RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
bhale krishnudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bhale krishnudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఏప్రిల్ 2025, బుధవారం

ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి | Muddante Oddanake | Song Lyrics | Bhale Krishnudu (1980)

ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి



చిత్రం :  భలే కృష్ణుడు (1980)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి : 


ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి

ఆహా..

పొద్దున్నే జాబిల్లి పొడిచింది నువ్వొచ్చి

ఆహా..

ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి

పొద్దున్నే జాబిల్లి పొడిచింది నువ్వొచ్చి


సిగ్గులన్ని దాచిపెట్టు..

నిగ్గులన్ని దోచిపెట్టు..

పెట్టకుంటే పెద్దొట్టు..

వద్దంటే వినడమ్మా...

చూస్తాడు గుచ్చి గుచ్చి

పొద్దున్నే మొదలమ్మా 

పొద్దెరగని పిచ్చి..

సిగ్గులన్ని దాచుకుంట..

నిగ్గులన్ని దాచుకుంట..

పెట్టుకుంట పెద్దొట్టు

ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి

ఆహా..

పొద్దున్నే మొదలమ్మా పొద్దెరగనీ పిచ్చి


చరణం 1 :


కుర్ర కోరిక ఎర్ర కోకతో 

లగెత్తుకొస్తుంటే

ముక్కు పుడక ఆ మూతి విరుపుకే 

తళుక్కుమంటుంటే

చూపు వేడికే చిన్న వాడికి 

చురుక్కుమంటుంటే

ఇద్దరొక్కటై కౌగిలింతలో 

ఇరుక్కుపోతుంటే

చుక్కల ఓణి..వెన్నెల బోణీ..

పగలే చేసిపోతుంటే

కన్నుల ఎంగిలి..చేసిన వన్నెలు 

తడిసీ మొపెడవుతుంటే

చల్లారిపోనీకు ఈ  ముద్దు

తెల్లారిపోనివ్వు నా పొద్దూ..

హా..చల్లారిపోనీకు ఈ  ముద్దు

తెల్లారిపోనివ్వు నా పొద్దూ..


ముద్దంటే వద్దనకే 

వయ్యారి నా రత్తి.. రత్తీ

పొద్దున్నే మొదలమ్మా 

పొద్దెరగనీ పిచ్చి... పిచ్చి


చరణం 2 :


కొంగు దాటినా పడుచుపొంగులే 

కొరుక్కు తింటుంటే

నింగినంటినా గడుసు కోరికా 

కొలిక్కి రానంటే


హాయ్..

మత్తు మత్తుగా మల్లె నీడలో 

అతుక్కు పోతుంటే

కొత్త మోజులో చేతి గాజులే 

చిటుక్కుమంటుంటే


వయసె నువ్వై..వలపుల గువ్వై... 

యెదలో గూడు కడుతుంటే

పనులే పాటై..పాటే బ్రతుకై..

జతగా పాడుకుంటుంటే

చల్లారిపోనీకు నా ముద్దు

తెల్లారిపోనివ్వు నా పొద్దూ..

హా..చల్లారిపోనీకు నా ముద్దు

తెల్లారిపోనివ్వు నా పొద్దూ..


ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి

పొద్దున్నే జాబిల్లి పొడిచింది నువ్వొచ్చి

సిగ్గులన్ని దాచిపెట్టు..

నిగ్గులన్ని దోచిపెట్టు..

పెట్టకుంటె పెద్దొట్టు..

వద్దంటే వినడమ్మా..

చూస్తాడు గుచ్చి గుచ్చి

పొద్దున్నే మొదలమ్మా 

పొద్దెరగని పిచ్చి..

సిగ్గులన్ని దాచుకుంట..

నిగ్గులన్ని దాచుకుంట..

పెట్టుకుంట పెద్దొట్టు

హా హా హా..

ముద్దంటె వద్దనకే వయ్యారి నా రత్తి

అమ్మమ్మమ్మా..

పొదూన్నే మొదలమ్మా 

పొద్దెరగని పిచ్చి..పిచ్చి 


- పాటల ధనుస్సు 


బృందావనమొక ఆలయము | Brindavanamoka Alayamu | Song Lyrics | Bhale Krishnudu (1980)

బృందావనమొక ఆలయము



చిత్రం :  భలే కృష్ణుడు (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి : 

ఆ...ఆ...ఆ.. ఆ..
బృందావనమొక ఆలయము.. 
మాధవుడందలి దైవము
అటు ఇటు రెండు దీపాలు.. 
ఆ దేవుని ప్రేమకు రూపాలు


బృందావనమొక ఆలయము.. 
మాధవుడందలి దైవము
అటు ఇటు రెండు దీపాలు.. 
ఆ దేవుని ప్రేమకు రూపాలు

Happy birthday to you daddy.. 
Happy birthday to you daddy.. 


చరణం 1 :


ఎన్నో.. ఇంకెన్నో 
ఇలాంటి రోజులు రావాలి... 
మేం చూడాలి

మా డాడీ మాతో 
ఆడుతు పాడుతూ ఉందాలి.. 
మేం చూడాలి

అమ్మనాన్నకు అరవై ఏళ్లకు 
మళ్ళీ పెళ్ళి జరిగే రోజున
నవ్వే నిండు నవ్వే ఇంటి నిండా 
వెలుగు కావాలి...


బృందావనమొక ఆలయము.. 
మాధవుడందలి దైవము
అటు ఇటు రెండు దీపాలు.. 
ఆ దేవుని ప్రేమకు రూపాలు

Happy birthday to you daddy.. 
Happy birthday to you daddy.. 


చరణం 2 :


సిరులు.. సంపదలు.. 
చిరకాలం మీరై పెరగాలి.. 
మేం చూడాలి

మా ఆశలు మీలో 
పువ్వులుపిందెలు తొడగాలి.. 
మేం పండాలి

భువిపై స్వర్గం బృందావనమై.. 
రోజూరోజు పండుగ రోజై
మీరు.. మీకు మేము.. మాకు మీరు.. 
కను విందు కావాలి 

బృందావనమొక ఆలయము.. 
మాధవుడందలి దైవము
అటు ఇటు రెండు దీపాలు.. 
ఆ దేవుని ప్రేమకు రూపాలు


- పాటల ధనుస్సు 

15, ఏప్రిల్ 2025, మంగళవారం

ఇటిక మీద ఇటికేస్తే | Itukameeda itukeste | Song Lyrics | Bhale Krishnudu (1980)

ఇటిక మీద ఇటికేస్తే



చిత్రం :  భలే కృష్ణుడు (1980)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా

అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా


ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... 

నా చిటికనేలు పట్టుకుంటే 

పెళ్ళౌతాది

ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... 

నా చిటికనేలు పట్టుకుంటే 

పెళ్ళౌతాది


అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా

అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా


ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... 

ఈ కిటుకు తెలుసుకుంటే 

మన పెళ్ళౌతాది

ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... 

ఈ కిటుకు తెలుసుకుంటే 

మన పెళ్ళౌతాది


చరణం 1 :


నిన్ను చూస్తే కన్నుకేమో 

నిదుర పట్టదు..

నీకు ముద్దులిస్తే పాడు మూతి 

ముద్ద ముట్టదు...

నువ్వు చూస్తే పూట పూటా 

పులకరిస్తది..

నువ్వు నవ్వగానే తోటకొక్క 

పువ్వు  పూస్తది


రావిపండు కొండ మీద 

రామచిలుక నేనంట

బావి గట్టు గిలక మీద 

తోటుంది రమ్మంటా


గిలకేమో తిరగాలా... 

చిలకేమో ఎగరాలా

గిలకేమో తిరగాలా... 

చిలకేమో ఎగరాలా

నువ్వెంట తగలాలా... 

పదిమందీ చూడాలా 



అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా

అబ్బబ్బ.. అమ్మాడి అమ్మా... 

అబ్బాడి అబ్బా

అమ్మమ్మ... అమ్మాడి అమ్మా... 

అబ్బాడి అబ్బా

అ... అ... అమ్మాడి అమ్మా... 

అబ్బాడి అబ్బా


ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... 

ఈ కిటుకు తెలుసుకుంటే 

మన పెళ్ళౌతాది

ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... 

నా చిటికనేలు పట్టుకుంటే 

పెళ్ళౌతాది


చరణం 2 :


పట్టపగలు పిట్ట గుబులు 

పుట్టుకొస్తది

అర్ధరాత్రి పైర గాలి 

ప్రాణమౌతది

నువ్వు రాకా పొద్దు పోక 

ఏడిపిస్తది

నువ్వు తాక గానే సోకు 

నాకు ఎక్కువౌతది


తాటి రేవు కుర్రదాన 

ఆకు చిలకలిమ్మంటా

సందె కాడ నీడలోన 

చాటుంది రమ్మంటా


చెయ్యి బుగ్గ వెయ్యాలా... 

చెట్టు మొగ్గలెయ్యాల

చెయ్యి బుగ్గ వెయ్యాలా... 

చెట్టు మొగ్గలెయ్యాల

అవి పూలు పుయ్యాలా... 

నువ్వు కోసిపెట్టాలా


అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా

అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా


ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... 

నా చిటికనేలు పట్టుకుంటే 

పెళ్ళౌతాది

ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... 

ఈ కిటుకు తెలుసుకుంటే 

మన పెళ్ళౌతాది


అమ్మమ్మ... అమ్మాడి అమ్మా... 

అబ్బాడి అబ్బా

అబ్బబ్బా... అమ్మాడి అమ్మా... 

అబ్బాడి అబ్బా

అమ్మమ్మ... అమ్మాడి అమ్మా... 

అబ్బాడి అబ్బా

అబ్బబ్బా... అమ్మాడి అమ్మా... 

అబ్బాడి అబ్బా 


- పాటల ధనుస్సు 


మోగాలి మోతగా డోలు సన్నాయి | Mogali Mothaga Dolu Sannayi | Song Lyrics | Bhale Krishnudu (1980)

మోగాలి మోతగా డోలు సన్నాయి



చిత్రం :  భలే కృష్ణుడు (1980)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


స్వస్తీశ్రీ చాంద్రమాన మన్మధ సంవత్సరాన...

మాఘశుద్ధ పంచమి ఆదివారం ఉదయం...

భరణి నక్షత్రయుక్త మిథున లగ్నంలో...


మోగాలి మోతగా డోలు సన్నాయి

మోగాలి మోతగా డోలు సన్నాయి...

ఆ మోత కన్నా మోతగా 

మన జోడూ సన్నాయి


హేయ్... 

మోగాలి మోతగా డోలు సన్నాయి

మోగాలి మోతగా డోలు సన్నాయి...

మన ముద్దులే మద్దెళ్లుగా 

ఈ జోడూ సన్నాయి


ఎప్పుడబ్బాయి.. 

పెళ్ళెప్పుడబ్బాయి

హేయ్.. అప్పుడమ్మాయి... 

అయినప్పుడమ్మాయి


చరణం 1 :


చూపుల్లో చదివాను శుభలేఖలూ...  

చుక్కల్లో గడిపాను శివరాత్రులు

మాటల్లో విన్నాను నీ మనసులు... 

మనసుల్లో గడిపాను తొలిరాత్రులు


అందమంతా పొందు లేక 

అలసిసొలసి పోతుంటే

అందినంత పొందలేక 

ఎదలో రొదలే పుడుతుంటే


ఎప్పుడబ్బాయి.. 

పెళ్ళెప్పుడబ్బాయి

హహ.. అప్పుడమ్మాయి... 

అయినప్పుడమ్మాయి


మోగాలి మోతగా డోలు సన్నాయి

మోగాలి మోతగా డోలు సన్నాయి...

మన ముద్దులే మద్దెళ్లుగా 

ఈ  జోడూ సన్నాయి


ఎప్పుడబ్బాయి.. 

పెళ్ళెప్పుడబ్బాయి

హేయ్.. అప్పుడమ్మాయి... 

అయినప్పుడమ్మాయి


చరణం 2 :


మొదలెన్నో చూడాలా పొద చాటునా.. 

పొగరాని సెగలున్న అగచాటునా

దొరగార్ని చూడాలా తెర చాటునా.. 

తెర బాకు చొరవున్న మొలవాటునా


తలలు వంచి గిలిమి పెంచే...  

కలికి సొగసే చూడాలా

కదమనంటే గొడవ పెంచే 

చేతి ఉడుకే చూడాలా


ఎప్పుడమ్మాయి.. 

పెళ్ళెప్పుడమ్మాయి.. హా

అప్పుడబ్బాయి.. 

అయినప్పుడబ్బాయి


అరెరే... 

మోగాలి మోతగా డోలు సన్నాయి

మోగాలి మోతగా డోలు సన్నాయి...

ఆ మోత కన్నా మోతగా 

మన జోడూ సన్నాయి


ఎప్పుడమ్మాయి.. 

పెళ్ళెప్పుడమ్మాయి..

హా.. అప్పుడబ్బాయి.. 

అయినప్పుడబ్బాయి


- పాటల ధనుస్సు 


10, మార్చి 2022, గురువారం

పొన్న చెట్టు నీడలో | Ponna Chettu Needalo | Song Lyrics | Bhale Krishnudu (1980)

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే



చిత్రం :  భలే కృష్ణుడు (1980)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఊ..ఊ..ఊ..ఊ..

ఓ..హో..హో..హో..ఆ..ఆ..ఆ..ఆ


పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే

రాగాలే ఊగాయి నీలాల యమునలో..


పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే

రాగాలే ఊగాయి నీలాల యమునలో..


ఆ..ఆ...అ.అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ


పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే

రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..


పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే

రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..

రాధమ్మ మదిలో ...


చరణం 1:


ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..

పొంగింది గగనాన భూపాల రాగం


ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..

పొంగింది గగనాన భూపాల రాగం


ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..

పలికింది పరువాన తొలివలపు రాగం..

తొలివలపు రాగం..


పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే

రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..


ఆ..ఆ..ఆ..ఆ..రాగాలే..ఊగాయి నీలాల యమునలో..


చరణం 2:


నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..

చిన్నారి నెమలి చేసింది నాట్యం..

నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..

చిన్నారి నెమలి చేసింది నాట్యం..


నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..

మైమరచి రాధమ్మ మరచింది కాలం

మరచింది కాలం..


పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే

రాగాలే..ఊగాయి నీలాల యమునలో..


పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే

రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..

రాధమ్మ మదిలో..


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు