RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

15, నవంబర్ 2025, శనివారం

ఉడతా ఉడతా హూత్ | Udatha Udatha Hooth | Song Lyrics | Jeevana Tarangalu (1973)

ఉడతా ఉడతా హూత్



చిత్రం :  జీవనతరంగాలు (1973)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి : 


ఉడతా ఉడతా హూత్.. 

ఎక్కడికెళతావ్ హూత్

కొమ్మ మీది జంపండు 

కోసుకొస్తావా.. మా  బేబీకిస్తావా ?

ఉడతా ఉడతా హూత్.. 

ఎక్కడికెళతావ్ హూత్

కొమ్మ మీది జంపండు 

కోసుకొస్తావా.. మా  బేబీకిస్తావా ?     


చరణం 1 :


చిలకమ్మా.. ఓ చిలకమ్మా.. 

చెప్పేది కాస్తా  వినవమ్మా

చిలకమ్మా.. ఓ చిలకమ్మా.. 

చెప్పేది కాస్తా  వినవమ్మా

నీ పంచదార పలుకులన్నీ.. 

బేబీకిస్తావా.. మా బేబీకిస్తావా? 


ఉడతా ఉడతా హూత్... 

ఎక్కడికెళతావ్ హూత్

ఉడతా ఉడతా హూత్... 

ఎక్కడికెళతావ్ హూత్   


చరణం 2 :


ఉరకలేసే ఓ జింకా.. 

పరుగులాపవె నీవింకా

ఉరకలేసే ఓ జింకా.. 

పరుగులాపవె నీవింకా

నువు నేర్చుకున్న పరుగులన్నీ..

నువు నేర్చుకున్న పరుగులన్నీ.. 

బేబీకిస్తావా.. మా బేబీకిస్తావా ?   


ఉడతా ఉడతా హూత్... 

ఎక్కడికెళతావ్ హూత్

ఉడతా ఉడతా హూత్... 

ఎక్కడికెళతావ్ హూత్ 


చరణం 3 :


చిలకల్లారా.. కోకిలలారా... 

చెంగున దూకే జింకల్లారా

చిలకల్లారా.. కోకిలలారా... 

చెంగున దూకే జింకల్లారా

చిన్నరి పాపల ముందు.. 

మా చిన్నరి పాపలముందు

మీరెంత? మీ జోరేంత?..  

మీరెంత? మీ జోరేంత?   

ఉడతా ఉడతా హూత్... 

ఎక్కడికెళతావ్ హూత్

ఉడతా ఉడతా హూత్... 

ఎక్కడికెళతావ్ హూత్  


- పాటల ధనుస్సు 


ఈ అందానికి బంధం వేశానొకనాడు | Ee Andaniki Bandham | Song Lyrics | Jeevana Tarangalu (1973)

ఈ అందానికి బంధం వేశానొకనాడు



చిత్రం: జీవనతరంగాలు (1973)

సంగీతం: జె.వి. రాఘవులు

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఈ అందానికి బంధం వేశానొకనాడు

ఆ బంధమే నాకందమైనది ఈ నాడు


ఈ అందానికి బంధం వేశానొకనాడు

ఆ బంధమే నాకందమైనది ఈ నాడు


చరణం 1:


నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను... 

నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను

ఊహూ ఊహూ హూ హూ హూ

నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను... 

నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను

నీ చేతులానాడు చెరలాయెను ...

నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను...

ఊహూ ఊహూ హూ హూ హూ


ఈ అందానికి బంధం వేసానొకనాడు...

ఆ బంధమే నాకందమైనది ...

ఈ నాడు


చరణం 2:


నీ వేడిలోనే నా చలువ ఉందని 

వాన ఎండను చేరింది

నీ చలువే నా వేడికి విలువని 

ఎండే వానను మెచ్చింది

నీ వేడిలోనే నా చలువ ఉందని 

వాన ఎండను చేరింది

నీ చలువే నా వేడికి విలువని 

ఎండే వానను మెచ్చింది


ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో 

ఇంధ్రధనస్సే విరిసింది

ఏడు రంగుల ముగ్గులు వేసి ...

నింగీ నేలను కలిపింది

ప్రేమకు పెళ్ళే చేసింది ...


ఈ అందానికి బంధం వేసానొకనాడు

ఆ బంధమే నాకందమైనది ...

ఈ నాడు


ఆహాహా ఆహాహా... ఆహాహా ఆహాహా

ఆహాహా ఆహాహా.... ఆహాహా ఆహాహా

ఆహాహా ఆహాహా.... ఆహాహా ఆహాహా


- పాటల ధనుస్సు 

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల | Edabatu Erugani | Song Lyrics | Badi Panthulu (1972)

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల



చిత్రం : బడి పంతులు (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి:


ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు

తోడు నీడగా వుండే వయసున 

గూడు విడిచి వేరైనారు .. 

గూడు విడిచి వేరైనారు...

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు


చరణం 1:


జంటను వీడిన ఒంటరి బ్రతుకై 

జాలిగ కుమిలేరు

జంటను వీడిన ఒంటరి బ్రతుకై 

జాలిగ కుమిలేరు

ఎదలోదాగిన మూగ వేదన 

ఎవరికి చెప్పేరు.. ఎలా భరించేరు...


ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు


చరణం 2:


ఒకే తనువుగ ఒకే మనువుగా 

ఆ దంపతులు జీవించారు

ఒకే తనువుగ ఒకే మనువుగ 

ఆ దంపతులు జీవించారు

ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు 

ఆ తలిదండ్రుల పంచారు .. 

ఆ తలిదండ్రుల పంచారు

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు


- పాటల ధనుస్సు 


మీ నగుమోము నా కనులారా | Mee Nagumomu Naa Kanulara | Song Lyrics | Badi Panthulu (1972)

మీ నగుమోము నా కనులారా


చిత్రం : బడి పంతులు (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి:


మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు

ఈ సూత్రముతో ఈ కుంకుమతో 

నను కడతేరి పోనిండు

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు


చరణం 1:


ఉపచారాలే చేసితినో.. 

ఎరగక అపచరాలే చేసితినో

ఉపచారాలే చేసితినో.. 

ఎరగక అపచరాలే చేసితినో

ఒడుదుడుకులలో తోడై ఉంటిని .. 

మీ అడుగున అడుగై నడిచితిని

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు


చరణం 2:


రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...

రెక్కలు అలిసి మీరున్నారు

రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...

రెక్కలు అలిసి మీరున్నారు

పండుటాకులము మిగిలితిమి..

పండుటాకులము మిగిలితిమి..

ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు


చరణం 3:


ఏ నోములు నే నోచితినో .. 

ఈ దేవుని పతిగా పొందితిని

ఏ నోములు నే నోచితినో .. 

ఈ దేవుని పతిగా పొందితిని

ప్రతి జన్మ మీ సన్నిధిలోనా... 

ప్రమిదగ వెలిగే వరమడిగితిని


మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు

ఈ సూత్రముతో ఈ కుంకుమతో 

నను కడతేరి పోనిండు

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు


- పాటల ధనుస్సు 


10, నవంబర్ 2025, సోమవారం

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా | Ninna Monna Reku Vippina | Song Lyrics | Badi Panthulu (1972)

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా


చిత్రం: బడి పంతులు (1972)

సంగీతం:  కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, పి సుశీల


పల్లవి:


నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా

నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా


నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద

నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 

    

చరణం 1:


పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు

నీ పైట కొంగు చాటున దోబూచులాడెను 


పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలు

నీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు 


చరణం 2:


పాల బుగ్గలు పూచె లేత కెంపులు

వాలు చూపులందుతోటె వయసు జోరులు


చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు

చిన్ననాటి చెలిమి తీసె వలపు దారులు 

    

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా

నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా


నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద

నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 


చరణం 3:


ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి

ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 

ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి

ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 


ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి

ఇపుడేవేవో...

ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 

ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి

ఇపుడేవేవో...

ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 


నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా

నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా


నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద

నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 


- పాటల ధనుస్సు 


5, నవంబర్ 2025, బుధవారం

పిల్లలము బడి పిల్లలము | Pillalamu Badi Pillalamu | Song Lyrics | Badi Panthulu (1972)

పిల్లలము బడి పిల్లలము


చిత్రం : బడి పంతులు (1972)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : పి.సుశీల 


పల్లవి:


పిల్లలము బడి పిల్లలము...

పిల్లలము బడి పిల్లలము...

నడుములు కట్టి కలిశాము...

పిడికిలి బిగించి కదిలాము

పిల్లలము బడి పిల్లలము


చరణం 1:


పలక బలపం పట్టిన చేతులు 

పలుగు పార ఎత్తినవి.. 

పలుగు పార ఎత్తినవి

పలక బలపం పట్టిన చేతులు 

పలుగు పార ఎత్తినవి

ఓనమాలను దిద్దిన వేళ్ళు...

ఒకటై మట్టిని కలిపినవి

ఒకటై మట్టిని కలిపినవి..


పిల్లలము బడి పిల్లలము


చరణం 2:


ప్రతి అణువు... మా భక్తికి గుర్తు

ప్రతి రాయి.. మా శక్తికి గుర్తు

ప్రతి అణువు... మా భక్తికి గుర్తు

ప్రతి రాయి.. మా శక్తికి గుర్తు


చేతులు కలిపి చెమటతో తడిపి..

చేతులు కలిపి చెమటతో తడిపి...

కోవెల కడదాం గురుదేవునికి

పిల్లలము..పిల్లలము... 

బడి పిల్లలము.. బడి పిల్లలము


చరణం 3:


తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు

తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు..

తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు

తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు

తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు..

తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు


వెలుగును ఇచ్చే ఈ కిటికీలు ...

పంతులు గారి చల్లని కళ్ళు...

వెలుగును ఇచ్చే ఈ కిటికీలు ...

పంతులు గారి చల్లని కళ్ళు...


పిల్లలము..పిల్లలము... 

బడి పిల్లలము.. బడి పిల్లలము

నడుములు కట్టి కలిశాము...

పిడికిలి బిగించి కదిలాము

పిల్లలము బడి పిల్లలము..

ల.లాలా..లా..లా.లా


- పాటల ధనుస్సు 


4, నవంబర్ 2025, మంగళవారం

బూచాడమ్మా బూచాడు | Buchadamma Buchadu | Song Lyrics | Badi Panthulu (1972)

బూచాడమ్మా బూచాడు


చిత్రం:  బడి పంతులు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: పి. సుశీల


పల్లవి:


బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు...

బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు

కళ్ళకెపుడు కనపడడు 

కబురులెన్నో చెపుతాడు


బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు...

బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు

కళ్ళకెపుడు కనపడడు 

కబురులెన్నో చెపుతాడు

బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు...


చరణం 1:


గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. 

హెల్లో అని మొదలెడతాడూ...

గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. 

హెల్లో అని మొదలెడతాడూ...

ఎక్కడ వున్న ఎవ్వరినైనా.. 

ఎక్కడ వున్న ఎవ్వరినైనా..

పలుకరించి కలుపుతాడు...


బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు...

బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు

కళ్ళకెపుడు కనపడడు 

కబురులెన్నో చెపుతాడు

బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు...


చరణం 2:


తెలుగు తమిళ హిందీ కన్నడ 

భాషా భేధాలెరుగని వాడూ

తెలుగు తమిళ హిందీ కన్నడ 

భాషా భేధాలెరుగని వాడూ

కులము మతము జాతేదైనా... 

కులము మతము జాతేదైనా ..

గుండెలు గొంతులు ఒకటంటాడు


బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు...


చరణం 3:


డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా 

అమెరికా లండన్ జపాన్

ఎక్కడికైనా వెళుతుంటాడు 

ఎల్లలు మనసుకు లేవంటాడు..

ఎక్కడికైనా వెళుతుంటాడు 

ఎల్లలు మనసుకు లేవంటాడు..

ఒకే తీగ పై నడిపిస్తాడు... 

ఒకే ప్రపంచం అనిపిస్తాడు...


బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు...

బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు

కళ్ళకెపుడు కనపడడు 

కబురులెన్నో చెపుతాడు

బూచాడమ్మా...బూచాడు...

బుల్లి పెట్టె లో వున్నాడు...


- పాటల ధనుస్సు 


2, నవంబర్ 2025, ఆదివారం

ఈ ముసి ముసి నవ్వుల | Ee Musi Musi Navvula | Song Lyrics | Iddaru Mitrulu (1961)

ఈ ముసి ముసి నవ్వుల



చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఈ ముసి ముసి నవ్వుల 

విరిసిన పువ్వులు

గుస గుసలాడినవి ఏమిటో


విరజాజి గులాబి మన 

గుట్టే తెలుసుకున్నవి

చామంతి పూబంతి 

పరిహాసాలాడినవి

విరజాజి గులాబి మన 

గుట్టే తెలుసుకున్నవి

చామంతి పూబంతి 

పరిహాసాలాడినవి


ఈ ముసి ముసి నవ్వుల 

విరిసిన పువ్వులు

గుస గుసలాడినవి ఏమిటో


చరణం 1:


పొదరింటన ఒంటరి పావురము

తన జంటను కలియగ వేచినది


మనసే తెలిసి తన ప్రేయసికై

మగ పావురమే దరిచేరింది


ఈ ముసి ముసి నవ్వుల 

విరిసిన పువ్వులు

గుస గుసలాడినవి ఏమిటో


చరణం 2:


నీ కురులను రేపిన చిరుగాలి

నామదిలో కోరిక రేపినది


వలపే తెలిపే కనుసైగలతో

నీ ఊసులు బాసలు చేసాయి


ఈ ముసి ముసి నవ్వుల 

విరిసిన పువ్వులు

గుస గుసలాడినవి ఏమిటో


చరణం 3:


నదిలో మెరిసే కదిలే కాంతి..

నదిలో మెరిసే కదిలే కాంతి...

నా మోమున తళ తళ లాడింది


నీ చక్కని చెక్కిలి అద్దాన

నా రూపము నేనే చూశాను


ఈ ముసి ముసి నవ్వుల 

విరిసిన పువ్వులు

గుస గుసలాడినవి ఏమిటో...

విరజాజి గులాబి మన 

గుట్టే తెలుసుకున్నవి

చామంతి పూబంతి 

పరిహాసాలాడినవి


ఈ ముసి ముసి నవ్వుల 

విరిసిన పువ్వులు

గుస గుసలాడినవి ఏమిటో


- పాటల ధనుస్సు 


ఓహొ ఓహొ నిన్నే కోరెగా | Oho Oho Ninne Korega | Song Lyrics | Iddaru Mitrulu (1961)

ఓహొ ఓహొ నిన్నే కోరెగా



చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఒహోహో... ఆహాహహా

ఊఁహుహు ఊఁహుహు

ఓహొ ఓహొ నిన్నే కోరెగా

కుహుకుహూ అని కోయిలా

ఓహొ ఓహొ నిన్నే కోరెగా

కుహుకుహూ అని కోయిలా

వసంతవేళలా పసందు మీరగా

అపూర్వగానమే ఆలపించే తీయగా


ఓహొ ఓహొ నిన్నే కోరెగా

కుహుకుహూ అని కోయిలా


చరణం 1:


అదా కోరికా వయ్యారి కోయిలా

జగాలే నీ చూపులో జలదిరించెనే

అదా కోరికా వయ్యారి కోయిలా

జగాలే నీ చూపులో జలదిరించెనే


వరాల నవ్వులే గులాబి పువ్వులై

వలపు తేనె నాలోన చిలకరించెనే


ఓహొ ఓహొ నిన్నే కోరెగా

కుహుకుహూ అని కోయిలా


చరణం 2:


ఫలించె నేను కన్న కలలు తీయతీయగా

సుఖాలలో సోలిపో హాయి హాయిగా

ఫలించె నేను కన్న కలలు తీయతీయగా

సుఖాలలో సోలిపో హాయి హాయిగా


ఉయ్యాలలూగే నా మది చిటారుకొమ్మలా

నివాళి అందుకో ఈవేళ పండుగా

సదా సుధా తరంగాల తేలిపోదమా

ఓహొ ఓహొ నిన్నే కోరితి

కుహుకుహు అనీ పాడితి

ఆ హా హా... అహా అహా

ఆ హా హా... అహా అహా


- పాటల ధనుస్సు 


1, నవంబర్ 2025, శనివారం

ఖుషీ ఖుషీగా నవ్వుతు | Khushi Kushiga Navvuthu | Song Lyrics | Iddaru Mitrulu (1961)

ఖుషీ ఖుషీగా నవ్వుతు



చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగొలిపేవెందుకే 

నిషా కనులదానా?


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగొలిపేవెందుకే 

నిషా కనులదానా?


ఓ..ఓ..

మేనాలోన ప్రియునిజేర 

వెళ్ళింది నా చెలి మీనా

మేనాలోన ప్రియునిజేర 

వెళ్ళింది నా చెలి మీనా

నింగిదాటి ఆనంద సాగరం 

పొంగిపొరలె నాలోన


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగొలిపేదిందుకే 

నిషా కనుల వాడ


చరణం 1:


ఒహో చెలియా నీవుకుడా 

ఓ పెళ్ళి పల్లకీ చూసుకో

ఒహో చెలియా నీవుకుడా 

ఓ పెళ్ళి పల్లకీ చూసుకో

హాయికొలుపు సన్నాయి పాటలో 

వలపుబాటలే వేసుకో


నే వెళితే మరి నీవు, 

మజ్నూవవుతావూ

నే వెళితే మరి నీవు, 

మజ్నూవవుతావూ


మజ్ను నేనైతే ఓ లైలా 

లోకమే చీకటై పోవునే

మజ్ను నేనైతే ఓ లైలా 

లోకమే చీకటై పోవునే


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగా వుందాములే 

నిషా కనుల వాడ


చరణం 2:


ఆకాశంలో ఇంద్రధనస్సుపై 

ఆడుకుందమా నేడే

నీలి నీలి మేఘాల రధముపై 

తేలిపోదామీనాడే


చంద్రుడు నేనై నీవు వెన్నెలై 

కలసిపోదమా హాయిగా

నేను వీణనై నీవు నాదమై 

ఏకమౌదమా తీయగా


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగా వుందాములే 

హమేషా మజాగా


- పాటల ధనుస్సు 



పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు