RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, ఏప్రిల్ 2022, బుధవారం

ఓహో తమరేనా చూడవచ్చారు | Ohu Thamarena | Susheela Song Lyrics | Kanne Manasulu (1966)

ఓహో తమరేనా చూడవచ్చారు



చిత్రం : కన్నెమనసులు (1966)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల 



పల్లవి :


ఓహో తమరేనా చూడవచ్చారు... 

చూసీ ఏం చేస్తారు

ఓహో తమరేనా చూడవచ్చారు... 

చూసీ ఏం చేస్తారు


అమ్మమ్మ... అమ్మమ్మా ... 

అయ్యో రామా

ఓహో తమరేనా చూడవచ్చారు... 

చూసీ ఏం చేస్తారు



చరణం 1 :



సంతలోని జంతువును కాను సుమా

వంట యింటి కుందేలును అవను సుమా

సంతలోని జంతువును కాను సుమా

వంట యింటి కుందేలును అవను సుమా


ఎవరేమిటన్నా మగవాళ్ళకన్నా

మా వాళ్ళె మిన్నా నీ డాబు సున్నా..

వెళ్ళండి వెళ్ళండి మీ దారి మళ్ళండి...  

డూ డూ డూ బసవన్నా



ఓ మామా....  అయ్యో రామా

ఓహో తమరేనా చూడవచ్చారు... 

చూసీ ఏం చేస్తారు



చరణం 2 :


అలుగుట తగదురా పెళ్ళి కుమారా

హాస్యములాడితిరా వలపుల చోరా

చెమటలు పోసినవా చెంగున వీతురా

చెమటలు పోసినవా చెంగున వీతురా

చెలరేగి నీ భరతం పట్టిస్తారా



ఓ మామా....  అయ్యో రామా

ఓహో తమరేనా చూడవచ్చారు... 

చూసీ ఏం చేస్తారు



చరణం 3 :


మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో

ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా

మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో

ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా

పెళ్ళాడు రోజు ఉంటుంది మోజు

ఆపైన క్లోజు పడుతుంది బూజు

ఆనాడు ఈనాడు ఏనాడు మనువాడు 

ఇంతే రివాజు



ఓ మామా....  అయ్యో రామా

ఓహో తమరేనా చూడవచ్చారు... 

చూసీ ఏం చేస్తారు


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు