ఎన్నడైనా అనుకున్నానా
చిత్రం : కన్నకొడుకు (1973)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : పి.సుశీల
పల్లవి :
ఎన్నడైనా అనుకున్నానా...
ఎప్పుడైనా కలగన్నానా
ఇంత చల్లని మనసు నీకుందనీ
ఆ మనసులో నాకెంతో చోటుందనీ
ఎన్నడైనా అనుకున్నానా...
చరణం 1 :
నీ చిరునవ్వుల నీడలలోన...
మేడకడతాననీ
అల్లరిచేసే నీ చూపులతో...
ఆడుకుంటాననీ
ఎవరికి అందని నీకౌగిలిలో...
వాలిపోతాననీ
నీ రూపమునే నా కన్నులలో...
దాచుకుంటాననీ..
ఎన్నడైనా అనుకున్నానా...
ఎప్పుడైనా కలగన్నానా?
ఇంత చల్లని మనసు నీకుందనీ
ఆ మనసులో నాకెంతో చోటుందనీ
ఎన్నడైనా అనుకున్నానా..ఆ
చరణం 2 :
వలపులు చిందే నా గుండెలలో
నిండివుంటావనీ
పెదవుల దాగిన గుసగుసలన్నీ
తెలుసుకుంటావనీ
నా గుడిలోపల దైవము నీవై
వెలుగుతుంటావనీ
విరిసే సొగసుల విరజాజులతో
పూజ చేసేననీ..ఈ.. ఈ
ఎన్నడైనా అనుకున్నానా..
ఎప్పుడైనా కలగన్నానా?
ఇంత చల్లని మనసు నీకుందనీ
ఆ మనసులో నాకెంతో చోటుందనీ
ఎన్నడైనా అనుకున్నానా?
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి