RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, సెప్టెంబర్ 2022, గురువారం

మేఘాల పందిరిలోనా | Meghala Pandirilona | Song Lyrics | Vayyari Bhamalu Vagalamari Bhartalu (1982)

మేఘాల పందిరిలోనా



చిత్రం :  వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా

మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా

అది చూపై.. విరి తూపై... కురిసింది పూలవానా

ఓ... కురిసింది పూలవానా


రాగాలపల్లకిలోనా...  

పిలిచింది వలపే ఔనా

అది పాటై... విరిబాటై... 

వెలసింది జీవితానా

ఓ... వెలసింది జీవితానా


మేఘాల పందిరిలోనా... 

మెరిసింది మెరుపే ఔనా  




చరణం 1 :


గగనాల తార భువనాల జారి.. 

నన్ను చేరు వేళలో

నీవే ఆ తారై మదిని వెలిగినావులే...


ఇల వంక జారు.. నెలవంక తీరు... 

గోట మీటు వేళలో

నీవే నా నీడై... మనసు తెలిపినావులే... 

మరులుగొలిపినావులే

అననీ విననీ ఏ రాగం... మనలో పలికే సరాగం..


మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా

అది చూపై.. విరి తూపై... కురిసింది పూలవానా

ఓ... కురిసింది పూలవానా


రాగాలపల్లకిలోనా...  పిలిచింది వలపే ఔనా



చరణం 2 :


నీ తీపి ఉసురు... నా వైపు విసిరి... 

వెల్లువైన వేళలో

నాలో అల నీవై... కలలు రేపినావులే


నీ నీలికనుల లేలేత కలలు వెల్లడైన  వేళలో...

నాలో ఎద నీవై... నిదుర లేచినావులే

కదలి పాడినావులే


మనసే కలిసే వేతీరం... 

విరిసే మమతా కుటీరం 



రాగాలపల్లకిలోనా.. పిలిచింది వలపే ఔనా

అది పాటై... విరిబాటై... వెలసింది జీవితానా

ఓ... వెలసింది జీవితానా


మేఘాల పందిరిలోనా... 

మెరిసింది మెరుపే ఔనా


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే | Brahmamokkate Parabrahmamokkate | Annamacharya Keerthana | Annamayya (1997)

 బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య సంకీర్తనలు  గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు