RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

25, మే 2024, శనివారం

వేషము మార్చెను భాషను మార్చెను | Veshamu Marchenu | Song Lyrics | Gundamma Katha (1962)

వేషము మార్చెను భాషను మార్చెను



చిత్రం : గుండమ్మ కథ (1962)

సంగీతం : ఘంటసాల,

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  

నేపధ్య గానం : ఘంటసాల, పి లీల 


పల్లవి:


వేషము మార్చెను... హోయ్..

భాషను మార్చెను... హోయ్..

మోసము నేర్చెనూ..ఉ..ఉ....

అసలు తానే మారెను...


అయినా మనిషి మారలేదు

ఆతని మమత తీరలేదు..

మనిషి మారలేదు

ఆతని మమత తీరలేదు..


చరణం 1:


కృరమృగమ్ముల కోరలు తీసెను

ఘోరారణ్యములాక్రమించెను

కృరమృగమ్ముల కోరలు తీసెను

ఘోరారణ్యములాక్రమించెను


హిమాలయముపై జండా పాతెను

హిమాలయముపై జండా పాతెను

ఆకాశంలో షికారు చేసెను

అయినా మనిషి మారలేదు

ఆతని కాంక్ష తీరలేదు...


చరణం 2:


పిడికిలి మించని హృదయములో

కడలిని మించిన ఆశలు దాచెను

కడలిని మించిన ఆశలు దాచెను

వేదికలెక్కెను..వాదము చేసెను..

వేదికలెక్కెను..వాదము చేసెను..

త్యాగమె మేలని బోధలు చేసెను


అయినా మనిషి మారలేదు

ఆతని బాధ తీరలేదు..


చరణం 3:


వేషమూ మార్చెను.. 

భాషనూ మార్చెను,

మోసము నేర్చెను.. 

తలలే మార్చెను...

అయినా మనిషి మారలేదు... 

ఆతని మమత తీరలేదు..


ఆ...ఆహహాహాహ ఆహాహహా...

ఓ... ఓహొహోహోహో 

ఓహోహొహో...


- పాటల ధనుస్సు 


1 కామెంట్‌:

  1. 6 దశాబ్దాలు దాటినా, ఈ పాటలోని అంతరార్థం నేటికి కూడా వర్తిస్తుంది. మనిషి తన విలువలను పోగొట్టుకొని, అహంకారుడై, అవినీతిపరుడై, అరిషడ్వర్గాలను పెంచి పోషిస్తూ, అంతులేని నేరాలకు, మోసాలకూ పాల్పడుతూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. పాత చిత్రాలలో పాటలు, ఆ రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు మన తెలుగు సాహిత్యానికి, కళలకు మహా పెన్నిధి. పింగళి నాగేంద్ర రావు, ఘంటసాల, లీల, సుశీల...అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారకరామారావు...మున్నగువారు ఎందరో...మనకు నిత్య స్ఫూర్తిదాతలు. ఈ పాటను అందజేసిన మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు