RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, నవంబర్ 2026, శుక్రవారం

రామ రామ శరణం | Rama Rama Sharanam | Song Lyrics | Appuchesi Pappukudu (1959)

రామ రామ శరణం 


చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  

నేపథ్య గానం :  పి. లీల


పల్లవి :


రామ రామ శరణం... 

భద్రాద్రిరామ శరణం

రామ రామ శరణం...


తాటకిని వధించి 

మునిరాజు కృపను గాంచి

తాటకిని వధించి 

మునిరాజు కృపను గాంచి

శిలకు ప్రాణమిచ్చి 

సన్నుతులు గాంచినట్టి


రామ రామ శరణం... 

భద్రాద్రిరామ శరణం

రామ రామ శరణం...


చరణం 1 :


శివుని విల్లు ద్రుంచి... 

శ్రీ జానకిని గ్రహించి

శివుని విల్లు ద్రుంచి... 

శ్రీ జానకిని గ్రహించి

జనకు మాటనెంచి 

వనవాసమేగినట్టి


రామ రామ శరణం... 

భద్రాద్రిరామ శరణం

రామ రామ శరణం...


చరణం 2 :


రావణుని వధించి 

ఘనకీర్తి జగతినించి

రావణుని వధించి 

ఘనకీర్తి జగతినించి

పాపముల హరించి 

భువినెల్ల గాచునట్టి


రామ రామ శరణం... 

భద్రాద్రిరామ శరణం

రామ రామ శరణం...


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ పంచవన్నెల చిలకా | O Panchavannela Chilaka | Song Lyrics | Appuchesi Pappukudu (1959)

ఓ పంచవన్నెల చిలకా  చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : పింగళి నాగేంద్రరావు   నేపథ్య గానం : ఘంటసాల, స...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు