RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
annadammula anubandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
annadammula anubandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2025, సోమవారం

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ | Andmaina Pilla | Song Lyrics | Annadammula Anubandham (1975)

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ



చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: బాలు, రామకృష్ణ, సుశీల


పల్లవి:


లా...లా...లా...లా...లా.. లాలాలలా

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ

సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ

ఓ...వెళ్ళేసరికి గదిలో ఏదో

అలికిడి అవుతున్నదీ

అలికిడి వింటే మదిలో ఏదో

అలజడి అవుతున్నదీ

...యా...హా...హా..బ..బ...బా..


అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ

సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ


చరణం 1: 


Hey you miss 

will you sing with me? 

who..me?... నాకు భయముగా ఉంది 

ha ha.. don't you worry.. 

I am give you a start 


లా...లా...లా...లా...లలలలా...

లా...లా...లా...లా...లలలలా...


అందమైన పిల్లవాడు రమ్మన్నాడు..

జూ..జూ..జుజూ..

సందెవేళ అందమంత తెమ్మన్నాడు 

ఆ .హా.. హా..హా...

వెళ్ళేసరికి...ఆ.. ఆ... గాజులు గలగల.. 

ఆ ఆ ఆ

వెళ్ళేసరికి గాజులు గలగల.. 

గదిలో వినిపించింది..

గల గల వింటే మదిలో ఏదో..

అలజడి చెలరేగింది...యా...


అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ

సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ

వెళ్ళేసరికి గదిలో ఏదో

అలికిడి అవుతున్నదీ

అలికిడి వింటే మదిలో ఏదో

అలజడి అవుతున్నదీ... యా..


చరణం 2: 


Hey you young man.. య హూ 

will you sing with me?.. sure 

give me start beat.. ha ha.. 1 2 3 4 


కన్నెపిల్ల కారులోన కనిపించింది... 

లాలలలా...

కన్ను గీటి నన్ను నేడు బులిపించింది... 

లాల లాలా

లా...లా..లా.ల..

కన్నెపిల్ల కారులోన కనిపించింది

కన్ను గీటి నన్ను నేడు బులుపించింది


చూపులలోని...ఊఁ.. కైపులలోనా.. చీ

చూపులలోని కైపులలోనా... 

ఊయల ఊగించింది

ఎన్నడు లేని ఎన్నో ఆశలు.. 

నాలో ఊరించింది...

యా...హా...హా..బ..బ...బా.. 


- పాటల ధనుస్సు 


ఆనాటి హృదయాల ఆనందగీతం | Anati Hrudayala | Song Lyrics | Annadammula Anubandham (1975)

ఆనాటి హృదయాల ఆనందగీతం



చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: పి.సుశీల 

& రామకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి:


ఆనాటి హృదయాల ఆనందగీతం 

ఇదేలే ఇదేలే

ఈనాడు నయనాల విరిసే వసంతం 

అదేలే అదేలే


ఆనాటి హృదయాల ఆనందగీతం 

ఇదేలే ఇదేలే

ఈనాడు నయనాల విరిసే వసంతం 

అదేలే అదేలే

ఆ పాట అధరాలపైన 

పలికేను ఏనాటికైనా...


ఆనాటి హృదయాల ఆనందగీతం 

ఇదేలే... ఇదేలే


చరణం 1:


ఏటేటా మన ఇంట 

ఈ పండగే జరగాలి

ఈ నిలయం కలకాలం 

శ్రీ నిలయమై నిలవాలి


ఏటేటా మన ఇంట 

ఈ పండగే జరగాలి

ఈ నిలయం కలకాలం 

శ్రీ నిలయమై నిలవాలి

వెలుతురైనా చీకటైనా విడిపోదు... 

ఈ అనుబంధం


చరణం 2:


తారకలే దిగివచ్చి 

తారంగం ఆడాలి

వెన్నెలలే ముంగిటిలో 

వేణువులై పాడాలి


తారకలే దిగివచ్చి 

తారంగం ఆడాలి

వెన్నెలలే ముంగిటిలో 

వేణువులై పాడాలి

ఆటలాగా.. పాటలాగా... 

సాగాలి మన జీవితం


- పాటల ధనుస్సు 


2, మే 2025, శుక్రవారం

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా 



చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి : 


కౌగిలిలో ఉయ్యాలా 

కన్నులలో జంపాలా

కౌగిలిలో ఉయ్యాలా 

కన్నులలో జంపాలా

కలసి వూగాలిలే... 

కరిగిపోవాలిలే..  

తనివి తీరాలిలే


చరణం 1 : 


నీ బుగ్గలఫై ఆ ఎరుపు..  

నీ పెదవులఫై ఆ మెరుపు

వెలుతురులో.. చీకటిలో.. 

వెలిగిపోయేనులే.. హే హే.. 

నన్ను కోరేనులే


నా పెదవుల ఫై యీ పిలుపు.. 

హో హో..  

నా హృదయములో నీ తలపు.. 

హ హ

వెలుతురులో.. చీకటిలో.. 

వెలుతురులో 

చీకటిలో  నిలిచి వుండేనులే... 

నిన్ను కోరేనులే        

కౌగిలిలో ఉయ్యాలా 

కన్నులలో జంపాలా

కలసి వూగాలిలే... 

కరిగిపోవాలిలే.. 

తనివి తీరాలిలే 


చరణం 2 :


గులాబీలా విరబూసే నీ సొగసు... 

సెలయేరై చెలరేగేనీ వయసు

అందరిలో ఎందుకనో 

ఆశ రేపేనులే 

అల్లరి చేసేనులే

కసిగా కవ్వించే నీ చూపు...  

జతగా కదిలించే నీ వూపు

రేయైనా..  పగలైనా.. 

రేయైనా..  పగలైనా...

నన్ను మురిపించులే...  

మేను మరిపించులే        

కౌగిలిలో ఉయ్యాలా  

కన్నులలో జంపాలా

కలసి వూగాలిలే...  

కరిగిపోవాలిలే...  

తనివి తీరాలిలే 


- పాటల ధనుస్సు 


24, జూన్ 2022, శుక్రవారం

గులాబిపువ్వై నవ్వాలి వయసు | Gulabi Puvvai Navvali | Song Lyrics | Annadammula Anubandham (1975)

గులాబిపువ్వై నవ్వాలి వయసు



చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


గులాబిపువ్వై నవ్వాలి వయసు

జగాన వలపే నిండాలిలే

ఇలాంటి వేళ ఆడాలి జతగా

ఇలాగె మనము ఉండాలిలే

మనసు దోచి మాయజేసీ

చెలినే మరచిపోవొద్దోయి రాజా... రాజా


గులాబిపువ్వై నవ్వాలి వయసు

జగాన వలపే నిండాలిలే


చరణం 1:


వసంతరాణి నీకోసమే ఖుషిగ వచ్చింది

చలాకినవ్వు చిందించుచు హుషారు తెచ్చింది

మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను

వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను

వలపుపెంచి మమతపంచి

విడిచిపోనని మాటివ్వాలి రాజా... రాజా

గులాబిపువ్వై నవ్వాలి వయసు

జగాన వలపే నిండాలిలే


చరణం 2:


మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను

పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను

యుగాలకైనా నాదానివై నీవే వుంటావు

అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను

మనసు నీదే మమత నీదే..

రేయి పగలు నాలో వున్నది నీవే.. సోనీ


గులాబిపువ్వై నవ్వాలి వయసు

జగాన వలపే నిండాలిలే

ఇలాంటి వేళ ఆడాలి జతగా

ఇలాగె మనము ఉండాలిలే

లాలలా లాలలా లాలలా లాలలా


పాటల ధనుస్సు 

ఆనాడు తొలిసారి నిను చూసి | Anadu Tolisari ninu chusi | Song Lyrics | Annadammula Anubandham (1975)

ఆనాడు తొలిసారి నిను చూసి



చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి : 


ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను

నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...


ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను

నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను..

ఐ లవ్ యు సోనీ... సోనీ...... 

ఐ లవ్ యు సోనీ... సోనీ 


చరణం 1 : 


అందాల నీమోము నా కోసమే...  

నిండైన నా ప్రేమ నీ కోసమే

అందాల నీమోము నా కోసమే... 

నిండైన నా ప్రేమ నీ కోసమే

నా మీద ఈనాడు అలకేలనే...  

నేరాలు మన్నించి రావేలనే.. ల.. ల.. లల.. ల.. ల

ఐ లవ్ యు సోనీ... సోనీ...... 

ఐ లవ్ యు సోనీ... సోనీ



వలచింది గెలిచింది నీవేనులే..  

నీ ముందు ఓడింది నేనేనులే

వలచింది గెలిచింది నీవేనులే..  

నీ ముందు ఓడింది నేనేనులే

కోపాలు తాపాలు మనకేలలే 

ఇక నైన జత జేరి గడపాలిలే... ల.. ల.. ల

ఐ లవ్ యు రాజా...  

రాజా...  ఐ లవ్ యు రాజా...  రాజా  



చరణం 2 :


చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... 

అనురాగ మధువెంతో కురిసిందిలే

చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... 

అనురాగ మధువెంతో కురిసిందిలే

అధరాలు ఏమేమొ వెతికేనులే... 

హృదయాలు పెనవేసి ఊగేనులే    ల   ల  లా        

 ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు  సోనీ... సోనీ

ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను

నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...

ఐ లవ్ యు రాజా...  రాజా...  

ఐ లవ్ యు  సోనీ... సోనీ


పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు