RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, జనవరి 2022, మంగళవారం

తనువా హరిచందనమే | Tanuva Hari chandaname | Song Lyrics | Kathanayakuralu (1971)

 తనువా హరిచందనమే




చిత్రం : కథానాయకురాలు (1971) సంగీతం : ఆకుల అప్పల రాజ్ గీతరచయిత : విజయ రత్నం నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి: తనువ.. హరిచందనమే.. పలుకా..ఉహు.. అది మకరందమే తనువా... ఉహు.. హరిచందనమే.. పలుకా.. ఉహు.. అది మకరందమే.. కుసుమాలు తాకగనే..

నలిగేను కాదా ఈ మేను నలిగేను కాదా నీ మేను తనువా...ఉహు.. హరిచందనమే.. పలుకా..ఉహు.. అది మకరందమే.. కుసుమాలు తాకగనే..

నలిగేను కాదా ఈ మేను నలిగేను కాదా నీ మేను తనువా హరిచందనమే..

చరణం 1: నీ సోయగాలు కనుసైగ చేసే..

అనురాగ లతలు బంధాలు వేసే ఉహు .. హు .. ఓహో నీ సోయగాలు కనుసైగ చేసే..

అనురాగ లతలు బంధాలు వేసే హరివిల్లునై ఈ విరి బాణమే హరివిల్లునై ఈ విరి బాణమే గురి చూసి హృదయాన విసిరేయనా..

నిను చేరనా.. మురిపించనా.. తనువా...ఉహు.. హరిచందనమే.. పలుకా..ఉహు.. అది మకరందమే.. కుసుమాలు తాకగనే..

నలిగేను కాదా ఈ మేను నలిగేను కాదా నీ మేను

చరణం 2: నీకోసమే ఈ నవ పారిజాతం ..

విరబూసి నీముందు నిలచిందిలే... ఆ...ఆ...ఆ... నీకోసమే ఈ నవ పారిజాతం ..

విరబూసి నీముందు నిలచిందిలే మధుపాయినై మరులూరించనా మధుపాయినై మరులూరించనా ఉయ్యాల జంపాల ఊగించనా..

లాలించనా.. పాలించనా తనువా ...ఉహు.. హరిచందనమే.. పలుకా ..ఉహు.. అది మకరందమే.. కుసుమాలు తాకగనే..

నలిగేను కాదా ఈ మేను నలిగేను కాదా నీ మేను


- పాటల ధనుస్సు


1 కామెంట్‌:

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు