RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, మార్చి 2023, బుధవారం

రామకథను వినరయ్యా | Ramakathanu Vinarayya | Song Lyrics | LavaKusa (1963)

రామకథను వినరయ్యా


చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల రాఘవాచార్య

నేపధ్య గానం :  లీల, సుశీల 



పల్లవి :


రామకథను వినరయ్యా .....

రామకథను వినరయ్యా .....

ఇహపర సుఖములనొసగే 

సీతారామకథను వినరయ్యా

రామకథను వినరయ్యా .....


అయోధ్యా నగరానికి రాజు 

దశరధ మహారాజు

ఆ రాజుకు రాణులు మువ్వురు... 

కౌసల్యా.. సుమిత్రా... కైకేయీ

నోము ఫలములై వారికి కలిగిరి 

కొమరులు నల్వురు

రామలక్ష్మణభరతశత్రుఘ్నులు.... 

ఆ.. ఆ... ఆ.. ఆ... 


రామకథను వినరయ్యా ...

ఇహపర సుఖములనొసగే 

సీతారామకథను వినరయ్యా



చరణం 1 :


ఘడియ ఏని రఘురాముని విడచి 

గడుపలేని ఆ భూజాని

కౌశిక యాగము కాచి రమ్మని...

కౌశిక యాగము కాచి రమ్మని... 

పలికెను నీరదశ్యాముని


రామకథను వినరయ్యా .....




చరణం 2 : 


తాటకి దునిమి జన్నము గాచి... 

తపసుల దీవన తలదాల్చి

జనకుని యాగము చూచు నెపమ్మున .....

జనకుని యాగము చూచు నెపమ్మున

చనియెను మిధిలకు దాశరధి


రామకథను వినరయ్యా .....



చరణం 3 : 


మదనకోటి సుకుమారుని కనుగొని

మిథిలకు మిథిలయే మురిసినది

ధరణిజ మదిలో మెరసిన మోదము...

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ....

ధరణిజ మదిలో మెరసిన మోదము... 

కన్నుల వెన్నెల విరిసినది 


రామకథను వినరయ్యా .....


చరణం 4 :


హరుని విల్లు రఘునాధుడు చేగొని

ఎక్కిడ ఫెళఫెళ విరిగినది

కళకళలాడే సీతారాముల...

ఆ... ఆ... ఆ... ఆ...

కళకళలాడే సీతారాముల...

ఆ... ఆ... ఆ... ఆ...

కళకళలాడే సీతారాముల...

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ

కళకళలాడే సీతారాముల... 

కన్నులు కరములు కలిసినవి


రామకథను వినరయ్యా .....

ఇహపర సుఖములనొసగే 

సీతారామకథను వినరయ్యా


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు