ఓ కోయిలా ఎందుకే కోయిలా
చిత్రం: ఇదా లోకం (1973)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: సి నారాయణ రెడ్డి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
ఓ కోయిలా ..ఆ..ఆ...
ఓ కోయిలా ..ఆ..ఆ..
రమ్మన్న రామచిలుక
బొమ్మలాగ ఉలకదు పలకదు
ఓ కోయిలా..ఆ..ఆ ఎందుకే కోయిలా
ఓ కోయిలా ..ఆ..ఆ...
రమన్న చిన్నవాడు
కళ్ళైన కదపడు మెదపడు
ఓ కోయిలా ఎందుకే కోయిలా
చరణం 1:
కొత్తగా ఒక కోరిక పుట్టింది....
మెత్తగా అది కలవర పెట్టింది...
ఊహు..ఊహు..లా..లా..లా
కొత్తగా ఒక కోరిక పుట్టింది..
మెత్తగా అది కలవర పెట్టింది
దయలేని పెదవుల పరదాలలో...
దయలేని పెదవుల పరదాలలో...
అది దాగుడుమూతలు ఆడుతుంది...
దాటిరాలేనంటుంది
ఆ..ఆ.. ఆ... ఆ
ఓ కోయిలా... ఎందుకే కోయిలా
చరణం 2 :
వెచ్చగా తాకాలని ఉందీ..
వెన్నలా కరగాలని ఉందీ....
ఊహు..ఊహూ..లా..లా..లా..
వెచ్చగా తాకాలని ఉందీ..
వెన్నలా కరగాలని ఉందీ
తొలి ముద్దు కాజేసి...
వలపే పల్లవి చేసి
తొలి ముద్దు కాజేసి...
వలపే పల్లవి చేసి
బ్రతుకంతా పాడాలని ఉంది...
పాటగా బ్రతకాలని ఉంది...
ఆ... ఆ... ఆ
ఓ కోయిలా ..ఆ..ఆ...
రమ్మన్న రామచిలుక
బొమ్మలాగ ఉలకదు పలకదు
ఓ కోయిలా.. ఆ.. ఆ .. ఎందుకే కోయిలా...
ఎందుకే కోయిలా..
ఎందుకే కోయిలా.... ఎందుకే కోయిలా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి