RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
anati hrudayala ananda geetam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
anati hrudayala ananda geetam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2025, సోమవారం

ఆనాటి హృదయాల ఆనందగీతం | Anati Hrudayala | Song Lyrics | Annadammula Anubandham (1975)

ఆనాటి హృదయాల ఆనందగీతం



చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: పి.సుశీల 

& రామకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి:


ఆనాటి హృదయాల ఆనందగీతం 

ఇదేలే ఇదేలే

ఈనాడు నయనాల విరిసే వసంతం 

అదేలే అదేలే


ఆనాటి హృదయాల ఆనందగీతం 

ఇదేలే ఇదేలే

ఈనాడు నయనాల విరిసే వసంతం 

అదేలే అదేలే

ఆ పాట అధరాలపైన 

పలికేను ఏనాటికైనా...


ఆనాటి హృదయాల ఆనందగీతం 

ఇదేలే... ఇదేలే


చరణం 1:


ఏటేటా మన ఇంట 

ఈ పండగే జరగాలి

ఈ నిలయం కలకాలం 

శ్రీ నిలయమై నిలవాలి


ఏటేటా మన ఇంట 

ఈ పండగే జరగాలి

ఈ నిలయం కలకాలం 

శ్రీ నిలయమై నిలవాలి

వెలుతురైనా చీకటైనా విడిపోదు... 

ఈ అనుబంధం


చరణం 2:


తారకలే దిగివచ్చి 

తారంగం ఆడాలి

వెన్నెలలే ముంగిటిలో 

వేణువులై పాడాలి


తారకలే దిగివచ్చి 

తారంగం ఆడాలి

వెన్నెలలే ముంగిటిలో 

వేణువులై పాడాలి

ఆటలాగా.. పాటలాగా... 

సాగాలి మన జీవితం


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు