RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, ఏప్రిల్ 2022, మంగళవారం

పల్లెటూరు మన భాగ్యసీమరా | Palletooru Mana Bhagya Seema raa | Song Lyrics | Illu Illalu (1972)

పల్లెటూరు మన భాగ్యసీమరా



చిత్రం :  ఇల్లు-ఇల్లాలు (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  కొసరాజు

నేపధ్య గానం :  బాలు,  సుశీల   



పల్లవి :


పల్లెటూరు మన భాగ్యసీమరా.. 

పాడి పంటలకు లోటు లేదురా

పల్లెటూరు మన భాగ్యసీమరా.. 

పాడి పంటలకు లోటు లేదురా

మంచితనం మమకారం 

మనిషి మనిషిలో కనబడురా  

                

పల్లెటూరు మన భాగ్యసీమరా.. 

పాడి పంటలకు లోటు లేదురా

మంచితనం మమకారం 

మనిషి మనిషిలో కనబడురా          

పల్లెటూరు మన భాగ్యసీమరా.. 

పాడి పంటలకు లోటు లేదురా 



చరణం 1 : 



కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు 

కొల్లగ ప్రవేశపెడదాము.. 

కొల్లగ ప్రవేశపెడదాము

బీటినేలలను పాటుకుతెచ్చి 

సుక్షేత్రాలను చేద్దాము.. 

సుక్షేత్రాలను చేద్దాము

కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు 

కొల్లగ ప్రవేశపెడదాము

బీటినేలలను పాటుకుతెచ్చి 

సుక్షేత్రాలను చేద్దాము 


చదివినామనే బింకం వదిలి 

ఆడామగ చేదోడుగ కదిలి.. 

బంగారము పండిద్దాము

ఓహోహోయ్..ఓహోహోయ్.. 

ఓహోహోయ్.. పదిమందిని పోషిద్దాము

ఓహోహోయ్.. ఓహోహోయ్.. 

ఓహోహోయ్

పల్లెటూరు మన భాగ్యసీమరా.. 

పాడి పంటలకు లోటు లేదురా

 

చరణం 2 :



జీవనదులు కృష్ణా.. గోదావరి.. 

తుంగభద్రలే వున్నవి

జీవనదులు కృష్ణా.. గోదావరి.. 

తుంగభద్రలే వున్నవి

పంటనిచ్చు హంసా.. మసూరి.. 

వరి వంగడాలు వస్తున్నవి

పంటనిచ్చు హంసా.. మసూరి.. 

వరి వంగడాలు వస్తున్నవి


జీవనదులు కృష్ణా..  గోదావరి 

తుంగభద్రలే వున్నవి

పంటనిచ్చు హంసా.. మసూరి.. 

వరి వంగడాలు వస్తున్నవి

కరువుని దూరం చేద్దాము 

జాతికి ప్రాణం పోద్దాము

ఆంధ్రదేశమే అన్నపూర్ణయను 

పేరుకీర్తులను నిలబెడదాము

ఆంధ్రదేశమే అన్నపూర్ణయను 

పేరుకీర్తులను నిలబెడదాము     


పల్లెటూరు మన భాగ్యసీమరా..  

పాడి పంటలకు లోటు లేదురా



చరణం 3 :


సోమరితనముగ తిరిగేవాళ్లే 

సంఘానికి విద్రోహులురా.. 

సంఘానికి విద్రోహులురా

ఐకమత్యముగ యువకులందరూ 

ఒళ్లువంచి పనిచెయ్యాలిరా.. 

ఒళ్లు వంచి పనిచెయ్యాలిరా


సోమరితనముగ తిరిగేవాళ్లే 

సంఘానికి విద్రోహులురా

ఐకమత్యముగ యువకులందరూ 

ఒళ్లువంచి పనిచెయ్యాలిరా

ఉద్యోగంలో.. వ్యాపారంలో 

తృప్తియన్నదే వుండదురా

స్వతంత్రమగు మన రైతు వృత్తిలో 

గౌరవమున్నదిరా.. 

ఎంతో గౌరవమున్నదిరా   

                 

పల్లెటూరు మన భాగ్యసీమరా.. 

పాడి పంటలకు లోటు లేదురా

మంచితనం మమకారం 

మనిషి మనిషిలో కనబడురా      

    

పల్లెటూరు మన భాగ్యసీమరా.. 

పాడి పంటలకు లోటు లేదురా

మంచితనం మమకారం 

మనిషి మనిషిలో కనబడురా          

పల్లెటూరు మన భాగ్యసీమరా.. 

పాడి పంటలకు లోటు లేదురా


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు