RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, జులై 2022, బుధవారం

గాలికదుపు లేదు | Galikadupuledu | Song Lyrics | Idi Katha Kadu (1979)

గాలికదుపు లేదు



చిత్రం: ఇది కథ కాదు (1979)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: జానకి



పల్లవి:


గాలికదుపు లేదు.. కడలికంతు లేదు

గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా

ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా


గాలికదుపు లేదు.. కడలికంతు లేదు

గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా

ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా


చరణం 1:


ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో

ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో

ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో


తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేగకేది కట్టుబాటు

మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు


గాలికదుపు లేదు.. కడలికంతు లేదు

గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా

ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా


చరణం 2:


ఓ తెమ్మెరా ఊపవే ఊహలా ఊయల నన్నూ

ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకూ


తల్లి మళ్ళి తరుణయ్యింది.. 

పూవు పూసి మొగ్గయ్యింది

గుడిని విడిచివేరొక గుడిలో 

ప్రమిదనైతే తప్పేముందీ


గాలికదుపు లేదు.. కడలికంతు లేదు

గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా

ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


పాటల ధనుస్సు 


జోలపాట పాడి ఊయలూపనా | Jolapata paadi | Song Lyrics | Idi Katha Kadu (1979)

జోలపాట పాడి ఊయలూపనా



చిత్రం: ఇది కథ కాదు (1979) 

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: సుశీల 


పల్లవి: 


జోలపాట పాడి ఊయలూపనా 

నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 

నా జాలి కథను చెప్పి మేలు కొలపనా.. 


జోలపాట పాడి ఊయలూపనా 

నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 

నా జాలి కథన్ను చెప్పి మేలు కొలపనా 

పెళ్ళాడిన ఆ మగడు.. ప్రేమించిన ఈ ప్రియుడు 

పెళ్ళాడిన ఆ మగడు.. ప్రేమించిన ఈ ప్రియుడు 

వెళ్ళారు నన్ను విడచి.. వచ్చావు నువ్వు ఒడికి.. 

వచ్చావు నువ్వు ఒడికి 


జోలపాట పాడి ఊయలూపనా 

నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 

నా జాలి కథను చెప్పి మేలు కొలపనా 


చరణం 1: 


చేసుకున్న బాసలన్ని చెరిగిపోయెను... 

నే రాసుకున్న విన్నపాలు చేరవాయెను 

చేసుకున్న బాసలన్ని చెరిగిపోయెను... 

నే రాసుకున్న విన్నపాలు చేరవాయెను 


ఆకసాన చీకటులే ఆవరించెనూ 

ఆశలన్ని విడిచి ఉన్న నేడు వెన్నెలొచ్చెను 


జోలపాట పాడి ఊయలూపనా 

నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 

నా జాలి కథన్ను చెప్పి మేలు కొలపనా 


చరణం 2: 


మీరా మనసారా నాడు వలచెను గోపాలుని 

కోరిక నెర వేరక చేపట్టెను భూపాలుని 

మీరా మనసారా నాడువలచెను గోపాలుని 

కోరిక నెర వేరక చేపట్టెను భూపాలుని 


ఆ కథకు నా కథకు అదే పోలికా 

ఆ మీదట ఏమయినది చెప్పలేనికా 


జోలపాట పాడి ఊయలూపనా 

నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 

నా జాలి కథన్ను చెప్పి మేలు కొలపనా 


చరణం 3: 


నల్లనయ్య నాడూదెను పిల్లనగ్రోవీ 

ఆమె పరవశించి పోయినదా గానము గ్రోలీ 

నల్లనయ్య నాడూదెను పిల్లనగ్రోవీ 

ఆమె పరవశించి పోయినదా గానము గ్రోలీ 


మరువరాని ఆ మురళి మరల మ్రోగెనూ 

ఆ మధుర గానమునకు బాబు నిదురపోయెనూ


పాటల ధనుస్సు


19, జులై 2022, మంగళవారం

సరిగమలు గలగలలు | Sarigamalu galagalalu | Song Lyrics | Idi Katha Kadu (1979)

సరిగమలు గలగలలు



చిత్రం: ఇది కథ కాదు (1979) 

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు 

ప్రియుడే సంగీతము...ప్రియురాలి నాట్యము 

చెలికాలి మువ్వల గల గలలూ 

చెలి కాలి మువ్వల గల గలలూ 

చెలికాని మురళిలో.... 

సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు 

సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు 


చరణం 1: 


ఆవేశమున్నది ప్రతి కళలో 

అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో 

ఆవేశమున్నది ప్రతి కళలో 

అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో 


కదలీ కదలక కదిలించు కదలికలు 

కదలీ కదలక కదిలించు కదలికలు 

గంగా తరంగాల శృంగార డోలికలు 


సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు 

ప్రియుడే సంగీతము...ప్రియురాలి నాట్యము 


చరణం 2: 


హృదయాలు కలవాలి ఒక శృతిలో 

బ్రతుకులు నడవాలి ఒక లయలో 

శృతిలయలొకటైన అనురాగ రాగాలు 

జతులై జతలైన నవరస భావాలు 


సరిగమలు గలగలలు... సరిగమలు గలగలలు 

సరిగమలు గలగలలు... సరిగమలు గలగలలు 


చరణం 3: 


నయనాలు కలిశాయి ఒక చూపులో 

నాట్యాలు చేశాయి నీ రూపులో 

నయనాలు కలిశాయి ఒక చూపులో 

నాట్యాలు చేశాయి నీ రూపులో 


రాధనై పలకనీ నీ మురళి రవళిలో 

పాదమై కదలనీ నీ నాట్య సరళిలో 


సరిగమలు గలగలలు... 

ప్రియుడే సంగీతము...ప్రియురాలి నాట్యము 


ఆహా.. అహహా.. ఆహా.. అహహా 

ఆహా.. అహహా.. ఆహా.. అహహా 

ఆహా.. అహహా.. ఆహా.. అహహా


పాటల ధనుస్సు 


18, జులై 2022, సోమవారం

నా మనసే ఒక తెల్లని కాగితం | Naa Manase oka Tellani | Song Lyrics | Ardhangi (1977)

నా మనసే ఒక తెల్లని కాగితం



చిత్రం :  అర్ధాంగి (1977)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  సుశీల 




పల్లవి :


నా మనసే ఒక తెల్లని కాగితం

నీ వలపే తొలి వెన్నెల సంతకం

నా మనసే ఒక తెల్లని కాగితం

నీ వలపే తొలి వెన్నెల సంతకం


అది ఈనాడైనా ఏనాడైనా.. 

నీకే నీకే అంకితం.. 

నా మనసే ఒక తెల్లని కాగితం

నీ వలపే తొలి వెన్నెల సంతకం


చరణం 1 :


తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే

మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే

తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే

మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే  


కనులే కలలై.. కలలే కనులై

కనులే కలలై.. కలలే కనులై

చూసిన అందాలు అనుబంధాలు.. 

అవి నీకే నీకే అంకితం 


నా మనసే ఒక తెల్లని కాగితం

నీ వలపే తొలి వెన్నెల సంతకం



చరణం 2 :


నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే

పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే

నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే

పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే

ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై

ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై

పలికిన రాగాలు అనురాగాలు.. 

అవి నీకే నీకే అంకితం  


నా మనసే ఒక తెల్లని కాగితం

నీ వలపే తొలి వెన్నెల సంతకం


పాటల ధనుస్సు 

15, జులై 2022, శుక్రవారం

శనగపూల రైకా దానా | Sanagapoola raika daana | Song Lyrics | Tatamma Kala (1974)

శనగపూల రైకా దానా



చిత్రం :  తాతమ్మ కల (1974)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  కొసరాజు

నేపధ్య గానం :  ఘంటసాల 



పల్లవి :


శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా

శనగపూల రైకా దానా..  జారుపైటా చిన్నాదానా

ఆడే నీ వాలకం పసిగట్టానే.. 

నాదానా నువ్వేననీ కనిపెట్టానే


శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా

శనగపూల రైకా దానా . . జారుపైటా చిన్నాదానా

ఆడే నీ వాలకం పసిగట్టానే.. 

నా దానా నువ్వేననీ కనిపెట్టానే



చరణం 1 :


ఘల్లు ఘల్లున అందెలు మోగుతుంటే..  

ఘల్లు ఘల్లున అందెలు మోగుతుంటే

గుమ్మెత్తించే వాసన రేగుతుంటే.. 

ఏ పక్క చప్పుడైనా . . ఏ దిక్కు అలికిడైనా

నువ్వే వస్తుంటివనీ అనుకుంటినే.. 

నీతోడూ ఒట్టేసి చెబుతుంటినే



శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా

శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా

ఆడే నీ వాలకం పసిగట్టానే.. 

నా దానా నువ్వేననీ కనిపెట్టానే



చరణం 2 :  



గుబ్బల బరువున నడుము ఊగుతుంటే.. 

హంస లాగ నువ్వు అడుగు వేస్తుంటే

గుబ్బల బరువున నడుము ఊగుతుంటే.. 

హంస లాగ నువ్వు అడుగు వేస్తుంటే


వయ్యారమంత చూసి అబ్బబ్బ పళ్ళు పులిసీ

వయ్యారమంత చూసి అబ్బబ్బ పళ్ళు పులిసీ

పంట చేను సిగ్గుతోటి తల వంచిందే.. హహహహహ

పకాపకా కొంటె నవ్వు కుమ్మరించిందే


శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా

శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా

ఆడే నీ వాలకం పసిగట్టానే.. 

నా దానా నువ్వేననీ కనిపెట్టానే



చరణం 3 :



రంభ లాగ నువ్వు ఎదుట ఉంటేనూ.. 

రామచిలక లాగ కులుకుతుంటేనూ

రంభ లాగ నువ్వు ఎదుట ఉంటేనూ.. 

రామచిలక లాగ కులుకుతుంటేనూ

స్వర్గాన్ని కాదంటా నిన్నే కోరుకుంటా

నా భాగ్యదేవతవి నీవని మురుసుకుంటానే.. 

భద్రంగా గుండెల్లో దాచుకుంటానే


  

శనగపూల రైకా దానా..  జారుపైటా చిన్నాదానా

శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా

ఆడే నీ వాలకం పసిగట్టానే.. 

నా దానా నువ్వేననీ కనిపెట్టానే


పాటల ధనుస్సు

14, జులై 2022, గురువారం

మనసే పొంగెను ఈ వేళా | Manase pongenu ee vela | Song Lyrics | Raitu Kutumbam (1972)

మనసే పొంగెను...ఈ వేళా

చిత్రం :  రైతు కుటుంబం (1972)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల   



పల్లవి :


మనసే పొంగెను.. ఈ వేళా..ఆ

వలపే పండెను.. ఈ వేళా..ఆ

మనసే పొంగెను ఈ వేళా..ఆ

వలపే పండెను ఈ వేళా..ఆ


తారల దారుల...  వెన్నెల వాడల

తారల దారుల... వెన్నెల వాడల

తనువే ఊగెను  ఉయ్యాలా

మనసే పొంగెను ఈ వేళా.. ఆ

వలపే పండెను ఈ వేళా.. ఆ



చరణం 1 :


నీల గగనాల ముంగిటా.. 

ఆణి ముత్యాల పందిటా..

మంగళ వాద్యాలు... మ్రోగగా.. 

నవపారిజాతాలు...కురియగా

జరుగునులే మన కళ్యాణమూ..

పలుకునులే జీవనరాగమూ..

పలుకునులే జీవనరాగమూ..



మనసే పొంగెను ఈ వేళా..

వలపే పండెను ఈ వేళా..

ఈవేళా..ఆ..ఆ.. ఈవేళా..ఆ 



చరణం 2 :



పూలపానుపున నేనుంటే.. 

తలుపు మాటున నీవుంటే

చిలిపిగ నీవే నను చేరగా.. 

సిగ్గులు నాలో చిగురించగా

తొలిరేయి మనకై పెరిగేనులే

కౌగిలిలో హాయి కరిగేనులే

కౌగిలిలో హాయి కరిగేనులే



మనసే పొంగెను...ఈ వేళా

వలపే పండెను...ఈ వేళా

ఈ వేళా..ఆ..ఆ..ఈ వేళా..ఆ


పాటల ధనుస్సు


12, జులై 2022, మంగళవారం

జిల్లాయిలే జిల్లాయిలే | Jillayile Jillayile | Song Lyrics | Raitu Kutumbam (1972)

జిల్లాయిలే... జిల్లాయిలే



చిత్రం :  రైతు కుటుంబం (1972)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి  



పల్లవి :


ఓయమ్మో..ఓయమ్మో...

కన్నెపిల్ల పక్కనుంటే కళ్ళు తేల వేస్తాడు ఓయమ్మో..

జున్నుముక్క చేతికిస్తే నీళ్ళునములుతుంటాడు..

జిల్లాయిలే... జిల్లాయిలే....జిల్లాయిలే... జిల్లాయిలే....

ఈ బుల్లోడు పాతికేళ్ల బుజ్జాయిలే...ఏ..ఏ..

జిల్లాయిలే... జిల్లాయిలే....జిల్లాయిలే... జిల్లాయిలే....


ఓయబ్బో...ఓయబ్బో...

కుర్రదాని కొంటెవయసు కూతవేసి పిలిచింది...అయ్యబ్బో..

చేయి పట్టుకుందమంటే జింకలాగ బెదిరింది...

జిల్లాయిలే... జిల్లాయిలే....జిల్లాయిలే... జిల్లాయిలే....

ఈ బుల్లెమ్మ సంక దిగని పాపాయిలే...ఏ..ఏ..

జిల్లాయిలే... జిల్లాయిలే....జిల్లాయిలే... జిల్లాయిలే.... 



చరణం 1 :


కన్నుగీటినా కదలనోడు... చెంపమీటినా చెరదనోడు..

కన్నుగీటినా కదలనోడు... చెంపమీటినా చెరదనోడు..

ఏ గాలి సోకిందో ఎగిరెగిరిపడ్డాడు...

ఏ నీడి తాకిందో ఇలా పాలిపోయాడు...

తాయతు కడితే కానీ దారికి రాడోయమ్మా...

జిల్లాయిలే... జిల్లాయిలే....జిల్లాయిలే... జిల్లాయిలే....


సరసాలంటే ఎరగనోడినా... చక్కిలిగింతే తెలియనోడినా...

సరసాలంటే ఎరగనోడినా... చక్కిలిగింతే తెలియనోడినా...

ఏదో పసిపిల్లవని ఇన్నాళ్లు కైసానే...

సమయం కుదిరేదాకా తమాయించుకున్నానే...

మూడుముళ్ళ పగ్గమేసి ముట్టే పొగరు తీస్తానే...

జిల్లాయిలే... జిల్లాయిలే....జిల్లాయిలే... జిల్లాయిలే.... 




చరణం 2 :


ఎన్ని నేర్చెనే చిన్నవాడు... ఎక్కడిదమ్మో ఇంత జోరు...

హా.. ఎన్ని నేర్చెనే చిన్నవాడు... ఎక్కడిదమ్మో ఇంత జోరు...


మాటలు చూస్తేనేమో కోటలు దాటేనమ్మా...

వాటం చూస్తేనేమో పోట్ల గిత్త ఓయమ్మ ...

తీరా దగ్గరకొస్తే నీరైపోతాడమ్మా...

జిల్లాయిలే... జిల్లాయిలే....జిల్లాయిలే... జిల్లాయిలే....


కదను తొక్కుతున్నాది గజ్జల గుర్రం... 

అదను చూసి వెయ్యాలి వలపుల కళ్ళెం..

కదను తొక్కుతున్నాది గజ్జల గుర్రం... 

అదను చూసి వెయ్యాలి వలపుల కళ్ళెం..


కువకువలాడే కోర్కెల కొరడా ఝులిపించాలి..

మెరమెరలాడే వయసును పరుగులు తీయించాలి...

అప్పుడు మొదలవుతుందే అమ్మాయి అసలు కథా....


జిల్లాయిలే... జిల్లాయిలే....జిల్లాయిలే... జిల్లాయిలే....

ఈ బుల్లెమ్మ సంక దిగని పాపాయిలే...ఏ..ఏ..

జిల్లాయిలే... జిల్లాయిలే....జిల్లాయిలే... జిల్లాయిలే....


పాటల ధనుస్సు


8, జులై 2022, శుక్రవారం

విరిసిన మరుమల్లి | Virisina Marumalli | Song Lyrics | Raitu Bidda (1971)

విరిసిన మరుమల్లి



చిత్రం :  రైతు బిడ్డ (1971)

సంగీతం :  ఎస్. హనుమంతరావు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  బాలు, సుశీల  


సాకీ : 


దిక్కులను చూసేవు ...దిగులుగా నిలిచేవు

అనుకున్న కబురందలేదా ...

ఆ..ఎందుకమ్మాయి నీకింత బాధా..


పల్లవి :


ఓ..ఓ.. విరిసిన మరుమల్లి.. 

జరుగును మన పెళ్ళీ

విరిసిన మరుమల్లి.. 

జరుగును మన పెళ్ళీ

ముత్యాల పందిరిలోనా ..ఆ..ఆ..

మురిపాల సందడిలోనా..

మురిపాల సందడిలోనా...


విరిసిన మరుమల్లి.. 

జరుగును మన పెళ్ళీ

ముత్యాల పందిరిలోనా ..ఆ..ఆ..

మురిపాల సందడిలోనా..

మురిపాల సందడిలోనా... 


చరణం 1 :


అమ్మగారి దీవెనలు అందుకున్నారా... ..

ఓ......ఓ.. ఆ..... ఆ.....

అన్నగారు అందుకు సరే అన్నారా

మనసు కనుగోనారు..ప్రణయ కథ విన్నారు

మనసు కనుగోనారు..ప్రణయ కథ విన్నారు

మనల మన్నిచారు ...మనువు కుదిరించారు

ఓ......ఓ.....ఆ.....ఆ......

విరిసిన మరుమల్లి... జరుగును మన పెళ్ళీ

ముత్యాల పందిరిలోనా..

మురిపాల సందడిలోనా..

మురిపాల సందడిలోనా 



చరణం 2 : 


ఆ..అ.....ఆ......ఆ......ఓ.......ఓ.....ఓ.......ఓ.......

పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా...

కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?

పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా...

కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?


వలచి కాదంటానా... కలసి విడిపోతానా?

వలచి కాదంటానా... కలసి విడిపోతానా?

ఏకమై ఉందామూ ఎన్ని జన్మలకైనా

ఓ.....ఓ........ఓ........ఓ......ఓ......


విరిసిన మరు మల్లి ...

జరుగును మన పెళ్ళీ

ముత్యాల పందిరిలోనా...

మురిపాల సందడిలోనా...

మురిపాల సందడిలోనా


పాటల ధనుస్సు 


3, జులై 2022, ఆదివారం

ఏదో అనుకున్నాను | Edo Anukunnanu | Song Lyrics | Nippulanti Manishi (1974)

ఏదో అనుకున్నాను



చిత్రం :  నిప్పులాంటి మనిషి (1974)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


ఏదో అనుకున్నాను..  ఏమేమొ కలగన్నాను . .

అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా

ఏదో అనుకున్నాను..  ఏమేమొ కలగన్నాను . .

అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా . .

ఆ . . ఆ . . ఆ . . ఆ



చరణం 1 :


ఏ నీడ లేని దానా.. ఎందుకో నా పైనా . .

చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ  


ఏ నీడ లేని దానా.. ఎందుకో నా పైనా . .

చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ

మరునిమిషం ఆ హృదయం తెరపాలైపోయెనా


ఏదో అనుకున్నాను..  ఏమేమొ కలగన్నాను . .

అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా . . 



చరణం 2 :



పూలెన్నో తెచ్చానూ ..  మాలలెన్నో అల్లానూ

మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను

పూలెన్నో తెచ్చానూ..  మాలలెన్నో అల్లానూ

మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను

మరునిమిషం ఆ దైవం కనుమరుగైపొయెనా


ఏదో అనుకున్నాను..  ఏమేమొ కలగన్నాను . .

అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా . 


పాటల ధనుస్సు 


1, జులై 2022, శుక్రవారం

పాలరాతి బొమ్మకు | Palarathi Bimmaku | Song Lyrics | Ammayi Pelli (1974)

పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడిది



చిత్రం :  అమ్మాయి పెళ్లి (1974)

సంగీతం :  భానుమతి రామకృష్ణ, సత్యం

గీతరచయిత :  దాశరథి

నేపథ్య గానం :  బాలు, జానకి 




పల్లవి :


పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడిది?

పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది?..ఈ..ఈ..


నెలరాజులోనా...వలరాజులోన నీ...వలపెక్కడిది?

నెలరాజులోన నీ చలువెక్కడిది?

వలరాజులోన నీ వలపెక్కడిది?...ఈ..ఈ..


పాలరాతి బొమ్మకు...పొగడపూల కొమ్మకు 

నీ సొగసెక్కడిది..ఈ.. 


చరణం 1 :


కలువపూలు తెల్లవారితే...కమిలిపోవును...

నీ కనులైతే కలకాలం వెలుగుచిందును....

కలువపూలు తెల్లవారితే...కమిలిపోవును...

నీ కనులైతే కలకాలం వెలుగుచిందును....


ఆ..ఆ..మధువు తీపి అంతలోనే...మాసిపోవును...

నీ పలుకు తీపి బ్రతుకంతా నిలిచియుండును....


పాలరాతి బొమ్మకు.. వగలెక్కడిది

పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది..ఈ..ఈ..

నెలరాజులోనా... వలరాజులోన.. నీ వలపెక్కడిది.... 



చరణం 2 :


నీలినీలి మేఘాలు గాలికి చెదిరేను నీ...

కురుల నీడ ఎల్లప్పుడు...నాకే దక్కేను...

నీలినీలి మేఘాలు గాలికి చెదిరేను...

కురుల నీడ ఎల్లప్పుడు...నాకే దక్కేను...


ఆ..ఆ..గలగలమని సెలయేరు కదలిపోవునూ...

కానీ...నీలోని అనురాగం నిలిచి ఉండును....


పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడిది..

పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది..ఈ..ఈ..

నెలరాజులోనా...వలరాజులోన.. నీ వలపెక్కడిది....


నెలరాజులోన నీ చలువెక్కడిది...

వలరాజులోన నీ వలపెక్కడిది...ఈ..ఈ..

పాలరాతి బొమ్మకు...పొగడపూల కొమ్మకు 

నీ సొగసెక్కడిది..ఈ..ఈ..


పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు