విను నా మాట విన్నావంటే
చిత్రం : మంచి మనుషులు (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
విను నా మాట.. విన్నావంటే..ఏ..
జీవితమంతా..ఆ..ఆ పూవ్వుల బాట..
విను నా మాట.. విన్నావంటే..ఏ..
జీవితమంతా..ఆ..ఆ పూవ్వుల బాట..
చరణం 1:
ఎన్నడు నీవు ఏడవకూ..
కన్నుల నీరు రానీకు
ఎన్నడు నీవు ఏడవకూ..
కన్నుల నీరు రానీకు
కష్టాలందూ నవ్వాలి..
కలకల ముందుకు సాగాలీ..
కంటికి వెలుగూ..ఇంటికి వెలుగూ..
ఆరని జ్యోతి..నువ్వే..నువ్వే..
విను నా మాట విన్నావంటే..
జీవితమంతా పూవ్వుల బాట
చరణం 2:
బిడ్డలు ముద్దుగా పెరగాలీ..
పెద్దల ముచ్చట తీర్చాలీ
బిడ్డలు ముద్దుగా పెరగాలీ..
పెద్దల ముచ్చట తీర్చాలీ
ఆటలు హాయిగ ఆడాలి..
చదువులు పెద్దవి చదవాలీ
ఇంటికి పేరూ..ఊరికి పేరూ..
తెచ్చేవాడివి నువ్వే నువ్వే..
విను నా మాట విన్నావంటే..
జీవితమంతా పూవ్వుల బాట
చరణం 3:
తల్లీతండ్రి ఒకరయినా..
దైవసమానం తల్లి సుమా..
తల్లీతండ్రి ఒకరయినా..
దైవసమానం తల్లి సుమా..
దీవిస్తుంది మీ అమ్మ..
దేవునిలాగే కనపడక..
చల్లని మనసూ..తీయని మమత..
చక్కని బ్రతుకూ.. నీదే..నీదే..
ఇది నీమాట..ఆ..విన్నానంటే..ఏ..
జీవితమంతా..ఆ..పూవ్వుల బాటా
ఇది నీమాట విన్నానంటే
జీవితమంతా పూవ్వుల బాటా...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి