ఎంత సరసుడైనాడమ్మా
చిత్రం : రాజపుత్ర రహస్యం (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఎంత సరసుడైనాడమ్మా...
ఏమి పురుషుడైనాడమ్మా
ఏ గాలి తాకిందో ఇంతవాడైనాడమ్మా
ఏడ దాచుకోనమ్మా... ఏడ దాచుకోనమ్మా
ఎంత సరసుడైనాడమ్మా...
ఏమి పురుషుడైనాడమ్మా
ఏ గాలి తాకిందో ఇంతవాడైనాడమ్మా
ఏడ దాచుకోనమ్మా... ఏడ దాచుకోనమ్మా
చరణం 1 :
తాకింది ఒకసారైనా తడి వలపు తొందరలాయే
నాటింది ఒక ముద్దైనా నా వల్ల కాకపోయే
ఇంతలోనే ఇంతలైతే... చినుకులోనే మునకలైతే
ఎలా తట్టుకుంటానో... ఓ..ఓ..ఓ..
ఈ రసికత వెల్లువైతే... ఈ రసికత వెల్లువైతే...
ఎంత సరసుడైనాడమ్మా...
ఏమి పురుషుడైనాడమ్మా
ఈ పిల్లగాలి తాకి ఇంతవాడైనాడమ్మా
ఇంకెంతో అవుతాడమ్మా...
ఇంకెంతో అవుతాడమ్మా...
చరణం 2 :
పొద్దు పొడువనివ్వను... ముద్దులాగిపోవునేమో
కౌగిలి విడనీయను.. కాగే చలి ఆగునేమో
పొద్దు పొడువనివ్వను... ముద్దులాగిపోవునేమో
కౌగిలి విడనీయను.. కాగే చలి ఆగునేమో
ఋతువులపై శయనించి..
రుచులన్నీ రంగరించి..
ఋతువులపై శయనించి..
రుచులన్నీ రంగరించి..
రసజగాల తేలింతునే...
రాచవన్నె రామచిలక...
రాచవన్నె రామచిలక...
ఎంత సరసుడైనాడమ్మా...
ఏమి పురుషుడైనాడమ్మా
ఈ పిల్లగాలి తాకి ఇంతవాడైనాడమ్మా
ఇంకెంతో అవుతాడమ్మా...
ఏడ దాచుకోనమ్మా...
ఏడ దాచుకోనమ్మా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి