు నిలిచితే

ఎందుకు పోమ్మ౦దునా.. 

ఇది వేళ కాదందునా

తీరిక.. కోరిక.. లేదందునా



ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ

వెల లేనిది.. కల కానిది.. ఇలలోన సరి రానిదీ

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ


పాటల ధనుస్సు 


22, సెప్టెంబర్ 2022, గురువారం

ఇంటింటి రామాయణం | Intinti Ramayanam | Song Lyrics | Intinti Ramayanam (1979)

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం



చిత్రం: ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్-నాగేంద్ర

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి :


ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము

ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము

సీతమ్మ చిలకమ్మ.. రామయ్య గోరింక

వలపుల తలపుల సరాగం

ఇంటింటి రామాయణం.. 

వింతైన ప్రేమాయణం.. అహహ



చరణం 1 :


నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము

నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము

నీవాడే ఊసులన్ని రతనాల రాశులే


నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట

నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట

నీతోటి ఆశలన్ని సరసాల పాటలు.. 

ముత్యాల మూటలు


అల్లల్లే ఎహే ఇంటింటి రామాయణం 

వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము

చిలకమ్మ గోరింక అ సిరిమల్లే అ పొదరినట

చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట 

నవ్వాలి నవ్వాలి

కలిసి కిలకిల నవ్వాలి కలిసి కిలకిల నవ్వాలి

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం



చరణం 2 :


సరి అంచు చీరలు తెస్తా.. కవరింగు సరుకులు పెడతా

సరి అంచు చీరలు తెస్తా.. కవరింగు సరుకులు పెడతా

తెమ్మంటే మాయలేడి.. తేలేనే నిన్నొదిలి

ఓ ఓ ఓ ఓ ఒహొహొహొహొ హొయ్


మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను

మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను

కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి పోకురా 

కలిసి మెలిసి ఉండరా

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం ఓయ్


చరణం 3 :


ఇల్లేకదా స్వర్గసీమ.. ఇద్దరిది చెరగని ప్రేమ

ఇల్లేకదా స్వర్గసీమ.. ఇద్దరిది చెరగని ప్రేమ

కలతలేని కాపురాన కలలన్ని పండాలి


అహహహహ మోజున్న ఆలుమగలు 

కులకాలి రేయిపగలు

మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు

మన ఇద్దరి పొందికచూసి ఈ లోకం మెచ్చాలి 

దీవెనలే ఇవ్వాలి


ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము

సీతమ్మ ... చిలకమ్మ రామయ్య... గోరింక 

వలపుల తలపుల సరాగం

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం 

కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము


పాటల ధనుస్సు 


వీణ వేణువైన సరిగమ విన్నావా | Veena venuvaina | Song Lyrics | Intinti Ramayanam (1979)

వీణ వేణువైన సరిగమ విన్నావా



చిత్రం: ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్-నాగేంద్ర

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: బాలు, జానకి


పల్లవి :


వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

తనువు తహతహలాడాల చెలరేగాల

చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...


వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా


చరణం 1 :


ఊపిరి తగిలిన వేళ.. నే వంపులు తిరిగిన వేళ

నా వీణలో నీ వేణువే పలికే రాగమాలా

ఆ...ఆ.. లాలలా... ఆ...


చూపులు రగిలిన వేళ…  ఆ చుక్కలు వెలిగిన వేళ

నా తనువునా అణువణువునా జరిగే రాసలీలా ..


వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా


చరణం 2 :


ఎదలో అందం ఎదుటా.. ఎదుటే వలచిన వనితా

నీ రాకతో నా తోటలో  వెలసే వనదేవతా

ఆ... ఆ.. లాలలా... ఆ...


కదిలే అందం కవితా... అది కౌగిలికొస్తే యువతా

నా పాటలో నీ పల్లవే... నవతా నవ్య మమతా


వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

తనువు తహతహలాడాల... చెలరేగాల

చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...


వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

ఓ.. లాలలాలాలాలలలల

ఓ... ఓ.. లాలలాలాలాలలలల


పాటల ధనుస్సు


15, సెప్టెంబర్ 2022, గురువారం

నిన్ను మరిచిపోవాలనీ | Ninnu Marachipovalani | Song Lyrics | Manchi Manushulu (1974)

నిన్ను మరిచిపోవాలనీ



చిత్రం:  మంచి మనుషులు (1974)

సంగీతం:  కె.వి. మహదేవన్

గీతరచయిత:  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం:  బాలు


పల్లవి:


నిన్ను మరిచిపోవాలనీ.. 

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక... మానుకున్నా.. ..


నిన్ను మరిచిపోవాలనీ.. 

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక... మానుకున్నా.. ..


చరణం 1:


నువ్వు విడిచి వెళ్ళినా.... 

నీ రూపు చెరిగిపోలేదూ..ఊ

నువ్వు మరలి రాకున్నా 

నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ

నువ్వు విడిచి వెళ్ళినా.... 

నీ రూపు చెరిగిపోలేదూ..ఊ

నువ్వు మరలి రాకున్నా 

నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ....


తలుపు తెరిచి ఉంచుకొనీ.. 

తలవాకిట నిలిచున్నా..ఆ

వలపు నెమరేసుకుంటూ.. 

నీ తలపులలో బ్రతికున్నా..ఆ


నిన్ను మరిచిపోవాలనీ.. 

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక... మానుకున్నా.. ..


చరణం 2:


ఎందుకిలా చేశావో..ఓ..నీకైనా తెలుసా

నేనెందుకింకా ఉన్నానో.. 

నాకేమో తెలియదూ..ఊ..

ఎందుకిలా చేశావో..ఓ..నీకైనా తెలుసా

నేనెందుకింకా ఉన్నానో.. 

నాకేమో తెలియదూ..ఊ..


నేను చచ్చిపోయినా.. 

ఆ నా ఆశ చచ్చిపోదులే...

నిన్ను చేరు వరకు .. 

నా కళ్ళు మూతపడవులే..


నిన్ను మరిచిపోవాలనీ.. 

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక...మానుకున్నా.. ..


చరణం 3:


గుండెలోన చేశావూ..ఊ.. 

ఆరిపోని గాయాన్నీ..ఈ

మందుగా ఇచ్చావు.. 

మన వలపు పంట పసివాణ్ణీ..

గుండెలోన చేశావూ..ఊ.. 

ఆరిపోని గాయాన్నీ..ఈ

మందుగా ఇచ్చావు.. 

మన వలపు పంట పసివాణ్ణీ..


ఆ లేత మనసు తల్లికోసం.. 

తల్లడిల్లుతున్నదీ..

నీ తల్లి మనసు తెలియకనే 

దగ్గరవుతూ వున్నదీ..


నిన్ను మరిచిపోవాలనీ..

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక...మానుకున్నా.. ..


పాటల ధనుస్సు 


నీవు లేని నేను లేను | Neevule nenu lenu | Song Lyrics | Manchi Manushulu (1974)

నీవు లేని నేను లేను



చిత్రం :  మంచి మనుషులు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం :  బాలు, సుశీల



పల్లవి:


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ఆహ..ఆహ..ఆహా..ఆహ...ఆ..ఆ..


నీవు లేని నేను లేను.. 

నేను లేక నీవు లేవు

నేనే నువ్వు.. నువ్వే నేను 

నేనే నువ్వు నువ్వే నేను లేనిచో..

ఈ జగమే లేదు..


నీవు లేని నేను లేను.. 

నేను లేక నీవు లేవు

నేనే నువ్వు.. నువ్వే నేను 

నువ్వే నేను నేనే నువ్వు లేనిచో..

ఈ జగమే లేదు..


చరణం 1:


తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ

పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ..

తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ

పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ..


తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ..

తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ...

తేనెకు మన ముద్దేలే తీపినిచ్చేదీ..తీపినిచ్చేదీ..


నీవు లేని నేను లేను..నేను లేక నీవు లేవు

నేనే నువ్వు..నువ్వే నేను 

నువ్వే నేను నేనే నువ్వు లేనిచో..

ఈ జగమే లేదు..


చరణం 2:


నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ..ఈ

నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ..


సృష్టిలోని అణువు అణువులో..

వున్నామిద్దరమూ..ఊ..ఊ

జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ ....


నీవు లేని నేను లేను..నేను లేక నీవు లేవు

నేనే నువ్వు..నువ్వే నేను 

నువ్వే నేను నేనే నువ్వు లేనిచో..

ఈ జగమే లేదు..


చరణం 3:


కొండల్లే నువ్వున్నావు.. నాకు అండగా..ఆ..

మంచల్లే నువ్వున్నావూ.. నాకు నిండుగా..ఆ..ఆ..

కొండల్లే నువ్వున్నావు.. నాకు అండగా..ఆ..

మంచల్లే నువ్వున్నావూ.. నాకు నిండుగా..ఆ..ఆ..


ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా..

ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా..

నిన్నా..నేడు రేపే లేని..ప్రేమ జంటగా..ఆ..ఆ

ప్రేమ జంటగా..ఆ...


నీవు లేని నేను లేను..నేను లేక నీవు లేవు..

నీవు లేని నేను లేను..నేను లేక నీవు లేవు...

నేనే నువ్వు..నువ్వే నేను 

నువ్వే నేను నేనే నువ్వు లేనిచో..

ఈ జగమే లేదు..

అహ..అహ..హహా..హా.హా...


పాటల ధనుస్సు 


పడకు పడకు వెంట పడకు | Padaku padaku venta padaku | Song Lyrics | Manchi Manushulu (1974)

పడకు పడకు వెంట పడకు



చిత్రం :  మంచి మనుషులు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


పడకు పడకు వెంట పడకు..

పడచు పిల్లకు ఆశపడకు

పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 

చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ

పడకు పడకు వెంట పడకు..

పడచు పిల్లకు ఆశపడకు

పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 

చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ


పడకు పడకు..అడ్డుపడకు 

పడుచు వాణ్ణి చేయి విడకు

పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..

చినదానా..ఆ..ఆ..ఆ..ఆ

పడకు పడకు..అడ్డుపడకు 

పడుచు వాణ్ణి చేయి విడకు

పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..చినదానా..

ఆ..ఆ..ఆ..ఆ


చరణం 1:


లైలా...ఆ..ఆ....ఆ..ఆ


మజ్ఞూ..ఊ..ఊ..ఊ..మజ్ఞూ...ఊ..ఊ..ఊ


మేలిముసుగులో పైడిబొమ్మలా 

మిసమిసలాడే లైలా...

నీ సొగసుకు సలాము చేస్తున్న.. 

నీ సొగసుకు సలాము చేస్తున్నా....


సొగసును మించిన మగసిరితో 

నా మనసును దోచిన మజ్ఞూ..

నీ మమతకు గులామునవుతున్న..

నీ మమతకు గులామునవుతున్న


పెళ్ళికూతురై...ఈ..ఈ..

వెళ్ళుతున్నావా...ఆ..ఆ

మన ప్రేమను ఎడారి చేశావా..

మన ప్రేమను ఎడారి చేశావా..

పెళ్ళి తనవుకే..ఏ..ఏ...చేశారూ..ఊ..

మన ప్రేమ మనసుకే వదిలారూ..

మన ప్రేమ మనసుకే వదిలారూ..

లైలా..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..


పడకు పడకు వెంట పడకు..

పడచు పిల్లకు ఆశపడకు

పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ ..

ఏహే..ఏ...

పడకు పడకు..అడ్డుపడకు 

పడుచు వాణ్ణి చేయి విడకు

పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..చినదానా..

ఆ..ఆ..ఆ..ఆ


చరణం 2:


అనార్....  సలీం..


గులాబి పూలతోటలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

ఖవ్వాలి తీపిపాటలో..గులాబి పూలతోటలో..

ఖవ్వాలి తీపిపాటలో

సలీము లేత గుండెకు..

షరాబు మత్తు చూపినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

అనార్కలీవి నువ్వు..అనార్కలీవి నువ్వు..


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

మొఘల్ సింహాసనానికి.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ

కసాయి శాసనానికి...

మొఘల్ సింహాసనానికి..

కసాయి శాసనానికి

సవాల్‌గా.. జవాబుగా.. 

గరీభ్నేవరించినా..ఆ..ఆ..ఆ

జహాపనావు నువ్వు.. జహాపనావు నువ్వు


సలీం....సలీం....సలీం....

అనార్..............

పవిత్ర ప్రేమకు.. సమాధి లేదులే..ఏ..ఏ..ఏ

చరిత్ర మొత్తమే..విషాధగాథలే..ఏ..ఏ..ఏ..

విషాధగాథలే..


పడకు పడకు వెంట పడకు..

పడచు పిల్లకు ఆశపడకు

పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ ..

ఏహే..ఏ...

పడకు పడకు..అడ్డుపడకు 

పడుచు వాణ్ణి చేయి విడకు

పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..

చినదానా..ఆ..ఆ..ఆ..ఆ..

పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ ..

ఏహే..ఏ...

పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..

చినదానా..ఆ..ఆ..ఆ..ఆ..

పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ ..


పాటల ధనుస్సు 


14, సెప్టెంబర్ 2022, బుధవారం

విను నా మాట విన్నావంటే | Vinu naa mata | Song Lyrics | Manchi Manushulu (1974)

విను నా మాట విన్నావంటే



చిత్రం :  మంచి మనుషులు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం :  బాలు, సుశీల



పల్లవి:


విను నా మాట.. విన్నావంటే..ఏ..

జీవితమంతా..ఆ..ఆ పూవ్వుల బాట..


విను నా మాట.. విన్నావంటే..ఏ..

జీవితమంతా..ఆ..ఆ పూవ్వుల బాట..


చరణం 1:


ఎన్నడు నీవు ఏడవకూ..

కన్నుల నీరు రానీకు

ఎన్నడు నీవు ఏడవకూ..

కన్నుల నీరు రానీకు

కష్టాలందూ నవ్వాలి..

కలకల ముందుకు సాగాలీ..


కంటికి వెలుగూ..ఇంటికి వెలుగూ.. 

ఆరని జ్యోతి..నువ్వే..నువ్వే..

విను నా మాట విన్నావంటే.. 

జీవితమంతా పూవ్వుల బాట


చరణం 2:


బిడ్డలు ముద్దుగా పెరగాలీ..

పెద్దల ముచ్చట తీర్చాలీ

బిడ్డలు ముద్దుగా పెరగాలీ..

పెద్దల ముచ్చట తీర్చాలీ

ఆటలు హాయిగ ఆడాలి..

చదువులు పెద్దవి చదవాలీ


ఇంటికి పేరూ..ఊరికి పేరూ..

తెచ్చేవాడివి నువ్వే నువ్వే..

విను నా మాట విన్నావంటే.. 

జీవితమంతా పూవ్వుల బాట


చరణం 3:


తల్లీతండ్రి ఒకరయినా..

దైవసమానం తల్లి సుమా..

తల్లీతండ్రి ఒకరయినా..

దైవసమానం తల్లి సుమా..

దీవిస్తుంది మీ అమ్మ..

దేవునిలాగే కనపడక..

చల్లని మనసూ..తీయని మమత..

చక్కని బ్రతుకూ.. నీదే..నీదే..


ఇది నీమాట..ఆ..విన్నానంటే..ఏ..

జీవితమంతా..ఆ..పూవ్వుల బాటా

ఇది నీమాట విన్నానంటే 

జీవితమంతా పూవ్వుల బాటా...


పాటల ధనుస్సు 


12, సెప్టెంబర్ 2022, సోమవారం

హరిలో రంగ హరి ఈ అమ్మాయిగారి పని హరి | Harilo Ranga Hari | Song Lyrics | Manchi Manushulu (1974)

హరిలో రంగ హరి ఈ అమ్మాయిగారి పని హరి



చిత్రం :  మంచి మనుషులు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం :  బాలు, సుశీల



పల్లవి:


శ్రీమద్రమారమణగోవిందో..ఓ..ఓ..హారి

హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ అమ్మాయిగారి పని హరి

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి

హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ అమ్మాయిగారి పని హరి


శ్రీమద్రమారమణగోవిందో..ఓ..ఓ..హారి

హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ.. అబ్బాయిగారి పని హరి..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి

హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ అబ్బాయి గారి పని హరి


చరణం 1:


చల్లగాలి తగిలిందంటే..పిల్లదానికి రెపరెపలు

చల్లగాలి తగిలిందంటే..పిల్లదానికి రెపరెపలు


పిల్ల గాలి సోకిందంటే..కుర్రవాడికి గుబగుబలు

పిల్ల గాలి సోకిందంటే..కుర్రవాడికి గుబగుబలు


గుబులు రేగిన కుర్రవాడు..కూడ కూడ వస్తానంటే


గూబ మీద చెయ్యి ఒకటి.. గుయ్యీమంటూ మోగిందంటే..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి


హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ... అమ్మాయిగారి పని హరి

హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ అబ్బాయి గారి పని హరి



చరణం 2:


వెంటపడిన కొంటే వాణ్ణి..ఇంటిదాక రానిచ్చి

తోడు వచ్చిన దొరబిడ్డా..ఆ.. పోయి రమ్మని తలుపే మూస్తే

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..

హరిలో రంగ హరీ..హరిలో రంగ హరీ


వెంటపడిన కొంటే వాణ్ణి..ఇంటిదాక రానిచ్చి

తోడు వచ్చిన దొరబిడ్డా..ఆ.. పోయి రమ్మని తలుపే మూస్తే

తలుపు మూసిన తలుపుల్లోనా తరుముకొస్తూ వాడేవుంటే

తలుపు మూసిన తలుపుల్లోనా తరుముకొస్తూ వాడేవుంటే

తెల్లవార్లూ కలలోకొచ్చి అల్లరల్లరి చేశాడంటే..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..హరిలో రంగ హరి ....


చరణం 3:


దోర వయసు జోరులోన..కన్నుమిన్ను కానరాక

జారిజారి కాలు జారి.. గడుసువాడి వడిలో పడితే

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..హరిలో రంగ హరి 


దోర వయసు జోరులోన..కన్నుమిన్ను కానరాక

జారిజారి కాలు జారి..గడుసువాడి వడిలో పడితే




మనసు జారి..ఈ..పోతేగాని కాలు జారదు కన్నెపిల్ల

మనసు జారి..ఈ..పోతేగాని కాలు జారదు కన్నెపిల్ల

గడసువాడది తెలుసుకోక..వడిని పట్టి లొట్టలేస్తే..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి


హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ.. అమ్మాయిగారి పని హరి..

హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ.. అబ్బాయిగారి పని హరి..


హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి..

హరిలో రంగ హరి..హరిలో రంగ హరి

హరి హరి హరి హరి హరి హరి హరి హరి....


పాటల ధనుస్సు 



9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది | Pellayyindi | Song Lyrics | Manchi Manushulu (1974)

పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది



చిత్రం :  మంచి మనుషులు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం :  బాలు, సుశీల 





పల్లవి :


పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

వయసు ఉరికింది... సొగసు బెదిరింది

పెదవి అదిరింది... పంటానొక్కింది



పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

వయసు ఉరికింది... సొగసు బెదిరింది

పెదవి అదిరింది... పంటానొక్కింది

పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది



చరణం 1 :



కమ్మని కల వచ్చింది... ఆ కలకొక రూపొచ్చింది

కమ్మని కల వచ్చింది... ఆ కలకొక రూపొచ్చింది


జరిగినది గురుతొచ్చింది... ఇక జరిగేది ఎదురొచ్చింది

జరిగినది గురుతొచ్చింది... ఇక జరిగేది ఎదురొచ్చింది


కళ్ళకు జత కుదిరింది... కతలెన్నో చెబుతుంది

పెదవి మీద రాసుంది చదివి చెప్పమన్నది


పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది



చరణం 2 :



కుర్రతనం కొత్త రుచులు కోరింది...

రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది


కుర్రతనం కొత్త రుచులు కోరింది...

రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది


గడుసుతనం కొసరిస్తా.. అసలు ఇవ్వనన్నది

ప్రతి రోజు కొసరిస్తే... అసలు మించిపోతుంది


పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది



చరణం 3 :


ఎప్పుడో నన్నిచ్చాను... ఇంకిప్పుడేమి ఇస్తాను

ఇన్నాళ్ళు ఇవ్వనివి... మిగిలి ఎన్నెన్నో ఉన్నవి

ఎప్పుడో నన్నిచ్చాను... ఇంకిప్పుడేమి ఇస్తాను

ఇన్నాళ్ళు ఇవ్వనివి... మిగిలి ఎన్నెన్నో ఉన్నవి


ఇపుడే తెలిసింది... ఎప్పుడేప్పుడని ఉంది

మూడుముళ్ళు వేసినది... ఏడడుగులు నడిచినది

అందుకే... ఆ విందుకే... అహహా... 

అహహా... అహహా... ఆ... ఆ...



పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

వయసు ఉరికింది... సొగసు బెదిరింది

పెదవి అదిరింది... పంటానొక్కింది

పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

ప్రేమవిందుకు వేళయింది... 

ప్రేమవిందుకు వేళయింది


పాటల ధనుస్సు 


8, సెప్టెంబర్ 2022, గురువారం

గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది | Goppolla Chinnadi | Song Lyrics | Koduku Kodalu (1972)

గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది



చిత్రం: కొడుకు కోడలు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల



పల్లవి:


గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది

కొండమీది కోతల్లే... చిక్కనంటది

చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది...



చరణం 1:


నడుమెంత చిన్నదో... నడకంత చక్కంది

చూపెంత చురుకైందో... రూపంత సొగసైంది

నడుమెంత చిన్నదో... నడకంత చక్కంది

చూపెంత చురుకైందో... రూపంత సొగసైంది


మనిషేమో దుడుకైంది... వయసేమో ఉడుకైంది

మనిషేమో దుడుకైంది... వయసేమో ఉడుకైంది

మనసేలా ఉంటుందో... అది ఇస్తేనే తెలిసేది


గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది

కొండమీది కోతల్లే... చిక్కనంటది

చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది...



చరణం 2:


ఒంటరిగా వచ్చిందంటే... 

జంటకోసమై ఉంటుంది

పేచితో మొదలెట్టిందంటే... 

ప్రేమ పుట్టే ఉంటుంది

హ.. ప్రేమ పుట్టే ఉంటుంది


కొమ్మమీది దోరపండు... 

కోరుకుంటే చిక్కుతుందా

నాకు దక్కుతుందా..హ...హ..

కొమ్మమీది దోరపండు... 

కోరుకుంటే చిక్కుతుందా

కొమ్మ పట్టి గుంజితేనే కొంగులోకి పడుతుంది


గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది

కొండమీది కోతల్లే... చిక్కనంటది

చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది...


చరణం 3:


ఊరుకున్న కుర్రవాడ్ని... ఉడికించుకు పోతుంది

మాపటికి పాపమంత... వేపించుకు తింటుంది

ఒక్క చోట నిలువలేక... పక్క మీద ఉండలేక

ఆ టెక్కు నిక్కు తగ్గి... రేపిక్కడికే తానొస్తుంది


గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది

కొండమీది కోతల్లే... చిక్కనంటది

చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది...

లలలేలాలాలేలల... లలలేలాలాలేలల


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు