RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, మార్చి 2023, ఆదివారం

నటరాజు ఆడేను తాండవం | Nataraju Adenu Tandavam | Song Lyrics | RKSS Creations

శివతాండవం - నటరాజు ఆడేను తాండవం 



గీత రచన : రామకృష్ణ దువ్వు 

స్వరకల్పన : S వేణు మాధవ్ 

గానం : మూల శ్రీలత, టి కృష్ణారావు 

రికార్డింగ్ : శ్రీమాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం 

ప్రొడక్షన్ : RKSS Creations...


సాకి: 

 కైలాస శిఖరమే శివపాద స్పర్శతో కంపించి పోగా

 శిరసిడిచి గంగమ్మ తనువంటి స్వేదమై రాగా

 ఆకాశమే అదిరి ప్రద్యుమ్న హారతే ఈయగా

  మహదేవు కదలికతో వాయువిజృంభించి పోగా


పల్లవి:

నటరాజు ఆడేను తాండవం 

ఆ నటరాజు ఆడేను తాండవం

నటరాజు ఆడేను తాండవం 

 ఆ నటరాజు ఆడేను తాండవం

జటా ఝూటములు వింజామరలై

ప్రమధ గణములే భజంత్రీలై 

నాగాభరణమే నాదస్వరముగా

చంద్ర బింబమే వెలిగే దివ్వెగా

ఢమరుక ధ్వనిలో పదములు కదలగ

నటరాజు ఆడేను తాండవం 


చరణం 1:

సకల దేవగణకోటికాహ్వానం పలికి 

శేషనాగశయన బ్రహ్మాదులం గూడి

దక్షుడు తలపెట్టె మహా యజ్ఞము

శివుని పిలువక చేసె మహాపరాధము

ప్రీతితో దరికేగ సతిని ధూషించ

అవమానమగ్నిలో తానె భష్మమై పోగా


 భద్రుడై వీర భద్రుడై

 దిక్కులే పరుగు లెత్తగ


ధరణీ తలమున గిరి ఝరి తలములు 

గగన తలమున సురవర జనములు

ముల్లోకములే వెర వెర బోవగా

ముష్కర మూకల మదములు అణచగ

                                              

నటరాజు ఆడేను తాండవం 

 ఆ నటరాజు ఆడేను తాండవం

నటరాజు ఆడేను తాండవం 

ఆ నటరాజు ఆడేను తాండవం


చరణం 2:

వియోగ వ్యధ లోన పరమేష్ఠి నిలచి 

కైలాస శిఖరాన తపములో మునిగి 

లయ కారుడే మరచె విధి కార్యము 

లోకములు రక్షింప గిరి సుతను కలుపంగ 

శరముతో ఈశుని ప్రకోపించె మరుడు

 మదనాగ్ని లో తనువు మరగి పోగా


రుద్రుడై ప్రళయ రుద్రుడై 

సంద్రమే ఎగసే నింగి పై 


ఫాల నేత్రమున భగ భగ మంటలు  

కుసుమ శరుని ఫెణ ఫెణ కాల్చగ

భస్మమైన పతి కై రతి రోధించగ

పార్వతి ప్రార్ధన హృదయము మీటగ


నటరాజు ఆడేను తాండవం 

ఆ నటరాజు ఆడేను తాండవం

నటరాజు ఆడేను తాండవం 

ఆ నటరాజు ఆడేను తాండవం


- రామకృష్ణ దువ్వు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు