RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
rajkumar songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rajkumar songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఆగస్టు 2023, సోమవారం

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష | Tenekanna Teeyanidi Telugu bhasha | Song Lyrics | Rajkumar (1978)

తేనెకన్నా తీయనైనది తెలుగు భాష



చిత్రం : రాజ్ కుమార్ (1983)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, రమణ,


సాకి :

దినదినము వర్దిల్లు తెలుగు దేశం...

దీప్తులను వెదజల్లు తెలుగు తేజం...


పల్లవి:

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!

దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!


చరణం 1:

మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును

పావురాల కువకువలు పలుకులందు నినదించును

సప్తస్వరనాదసుధలు, నవరసభావాలమనులు

చారు తెలుగు సొగసులోన జాలువారు జాతీయం


తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!

దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!


చరణం 2:

అమరావతి సీమలో కమనీయ శిలామంజరి

రామప్ప గుడి గోడల రమనీయ కళారంజని

అన్నమయ్య సంకీర్తనం, క్షేత్రయ్య శృంగారం

త్యాగరాజు రాగమధువు తెలుగు సామగానమయం


తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!

దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!


పాటల ధనుస్సు 


27, జూన్ 2023, మంగళవారం

అర్ధరాత్రి సద్దుమణిగి | Ardharatri Saddumanigi | Song Lyrics | Rajkumar (1983)

అర్ధరాత్రి సద్దుమణిగి



చిత్రం :  రాజ్ కుమార్ (1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :

హేయ్...

అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా...

అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా

చినబావా.. వయసుకు లొంగావా

వరసను కలిపావా.. మరదలికై వచ్చావా .. 

హోయ్ భలే



అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా

అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా

చినదానా... ఇది వయసనుకోనా....

నీ పొగరనుకోనా.. నేనే దొరికానా తల్లీ...

అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా....


చరణం 1 :


పున్నమి వెన్నెల సన్నని సూదులు అయినాయి... 

అయ్యయ్యయ్యో...

ఈ మల్లెలన్నీ మన్మధ బాణాలైనాయి... అహా..అహా


కన్నేమనసుకు తాళం వేస్తే బయటే ఉంటాయి

నువు కన్నులు మూసి నిద్దరపోతే.. పోతాయి...

చలిగాలీ... అహహా.. వేస్తొందీ... అహహా..

తలుపేసి రమ్మంది... విన్నావా....ఆ... ఆ...ఆ

జతకోసం చూస్తుంది.. రా బావా..

తలుపేసి వెళతాను.. చలి తోటే ఉండని నన్ను...


అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా

చినబావా.. వయసుకు లొంగావా

వరసను కలిపావా.. మరదలికై వచ్చావా...

హోయ్ భలే

అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా



చరణం 2 : 


అమ్మనాన్నలు అల్లుడు నువ్వే అన్నారు... 

అయ్యబాబోయ్...

నా అత్తమామలు మనవడు కావాలన్నారు... 

అహహహా...

అందరి ఆశలు తీర్చేవాళ్ళే లేరమ్మా..

నేనల్లుడనయ్యే అత్తామావలు వేరమ్మా...

పరువాన్ని.. అహహ.. అందాన్ని...అహహా..

హృదయాన్ని ఇస్తున్నా... కట్నంగా ... ఆ..ఆ..

బిగి కౌగిలి ముడివేసి భద్రంగా..

బిగి కౌగిలి.. ఉరితాడు .. ముడివేయకు...

అమ్మమ్మమ్మా...



అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా

అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా

చినదానా ఇది వయసనుకోనా...

నీ పొగరనుకోనా... నేనే దొరికానా తల్లీ...

అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా....

అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా....


పాటల ధనుస్సు  


22, జూన్ 2023, గురువారం

జానకి కలగనలేదు | Janaki Kalaganaledu | Song Lyrics | Raj kumar (1983)

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు 




చిత్రం :  రాజ్ కుమార్ (1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


జానకి కలగనలేదు 

రాముని సతి కాగలనని ఏనాడు 

రాముడు అనుకోలేదు 

జానకి పతి కాగలనని ఆనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది 

ఇనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం... 

మన జీవన పారాయణం

రాముడు అనుకోలేదు 

జానకి పతి కాగలనని ఆనాడు


చరణం 1:


చెలిమనసే శివధనస్సు అయినది 

తొలిచూపుల వశమైనది

వలపు స్వయంవరమైనపుడు 

గెలువనిది ఏది

ఒక బాణం ఒక భార్యన్నది 

శ్రీరాముని చిరయశమైనది

శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి

తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే

తుదిదాకా నీవే.. మరు జన్మకు నీవే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  

 

జానకి కలగనలేదు 

రాముని సతి కాగలనని ఏనాడు 

రాముడు అనుకోలేదు 

జానకి పతి కాగలనని ఆనాడు


చరణం 2 :

సహవాసం మనకు నివాసం 

సరిహద్దు నీలాకాశం

ప్రతిపొద్దు ప్రణయావేశం 

పెదవులపై హాసం

సుమసారం మన సంసారం 

మణిహారం మన మమకారం

ప్రతిరోజు ఒక శ్రీకారం 

పరవశ శృంగారం

గతమంటే నీవే కథకానిది నీవే

కలలన్ని నావే కలకాలం నీవే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   


రాముడు అనుకోలేదు 

జానకి పతి కాగలనని ఆనాడు

జానకి కలగనలేదు 

రాముని సతి కాగలనని ఏనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది 

ఇనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం... 

మన జీవన పారాయణం...

లలలలల లలల... 

లలలలల లలల... 

లలలలల లలల


పాటల ధనుస్సు  


తొలి చూపు చెలి రాసిన శుభలేఖ | Tholi chupu cheli raasina | Song Lyrics | Rajkumar (1983)

తొలి చూపు చెలి రాసిన శుభలేఖ



చిత్రం : రాజ్ కుమార్ (1983)

సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి :
ఆఆఆఆఆఆఆఆఆ..
ఆహాహ.. ఆహాహ.. ఆహాహ..

తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది.. ప్రియ భాషా
పలుకే లేనిది.. ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ

చరణం 1 :
కన్నూ కన్నూ నవకళ్యాణి లో.. రాగాలెన్నో పలికే
क्या
అందాలన్నీ బిగి కౌగిళ్ళకే.. రావాలనీ అలిగే
बने मेरे प्राण मन मध् के तीर ऐ है प्रेम का सार

ప్రాణాలన్ని మరు బాణా లైదుగా చేసే ప్రేమ కావ్యం
अच्चा
తొలి పాట చెలికంకితం.. చెలి నీడ నా జీవితం...
ఆరారు కాలాలకిది కామితం
नजरॊं सॆ.. ఆహ.. दिल नॆ दिया नजराना... అహహ..
न हॊ सका और दॆना
न हॊ सका और दॆना.. देना
नजरॊं सॆ.. ఉహూ.. दिल नॆ दिया नजराना
కుసుమించే చెలి యవ్వనం..

చరణం 2 :

బృందావనీ సుమ గంధాలతో శృంగారాలే వలచీ
फिर
శిల్పావనీ లయ లాస్యాలతో సౌందర్యాలే తలచీ
सांझ सवॆरॆ पूछूंगी मैं खिल कवल सॆ तुम्हॆं
కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమ హారం...
शुक्रीया
నా మదికే నీరాజనం..
ఏడేడు జన్మాలకిది శాశ్వతం..

తొలి చూపు చెలి రాసినా శుభలేఖ
नजरॊं सॆ दिल नॆ दिया नजराना
పలుకే లేనిది ప్రియ భాషా
न हॊ सका और देना.. देना

తొలిచూపు చెలి రాసిన శుభలేఖ
नजरॊं सॆ दिल नॆ दिया नजराना


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు