RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, నవంబర్ 2026, శుక్రవారం

ఓ పంచవన్నెల చిలకా | O Panchavannela Chilaka | Song Lyrics | Appuchesi Pappukudu (1959)

ఓ పంచవన్నెల చిలకా 


చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  

నేపథ్య గానం : ఘంటసాల, స్వర్ణలత


పల్లవి :


ఓ మరదలా... 

నాలో పొంగి పొరలే 

ప్రేమ వరదలా

నీరూ పాలూ కలిసి 

ఒకటైనటులే... 

నీవూ నేనూ ఒకటే గదా


ఓ పంచవన్నెల చిలకా...

ఆ ?... ఆ

ఓ పంచవన్నెల చిలకా... 

నీకెందుకింత అలక?

ఓ పంచవన్నెల చిలకా... 

నీకెందుకింత అలక?


మాటాడవేమే... మాటాడవేమే... 

నీ నోటి ముత్యాలొలక

పంచవన్నెల చిలకా...


ఓ పంచవన్నెల చిలకా... 

నీకెందుకింత అలక?

ఓ పంచవన్నెల చిలకా... 

నీకెందుకింత అలక?


ఓహో బావా... మార్చుకో 

నీ వంకరటింకర దోవ

ఊరికే నీవూ నేనూ 

ఒకటేననుకుంటే...  

ఒప్పుతుందా యీ లోకం?

ఓ కొంటె బావగారూ... హాయ్!

ఓ కొంటె బావగారూ... 

మనకెందుకింక పోరు?

ఓ కొంటె బావగారూ... 

మనకెందుకింక పోరు?

మా నాన్నగారు చూస్తే...

మా నాన్నగారు చూస్తే...  

మీ దుమ్ము దులుపుతారు!


ఓ కొంటె బావగారూ...

ఓ కొంటె బావగారూ... 

మనకెందుకింక పోరు?


చరణం 1 :


సీమటపాకాయలాగ 

చిటాపటాలాడేవు

సీమటపాకాయలాగ 

చిటాపటాలాడేవు

ప్రేముందా లేదా... 

ఓ మరదలా నా మీద?


పంచవన్నెల చిలకా...

ఓ పంచవన్నెల చిలకా... 

నీకెందుకింత అలక?


చరణం 2 :


మరదలినైతే మాత్రం 

మరీ అంత చనువా?

మరదలినైతే మాత్రం 

మరీ అంత చనువా?

మరియాద కాదు 

మీ బావ మరిది చొరవ


ఓ కొంటె బావగారూ...

ఓ కొంటె బావగారూ... 

మనకెందుకింక పోరు?

మా నాన్నగారు చూస్తే...

మా నాన్నగారు చూస్తే...  

మీ దుమ్ము దులుపుతారు


ఓ కొంటె బావగారూ... 

ఓ పంచవన్నెల చిలకా

ఓ కొంటె బావగారూ... 

ఓ పంచవన్నెల చిలకా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ పంచవన్నెల చిలకా | O Panchavannela Chilaka | Song Lyrics | Appuchesi Pappukudu (1959)

ఓ పంచవన్నెల చిలకా  చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : పింగళి నాగేంద్రరావు   నేపథ్య గానం : ఘంటసాల, స...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు