RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, నవంబర్ 2026, మంగళవారం

నీ సిగ్గే సింగారమే | Nee Sigge Singarame | Song Lyrics | Bhagyarekha (1957)

నీ సిగ్గే సింగారమే 


చిత్రం :  భాగ్యరేఖ (1957)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  దేవులపల్లి

నేపథ్య గానం :  ఏ. ఎం. రాజా 


పల్లవి :


నీ సిగ్గే సింగారమే... 

నీ సొగసే బంగారమే

నీ సిగ్గే సింగారమే ఓ చెలియా... 

నీ సొగసే బంగారమే

కనులారా గని మెచ్చేనే.... 

ఓ వనలక్ష్మి

మనసిచ్చి దిగివచ్చెనే... 

ఉహు హు ఉహు హు


చరణం 1 :


ఓ... ఓ...  ఓ... ఓ... ఓ...  ఓ

నీ నవ్వు పూలు...  

అవే మాకు చాలు

నీ వయ్యారాలు...  

అవే వేనవేలు

ఓ పేదరాలా... 

మరే పూజలేల

మా పైన నీ దయ 

చూపవా ఓ నా చెలి


నీ సిగ్గే సింగారమే ఓ చెలియా... 

నీ సొగసే బంగారమే

నీ సిగ్గే సింగారమే


చరణం 2 :


ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ

మా తోట పూచె 

వసంతమ్ము నీవే

మా బాట చూపే 

ప్రభాతమ్ము నీవే

మాలోన కొలువైన 

మహలక్ష్మి నీవే

మా పైన నీ దయ 

చూపవా ఓ నా చెలి


నీ సిగ్గే సింగారమే ఓ చెలియా... 

నీ సొగసే బంగారమే

కనులారా గని మెచ్చేనే... 

ఓ వనలక్ష్మి

మనసిచ్చి దిగివచ్చెనే... 

ఉహు హు ఉహు హు


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

దేవుడిచ్చిన వరముగా | Devudichina Varamuga | Song Lyrics | Kanna Koduku (1973)

దేవుడిచ్చిన వరముగా  చిత్రం :  కన్నకొడుకు (1973) సంగీతం :  టి. చలపతిరావు గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  పి.సుశీల పల్లవి : దేవుడిచ్చిన వరము...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు