RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

రావయ్యా రామేశం | Ravayya Ramesham | Song Lyrics | Chuttalunnaru Jagratha (1980)

రావయ్యా రామేశం



చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


రా.. రా.. రా..

రావయ్యా రామేశం...ఏమయ్యా ఆవేశం...

నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను

గిరుక్కు గిరుక్కు గిరుక్కున... గిర గిర గిర గిర గిర


చిన్నారి నాంచారీ ...మన్నించూ ఈ సారీ

నా వెంటే పడుతుంటే ..నీ భరతం పట్టిస్తాను

తళాంగు తళాంగు తళాంగుతోం...తక తక తక తక తక


చరణం 1:


నిలువూ.. ఏమంత బిగువూ..

నిను నిలదీసి వలవేసి లాగేస్తా


అందాక నువ్వొస్తే.. ఆపైన నే చూస్తా ..

తీరా నువు లాగేస్తే.. తీయంగా అంటిస్తా..

చురుక్కు చురుక్కు చురుక్కున... 

చుర చుర చుర చుర చుర


రమ్మంటూ నేనంటే..

రానంటూ నువ్వుంటే... 

గారాలే పోతుంటే..

నీ బుగ్గ చిదిమేస్తాను..

చిటుక్కు చిటుక్కు చిటుక్కున... 

చిట చిట చిట చిట చిట


చిన్నారి నాంచారీ ...మన్నించూ ఈ సారీ

నా వెంటే పడుతుంటే ..నీ భరతం పట్టిస్తాను

తళాంగు తళాంగు తళాంగుతోం...

తక తక తక తక తక


చరణం 2:


అలకా..బంగారు తునకా..

ఏదో అలవోకగా అంటే.. 

అంత కినుకా

అలకా ..బంగారు తునకా.. 

ఏదో అలవోకగా అంటే ..

అంత కినుకా


నీ వైనం చూస్తుంటే ...

హైరానా అవుతుందీ

నన్ను అల్లరి చూస్తుంటే... 

నా గుండే అంటుంది

కలుక్కు కలుక్కు కలుక్కునా... 

కల కల కల కల కల


రమ్మటూ నువ్వంటే... 

రానంటూ నేనుంటే ...

నా మాటా వినకుంటే

నీ ఆట కట్టిస్తాను ...

గబుక్కు గబుక్కు గబుక్కున.. 

గబ గబ గబ గబ గబ


రావయ్యా రామేశం...ఏమయ్యా ఆవేశం...

నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను

గిరుక్కు గిరుక్కు గిరుక్కున... 

గిర గిర గిర గిర గిర


చిన్నారి నాంచారీ ...మన్నించూ ఈ సారీ

నా వెంటే పడుతుంటే ..

నీ భరతం పట్టిస్తాను

తళాంగు తళాంగు తళాంగుతోం...

తక తక తక తక తక


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు