ఉన్నది నాకొక ఇల్లు
చిత్రం : కన్నకొడుకు (1973)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సి.నారాయణరెడ్డి
నేపథ్య గానం : ఘంటసాల
పల్లవి :
ఉన్నది నాకొక ఇల్లు...
ఉన్నది నాకొక తల్లి
ఆ ఇల్లే బంగరు కోవెల...
ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు...
ఉన్నది నాకొక తల్లి
ఆ ఇల్లే బంగరు కోవెల...
ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు...
ఉన్నది నాకొక తల్లి
చరణం 1 :
చిన్నబాబుగారున్నారు...
వెన్నపూసతో పెరిగారు
చిన్నబాబుగారున్నారు...
వెన్నపూసతో పెరిగారు
సరదాబాబుల సహవాసంలో...
దారితప్పి పోతున్నారు
చేజారి పోతున్నారు
ఉన్నది నాకొక ఇల్లు...
ఉన్నది నాకొక తల్లి
చరణం 2 :
పెద్దయ్యగారి పేరు చెప్పితే...
పెద్దపులే భయపడుతుంది
ఛెళ్ళున కొరడా ఝళిపిస్తేనే...
ఇల్లు దద్దరిల్లి పోతుంది
మా ఒళ్ళు హూనమైపోతుంది
ఉన్నది నాకొక ఇల్లు...
ఉన్నది నాకొక తల్లి
ఆ ఇల్లే బంగరు కోవెల...
ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు...
ఉన్నది నాకొక తల్లి
చరణం 3 :
పాపమ్మలాంటి అత్తమ్మగారు...
ప్రతి ఇంటిలోన వుంటారు
ఆయమ్మగారు మహమ్మారి తీరు...
ఆయమ్మగారు మహమ్మారి తీరు
అన్నీ స్వాహా చేస్తారు...
గుటకాయస్వాహా చేస్తారు
చరణం 4 :
అమ్మ అనే రెండక్షరాలలో...
కోటి దేవతల వెలుగుంది
అమృత మనేది వుందంటే...
అది అమ్మ మనసులోనే వుంది
మా అమ్మ మనసులోనే వుంది...
ఆ తల్లి చల్లని దీవెన చాలు...
ఎందుకు వేయి వరాలు
ఇంకెందుకు వేయి వరాలు
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి