RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, సెప్టెంబర్ 2022, సోమవారం

సుందర బృందవనిలో | Sundara Brindavanilo | Song Lyrics | Krishnarjunulu (1982)

సుందర బృందవనిలో



చిత్రం :  కృష్ణార్జునులు (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


సుందర బృందవనిలో 

ఈ సుందరి సుమసుకుమారి

ఆహా..ఆహహా..హహహా..హహహా..హా

సుందర బృందవనిలో 

ఈ సుందరి సుమ సుకుమారి


జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి

శృతి నీవు అంది...లయ నేనే అంది...

కనుచూపే కల్యాణమంది..

కనుచూపే కల్యాణమంది


సుందర బృందవనిలో 

ఈ సుందరి సుమ సుకుమారి


చరణం 1 :


నా మధు మాసాల ఉదయినిగా.. 

నా మందహాసాల మధువనిగా

ఆ..హా..హ..ఆ..హా..హ..హా హ హా హ హా

నా మధు మాసాల ఉదయినిగా..

నా మందహాసాల మధువనిగా


చిరుకాటుకలద్దితే చీకటిగా

ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా

చిరుకాటుకలద్దితే చీకటిగా

సిరిమల్లె తురిమితే పున్నమిగా

స్వరమైతే నీవు.. జతి నేను అంది..

మనసంటే మాంగల్యమంది.....

మనసంటే మాంగల్యమంది.....


సుందర బృందవనిలో 

ఈ సుందరి సుమ సుకుమారి


చరణం 2 :


ఆ రూపు లావణ్య సుమలతిక..

ఆ చూపు కైలాస హిమకళిక

ఆహా..ఆహహా..హహాహ..హహహా..హా..హా..

ఆ రూపు లావణ్య సుమలతిక..

ఆ చూపు కైలాస హిమకళిక


ఉలి చూపు తగిలితే శిల్పముగా

ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా

ఉలి చూపు తగిలితే శిల్పముగా

చెలి తాను కదిలితే నాట్యముగా

భావాలు నీవి.. రాగాలు నావి

సగమైతే జగమూగునంది.. 

సగమైతే జగమూగునంది


సుందర బృందవనిలో 

ఈ సుందరి సుమ సుకుమారి

ఆహా..ఆహహా..హహహా..హహహా..హా.

జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి

శుతి నీవు అంది..లయ నేను అంది

కనుచూపే కల్యాణమంది.. 

కనుచూపే కల్యాణమంది



సుందర బృందవనిలో 

ఈ సుందరి సుమసుకుమారి

ఆహా..ఆహహా..హహహా..హహహా..హా

సుందర బృందవనిలో 

ఈ సుందరి సుమ సుకుమారి


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు