అర్ధరాత్రి సద్దుమణిగి
చిత్రం : రాజ్ కుమార్ (1983)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
హేయ్...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
చినబావా.. వయసుకు లొంగావా
వరసను కలిపావా.. మరదలికై వచ్చావా ..
హోయ్ భలే
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
చినదానా... ఇది వయసనుకోనా....
నీ పొగరనుకోనా.. నేనే దొరికానా తల్లీ...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా....
చరణం 1 :
పున్నమి వెన్నెల సన్నని సూదులు అయినాయి...
అయ్యయ్యయ్యో...
ఈ మల్లెలన్నీ మన్మధ బాణాలైనాయి... అహా..అహా
కన్నేమనసుకు తాళం వేస్తే బయటే ఉంటాయి
నువు కన్నులు మూసి నిద్దరపోతే.. పోతాయి...
చలిగాలీ... అహహా.. వేస్తొందీ... అహహా..
తలుపేసి రమ్మంది... విన్నావా....ఆ... ఆ...ఆ
జతకోసం చూస్తుంది.. రా బావా..
తలుపేసి వెళతాను.. చలి తోటే ఉండని నన్ను...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
చినబావా.. వయసుకు లొంగావా
వరసను కలిపావా.. మరదలికై వచ్చావా...
హోయ్ భలే
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
చరణం 2 :
అమ్మనాన్నలు అల్లుడు నువ్వే అన్నారు...
అయ్యబాబోయ్...
నా అత్తమామలు మనవడు కావాలన్నారు...
అహహహా...
అందరి ఆశలు తీర్చేవాళ్ళే లేరమ్మా..
నేనల్లుడనయ్యే అత్తామావలు వేరమ్మా...
పరువాన్ని.. అహహ.. అందాన్ని...అహహా..
హృదయాన్ని ఇస్తున్నా... కట్నంగా ... ఆ..ఆ..
బిగి కౌగిలి ముడివేసి భద్రంగా..
బిగి కౌగిలి.. ఉరితాడు .. ముడివేయకు...
అమ్మమ్మమ్మా...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
చినదానా ఇది వయసనుకోనా...
నీ పొగరనుకోనా... నేనే దొరికానా తల్లీ...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా....
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా....
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి