ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా
Movie : Sri Rajeswari Vilas Coffee club,
Music : Pendyala Nageswararao,
Lyrics : Dasaradhi,
Singers : Balu, Susheela,
ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా
ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా
అండ పిండ బ్రహ్మాండమంతటా నిండియున్న
ఓ స్వామీ నిను నే ఎక్కడ వెదుకుదురా
ఏ విధి కొలువనురా
అంగ రంగ సర్వాంగమంతటా
నిండియున్న ఏమని పిలువనురా
రంగు రంగుల పువ్వులలో
నీ రమ్యరూపమే చూసేరు
అ అ రంగు రంగుల పువ్వులలో
నీ రమ్యరూపమే చూశాను
అ అ పున్నమి జాబిలి వెన్నెలలో
ఉనికిని తెలియగజాలేరు
అ అ పున్నమి జాబిలి వెన్నెలలో
నీ ఉనికిని కనుగొన గలిగాను
అ అ గల గల పారే సెలయేరులలో
అ అ అ అ
అ అ గల గల పారే సెలయేరుల
నీ గానమునే వినగలిగాను
కొమ్మ కొమ్మలో రెమ్మ రెమ్మలో
కొలువై యున్నావట స్వామీ
ఏ గతి చూతునురా ఏ విధి కొలువనురా
అంతే లేని ఆకసమే
నీ ఆలయమని పూజించేరు
అందాలొలికే అరవిందాలే
నీ చిరునవ్వని ఎంచాను
నీవే లేనీ తావేలేదని
నిమిష నిమిషము తలచేరు
నాలో నిన్నే చూసిన నేను
ఎక్కడ వెదుకుదురా స్వామీ
ఏ విధి కొలువనురా ఏమని పిలువనురా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి