RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
justice chowdary లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
justice chowdary లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, మార్చి 2023, గురువారం

ముద్దు మీద ముద్దు పెట్టు | Muddu meeda muddu pettu | Song Lyrics | Justice Chowdary (1982)

ముద్దు మీద ముద్దు పెట్టు



చిత్రం: జస్టీస్ చౌదరి (1982)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల 


ముద్దు మీద ముద్దు పెట్టు


సిగ్గులన్ని ముగ్గు పెట్టు

బుచ్చి బుచ్చి ముద్దులన్ని

బుగ్గలోనే అచ్చు కొట్టు

వద్దని వాలని పొద్దని చాలని

అబ్బా ఓ చిన్న ముద్దు

అందాల కన్నె ముద్దు

ముద్దులన్ని మూట కట్టు

సిగ్గు నాకు చీర కట్టు

అచ్చి బుచ్చి ముద్దులన్ని

ఆనకొస్తా అట్టి బెట్టు

వద్దనే ఆడదే ముద్దు అనే తోడులే

ఇవ్వూ ఓ చిన్న ముద్దు

అందాల కన్నె ముద్దు

ఓయ్ ముద్దు మీద ముద్దు పెట్టు

ముద్దులన్ని మూట కట్టు


చుక్కలమ్మ నింగిలోనా


చమ్మ చక్కలాడు వేళ

చక్కనమ్మ నేల మీద

ముద్దు ముచ్చటాడు వేళ

పెట్టకుంటే ఒట్టు

పట్టు తేనె ముద్దు

ఒక్కసారి పెట్టుా

నీ పక్క చాటు ముద్దు

పిందకు తెలియని ముద్దు

ఇది పిట్టలు పెట్టే ముద్దు

పిందకు తెలియని ముద్దు

ఇది పిట్టలు పెట్టే ముద్దు

ఇందా పడుచు కిందా

వయసు కిందే అందుకో

పెళ్లికే ముందుగా ప్రేమకే విందుగా

రాణి ముద్దు రాణి

కాని ముందు బోణి

ముద్దులన్ని మూట కట్టు

సిగ్గు నాకు చీర కట్టు

బుచ్చి బుచ్చి ముద్దులన్ని

బుగ్గలోనే అచ్చు కొట్టు

వద్దనే ఆడదే ముద్దు అనే తోడులే

ఇవ్వూ ఓ చిన్న ముద్దు

అందాల కన్నె ముద్దు

ముద్దులన్ని మూట కట్టు

ముద్దు మీద ముద్దు పెట్టుా...


ఊపిరొచ్చి గుండెలోని ఊసులెన్ని చెప్పు వేళ


మల్లెలోని మంచులన్ని చూపుకావిరైన వేళ

చెప్పకుండా పట్టు చెప్పరాని పట్టు

కొత్త వేడిలోనా కోరికల్లే పుట్టు

పెదవులు దాటని ముద్దు

ఇది ప్రేమలకే సరిహద్దు

పెదవులు దాటని ముద్దుా

ఇది ప్రేమలకే సరిహద్దు

దాటి కళలు దాటి కాస్త చోటీ ఇప్పుడే

చీకటి ఎండలా సిగ్గుల నీడలా

ఇస్తా చుక్క ముద్దు

వస్తా పక్కా సద్దు

ముద్దు మీద ముద్దు పెట్టు

లలల...

సిగ్గులన్ని ముగ్గు పెట్టు

లలల...

బుచ్చి బుచ్చి ముద్దులన్ని

లలల...

బుగ్గలోనే అచ్చు కొట్టు

లలల...

వద్దని వాలని పొద్దని చాలని

అబ్బా ఓ చిన్నా ముద్దు

అందాల కన్నె ముద్దు

ముద్దులన్ని మూట కట్టు

లలల...

సిగ్గు నాకు చీర కట్టు

లలల...

అచ్చి బుచ్చి ముద్దులన్ని

ఆఆఆ...

ఆన కోస్తా అట్టి బెట్టు

ఓఓ ఓ...

వద్దనే ఆడదే ముద్దు అనే తోడులే

ఇవ్వూ ఓ చిన్న ముద్దు

అందాల కన్నె ముద్దు

అరె ముద్దు మీద ముద్దు పెట్టు

ముద్దులన్ని మూట కట్టు


పాటల ధనుస్సు  





1, మార్చి 2023, బుధవారం

నీ చెక్కిలి వెల ఎంత | Nee Chekkili vela entha | Song Lyrics | Justice Chowdary (1982)

నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత



చిత్రం: జస్టిస్ చౌదరి (1982)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలు, పి.సుశీల


నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత

హ నీ కౌగిళి వెల ఎంత హ నీ వెచ్చని గిలిగింత

కన్నుకుట్టి నోళ్ళ చూపు కవ్వింత

కన్నుకొట్టి నోళ్ళ ఊపు ఊరంతా

నాకేల ఆ చింత నీ చెంత


నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత

హ నీ కౌగిళి వెల ఎంత హ నీ వెచ్చని గిలిగింత



మల్లెలిచ్చి కొంటాలే మత్తు మత్తు నీ నవ్వు

పాపనిచ్చుకుంటాలే రెప్పలాంటి నీ సోకు

మల్లెలిచ్చి కొంటానే మత్తు మత్తు నీ నవ్వు

పాపనిచ్చుకుంటాలే రెప్పలాంటి నీ సోకు

అందమిచ్చి ఆదుకో అదుపులేని ఆకల్లు

పెడవితోనే వేసుకో ప్రేమ పూల సంకెళ్లు

నీలి కొండ నీటి ఎండ నీడల్లో

గోరువెచ్చ వెన్నెలమ్మ కోనల్లో

వేస్తాలే వెయ్యేళ్ల సంకెళ్లు


నీ చెలిమికి వెల ఎంత హ నీ వెచ్చని వలపంత

హ నీ నవ్వుల వెల ఎంత హ నీ మల్లెల మనసంతా

కన్నుకొట్టి నోళ్ళ ఊపు ఊరంతా

కన్నుకుట్టి నోళ్ళ చూపు కవ్వింత

నాకేల ఆ చింత నీ చెంత


నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత

హ నీ కౌగిళి వెల ఎంత హ నీ వెచ్చని గిలిగింత



సిగ్గులిచ్చి కొంటాలే బుగ్గమీద నీ గుర్తు

దమ్ములిచ్చి కొంటాలే అమ్ముకోని నీ గుర్తు

సిగ్గులిచ్చి కొంటాలే బుగ్గమీద నీ గుర్తు

దమ్ములిచ్చి కొంటాలే అమ్ముకోని నీ గుర్తు

సందె బేరమాడుకో చందమామ సంతల్లో

రాయబార మెందుకో చందమామ సైగల్లో

హత్తుకున్న హాయిగున్న గంటల్లో

హాయికన్న తీయగున్న మంటల్లో

కౌగిళ్ళ నూరేళ్ళ పెళ్ళిళ్ళు


నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత

హ నీ కౌగిళి వెల ఎంత హ నీ ముద్దుల గిలిగింత

కన్నుకుట్టి నోళ్ళ చూపు కవ్వింత

కన్నుకొట్టి నోళ్ళ ఊపు ఊరంతా

నాకేల ఆ చింత నీ చెంత


నీ చెలిమికి వెల ఎంత హ నీ వెచ్చని వలపంత

హ నీ నవ్వుల వెల ఎంత హ నీ మల్లెల మనసంతా


పాటల ధనుస్సు  





28, ఫిబ్రవరి 2023, మంగళవారం

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం | Srilakshmi Pelliki | Song Lyrics | Justice Chowdary (1982)

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం



చిత్రం : జస్టిస్ చౌదరి (1982)

రచన : వేటూరి,

సంగీతం : చక్రవర్తి

గానం : బాలు, సుశీల, శైలజ



పల్లవి:

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం

చిగురులేసే సిగ్గు చీనాంబరాలు

తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు


శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం


 చరణం 1:

కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు

కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు

కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు

కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు


ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని

ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని

పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు

అందాలకెందుకు గంధాల పూతలు

అందాలకెందుకు గంధాల పూతలు

కళ్లకే వెలుతురు మా పెళ్లికూతురు

ఈ పెళ్లికూతురు...


శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం


 

చరణం 2:

అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని

అలుసు చేయవద్దు మీరు తానేమి అడగదని

ఆడగబోదు సిరిసంపదలు ఏనాడూ పెనిమిటిని

అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని

చెప్పలేని మూగబాధ చెప్పకనే తెలుసుకో

మాటలకే అందని మనసు.. 

చూపులతో తెలుసుకో..

రెప్పవలే కాచుకో..


శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం

చిగురులేసే సిగ్గు చీనాంబరాలు

తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు


శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం

మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం


పాటల ధనుస్సు  




27, ఫిబ్రవరి 2023, సోమవారం

అబ్బా ముసురేసింది | Abba Musuresindi | Song Lyrics | Justice Chowdary (1982)

అబ్బా ముసురేసింది ...



చిత్రం: జస్టీస్ చౌదరి (1982)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి:

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

గుండెల్లో ఎండేసే శీతాకాలంలో

నీ సాయం కావాలి సాయంకాలంలో


అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

సాయంగా రావాలి సాయంకాలంలో

నీతోడే కావాలి శీతాకాలంలో


చరణం: 1

పెనుగులాడి పెనవేసుకొనే 

ఆకలౌతా చలికాబోలు

హత్తుకున్న వత్తిడిలోని 

హాయి పేరే చలికాబోలు

ఏమిటో మరి ఎందుకోచలి

ప్రేమలో రుచి పెంచుతున్నది

కౌగిలింతల ఉరివేసుకున్న

భోగిమంటల ఎద కాచుకున్నా

పగలు రేయి సెగలు రేపి

దుప్పటిలోనే తప్పెటగుళ్ళు మోగించేసింది


అబ్బ ముసురేసింది

అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది

అయ్యో చలి వేసింది

సాయంగా రావాలి సాయంకాలంలో

నీతోడే కావాలి శీతాకాలంలో


చరణం: 2

చేతికందని చెలగాటాలకు 

బీడు కలుపే చలికాబోలు

నిదురపోయిన నిన్నటి వలపుల 

మేలుకొలుపే చలికాబోలు

వాడుకో చలి వేడిగా మరి

ఈడుకే ఇది కొత్త ఊపిరి

నిన్ను నాలో కలిపేసుకున్నా

కలిసి ముద్దుల గడి ఏసుకున్నా

పెర పెరలనే సరిగమలతో

గుప్పిటిలోనే గుజ్జన గుళ్ళు ఆడించేసింది


అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

సాయంగా రావాలి సాయంకాలంలో

నీతోడే కావాలి శీతాకాలంలో


అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది

గుండెల్లో ఎండేసే శీతాకాలంలో

నీ సాయం కావాలి సాయంకాలంలో


పాటల ధనుస్సు  


25, ఫిబ్రవరి 2023, శనివారం

చట్టానికి న్యాయానికి | Chattaniki Nyayaniki | Song Lyrics | Justice Chowdary (1982)

చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో


చిత్రం: జస్టీస్ చౌదరి (1982)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు


పల్లవి:


చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో..

ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో..

కడుపు తీపికి కట్టుబడని తీర్పూ..

కన్నీటికి కరిపోనిదీ తీర్పూ..

ఇది ఆ దైవమే..ఏ..ఏ.. ఇచ్చిన తీర్పూ

తప్పా.. తప్పా.. తప్పా.. నెవ్వర్..


I am in the hands of law..

Any thing happens.. it's not my flaw.. 


చరణం 1:


కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం

మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..


కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం

మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..


న్యాయమూర్తిగా నేనున్నప్పుడు.. 

న్యాయస్థానమే నాదయినప్పుడు

నాకు మీరు లేరూ..ఊ..ఊ..

నేను నేను కాను..ఊ.. నేను నేను కానూ..

ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు...

తప్పా.. తప్పా.. తప్పా.. నో..


చరణం 2:


సత్యం కోసం.. హరిశ్చంద్రుడు 

సతీసతులనెడబాసినదీ..ఈ..ఈ

గర్భవతిని సీతమ్మను రాముడు.. 

కారడవికి పంపించినదీ..ఈ..ఈ

కన్న తల్లినే కాదని కర్ణుడు.. 

రాజత్యాగము చేసినదీ..ఈ

కన్న కొడుకునే కాదని నేనీ 

కన్నీటిని దిగమింగుతున్నది..

ఎందుకోసం.. ఆ.. ఎందుకోసం.. ఆ..

దహించినా అది ధర్మం కనుకా.. 

సహించాలి అది సత్యం కనుకా..ఆ..

కృశించినా.. నే నశించినా..ఆ.. 

అది న్యాయం కనుక..ఆ..ఆ

ఆ ఆ..న్యాయమే.. నా ధైవం కనుకా..ఆ..ఆ..


చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో..

ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో..

కడుపు తీపికి కట్టుబడని తీర్పూ..ఊ..ఊ

కన్నీటికి కరిపోనిదీ తీర్పూ..

ఇది ఆ దైవమే..ఏ..ఏ.. ఇచ్చిన తీర్పూ..


పాటల ధనుస్సు  


22, ఫిబ్రవరి 2022, మంగళవారం

నీ తొలిచూపులోనే | Nee Tholi choopulone | Song Lyrics | Justice Chowdary (1982)

నీ తొలిచూపులోనే



చిత్రం: జస్టీస్ చౌదరి (1982) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


నీ తొలిచూపులోనే..ఏ.... 

ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన 

శుభలేఖలే చూసుకోనా.. 

వాడిన వన్నెల వలపుల కుంకుమ 

తిలకాలుగా దిద్దుకోనా.. 

నీ ఎదలో నా ఎదనే శారదవై 

అనురాగాలుగా మీటు వేళా 


నా తొలిచూపుతోనే..ఏ..ఏ.. 

నింగిని నేలకు వంచిన చెక్కిట 

చిరు చుక్కగా ఉండిపోనా... 

అల్లుకుపోయిన ఆశల ముంగిట 

తొలిముగ్గులే దిద్దుకోనా.. 

నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో... 

మనసుయ్యాలగా ఊగు వేళా.. 


చరణం 1: 


చిగురు సొగసు చిదిమితేనే... 

దీపమవ్వాలి నా కంటికీ 

తొడిమలన్నీ పూలు తొడిగీ..

తొలకరించాలి నీ నవ్వుకీ.. 

నీలి నింగీ..తెల్ల మబ్బూ..

గొడుగు పట్టాలి నీ రాకకీ... 

వాగువంకా వెల్లి విరిసీ 

మడుగులొత్తాలి నీ కాళ్ళకీ.. 


కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ 

కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ 

కరిగేది ఎన్నాళ్ళకో.. 

మది ఆలాపనై సాగు వేళా... 


నీ తొలిచూపులోనే.. 

నింగిని నేలకు వంచిన చెక్కిట 

చిరు చుక్కగా ఉండిపోనా... 


చరణం 2: 


కోకిలమ్మ కొత్త చీరా 

సారెలడగాలి మన పెళ్ళికీ 

కోనసీమ కొబ్బరాకు 

పందిరెయ్యాలి మన ఇళ్ళకీ 

మాఘమాసాలు ముందు రావాలి..

మంచి లగ్గాలు చూసీ 

రామచిలకల్ల ప్రేమపలుకుల్లు 

పెళ్ళి మంత్రాలు చేసీ... 


కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ 

మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ 


కరిసేది ఎన్నాళ్ళకో.. 

శుభశకునాలు పలికేటి వేళా 


నా తొలిచూపుతోనే.. 

ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన 

శుభలేఖలే చూసుకోనా 

అల్లుకుపోయిన ఆశల ముంగిట 

తొలి ముగ్గులే దిద్దుకోనా 

నీ ఎదలో నా ఎదనే శారదవై 

అనురాగాలుగా మీటు వేళా...


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు