ముద్దు మీద ముద్దు పెట్టు
చిత్రం: జస్టీస్ చౌదరి (1982)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
ముద్దు మీద ముద్దు పెట్టు
సిగ్గులన్ని ముగ్గు పెట్టు
బుచ్చి బుచ్చి ముద్దులన్ని
బుగ్గలోనే అచ్చు కొట్టు
వద్దని వాలని పొద్దని చాలని
అబ్బా ఓ చిన్న ముద్దు
అందాల కన్నె ముద్దు
ముద్దులన్ని మూట కట్టు
సిగ్గు నాకు చీర కట్టు
అచ్చి బుచ్చి ముద్దులన్ని
ఆనకొస్తా అట్టి బెట్టు
వద్దనే ఆడదే ముద్దు అనే తోడులే
ఇవ్వూ ఓ చిన్న ముద్దు
అందాల కన్నె ముద్దు
ఓయ్ ముద్దు మీద ముద్దు పెట్టు
ముద్దులన్ని మూట కట్టు
చుక్కలమ్మ నింగిలోనా
చమ్మ చక్కలాడు వేళ
చక్కనమ్మ నేల మీద
ముద్దు ముచ్చటాడు వేళ
పెట్టకుంటే ఒట్టు
పట్టు తేనె ముద్దు
ఒక్కసారి పెట్టుా
నీ పక్క చాటు ముద్దు
పిందకు తెలియని ముద్దు
ఇది పిట్టలు పెట్టే ముద్దు
పిందకు తెలియని ముద్దు
ఇది పిట్టలు పెట్టే ముద్దు
ఇందా పడుచు కిందా
వయసు కిందే అందుకో
పెళ్లికే ముందుగా ప్రేమకే విందుగా
రాణి ముద్దు రాణి
కాని ముందు బోణి
ముద్దులన్ని మూట కట్టు
సిగ్గు నాకు చీర కట్టు
బుచ్చి బుచ్చి ముద్దులన్ని
బుగ్గలోనే అచ్చు కొట్టు
వద్దనే ఆడదే ముద్దు అనే తోడులే
ఇవ్వూ ఓ చిన్న ముద్దు
అందాల కన్నె ముద్దు
ముద్దులన్ని మూట కట్టు
ముద్దు మీద ముద్దు పెట్టుా...
ఊపిరొచ్చి గుండెలోని ఊసులెన్ని చెప్పు వేళ
మల్లెలోని మంచులన్ని చూపుకావిరైన వేళ
చెప్పకుండా పట్టు చెప్పరాని పట్టు
కొత్త వేడిలోనా కోరికల్లే పుట్టు
పెదవులు దాటని ముద్దు
ఇది ప్రేమలకే సరిహద్దు
పెదవులు దాటని ముద్దుా
ఇది ప్రేమలకే సరిహద్దు
దాటి కళలు దాటి కాస్త చోటీ ఇప్పుడే
చీకటి ఎండలా సిగ్గుల నీడలా
ఇస్తా చుక్క ముద్దు
వస్తా పక్కా సద్దు
ముద్దు మీద ముద్దు పెట్టు
లలల...
సిగ్గులన్ని ముగ్గు పెట్టు
లలల...
బుచ్చి బుచ్చి ముద్దులన్ని
లలల...
బుగ్గలోనే అచ్చు కొట్టు
లలల...
వద్దని వాలని పొద్దని చాలని
అబ్బా ఓ చిన్నా ముద్దు
అందాల కన్నె ముద్దు
ముద్దులన్ని మూట కట్టు
లలల...
సిగ్గు నాకు చీర కట్టు
లలల...
అచ్చి బుచ్చి ముద్దులన్ని
ఆఆఆ...
ఆన కోస్తా అట్టి బెట్టు
ఓఓ ఓ...
వద్దనే ఆడదే ముద్దు అనే తోడులే
ఇవ్వూ ఓ చిన్న ముద్దు
అందాల కన్నె ముద్దు
అరె ముద్దు మీద ముద్దు పెట్టు
ముద్దులన్ని మూట కట్టు
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి