RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ramudu kadu krishnudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ramudu kadu krishnudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జనవరి 2023, శుక్రవారం

చూశాక నిను చూశాక | Chusaka ninu chusaka | Song Lyrics | Ramudu Kadu Krishnudu (1983)

చూశాక నిను చూశాక



చిత్రం :  రాముడు కాదు కృష్ణుడు (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :   బాలు, సుశీల 


సాకీ : 


ఒక సంధ్యా సమయాన..దిక్కు తోచక

నే దిక్కులన్నీ చూచుచుండా...

ఉత్తర దిక్కున మెరిసెను ఒక తారక..

అది తారకో...మేనకో...నా అభిసారికో...



పల్లవి :


చూశాక నిను చూశాక...

చూశాక నిను చూశాక

ఆగలేక మనసాపుకోలేక 

రాశాను ఒక లేఖ

అందుకో ఈ ప్రేమలేఖా...

అందించు శుభలేఖ...


చూశాక నిను చూశాక... 


చరణం 1:


అందమంతా ఏర్చి కూర్చి 

అక్షరాలుగ పేర్చినాను

అందమంతా ఏర్చి కూర్చి 

అక్షరాలుగ పేర్చినాను

మనసులోనికి తొంగి చూసి 

భావమంతా కూర్చినాను

మనసులోనికి తొంగి చూసి 

భావమంతా కూర్చినాను


నీ కనులలో నా కనులు కలిపినాను

నీ అడుగులో నేనడుగు వేసినాను

ఈ ఉత్తరం నా జీవితం ...

నీ సంతకం నా జాతకం


చూశాక నిను చూశాక...

చూశాక నిను చూశాక

ఆగలేక మనసాపుకోలేక 

రాశాను ఒక లేఖ

అందుకో ఈ ప్రేమలేఖా...

అందించు శుభలేఖ  



చరణం 2 :


భావమంతా మార్చి మార్చి 

భారతంలా చదువుకున్నా

భావమంతా మార్చి మార్చి 

భారతంలా చదువుకున్నా

బరువు గుండెల రాత చూసి 

బాధనంతా పోల్చుకున్నా

బరువు గుండెల రాత చూసి 

బాధనంతా పోల్చుకున్నా


నీ చూపులో నా రూపు చూసినాను

నా గుండెలో నీ మూర్తి నిలిపినాను

ఈ మాటలే నా ఉత్తరం... 

ఈ పిలుపులే నా సంతకం...


చూశాక నిను చూశాక... 

చూశాక నిను చూశాక

ఆగలేక మనసాపుకోలేక... 

చూశాను నీ లేఖ

చదివాలే చేవ్రాలు దాక... 

పంపిస్తా శుభలేఖ...


చూశాక నిను చూశాక...

ఆగలేక మనసాపుకోలేక..

రాశాను ఒక లేఖ...చూశాను ఆ లేఖ


పాటల ధనుస్సు  


19, జనవరి 2023, గురువారం

ఒక లైలా కోసం తిరిగాను దేశం | Oka Laila kosam | Song Lyrics | Ramudu kadu Krishnudu (1983)

ఒక లైలా కోసం తిరిగాను దేశం



చిత్రం :  రాముడు కాదు కృష్ణుడు (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  బాలు, సుశీల  


పల్లవి :


ఒక లైలా కోసం.. తిరిగాను దేశం

ఒక లైలా కోసం.. తిరిగాను దేశం

ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ .. 

ప్రతి పాటా.. ఆమె కోసం

లైలా... లైలా... లైలా


ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ప్రతి పగలూ ప్రతి రాత్రీ 

ప్రతి తలపూ అతని కోసం

మజ్ఞూ... మజ్ఞూ... మజ్ఞూ


ఒక లైలా కోసం తిరిగాను దేశం



చరణం 1 :


ఆకాశానికి నిచ్చెన వేసీ... 

చుక్కల పట్టుకొనడిగానూ

లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ...

స్వర్గానికి నే దారులు వెతికీ.. 

ఇంద్రుని పట్టుకొనడిగానూ

లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ


దిక్కుల నడుమా నేనుంటే.. 

చుక్కల పట్టుకొనడిగావూ

కన్నుల ముందూ నేనుంటే.. 

కన్నులు మూసుకు వెదికావూ

ప్రతి చూపూ ప్రతి పిలుపూ... 

ప్రతి చోటా నీ కోసం


ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ.. 

ప్రతి తలపూ అతని కోసం

లైలా...లైలా...లైలా

ఒక లైలా కోసం.. తిరిగాను దేశం


చరణం 2 :


పగలూ రేయీ పందెం వేసీ.. 

సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి

మజ్ఞూ ఏడనీ.. నా మజ్ఞూ ఏడనీ

రంభా ఊర్వశి ధైర్యం చేసీ.. 

స్వర్గం విడిచీ వచ్చారూ

లైలా నేననీ.. హహహ.. ఆ లైలా నేననీ


ఇల్లూ వాకిలి వదిలొస్తే 

రంభా ఊర్వశి అంటావూ

నీ కోసం నే పుట్టొస్తే.. 

ఎవ్వరి వెంటో పడతావూ

ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ.. 

ప్రతి తలపూ నీ కోసం


ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ .. 

ప్రతి తలపూ అతని కోసం

మజ్ఞూ...మజ్ఞూ...మజ్ఞూ

ఒక లైలా కోసం తిరిగాను దేశం

ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ.. 

ప్రతి పాటా.. ఆమె కోసం

లైలా...లైలా...లైలా


పాటల ధనుస్సు  


మంచు ముత్యానివో | Manchu Mutyanivo | Song Lyrics | Ramudu Kadu Krishnudu (1983)

మంచు ముత్యానివో



చిత్రం : రాముడు కాదు కృష్ణుడు (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  బాలు


పల్లవి :


మంచు ముత్యానివో..హంపి రతనానివో..ఓ..ఓ..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో...

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో ..ఓ..

మంచు ముత్యానివో..హంపి రతనానివో..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో...

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో


మంచు ముత్యానివో..



చరణం 1 :


తెలుగు బడిలో తొలుత చుట్టిన శ్రీకారానివో

జానపదమున తీపి కలిపిన నుడికారానివో

గాలి వాటుకు..ఎండ పోటుకు..

తాళలేని ఆకు చాటు పిందెవో

కూచిపూడి కొమ్మవో...కొండపల్లి బొమ్మవో...

ప్రణయ మూర్తుల రాగ ప్రమిదకు..

ప్రమిద ప్రమిదలో వెలుగు ప్రేమకు

ప్రతిగా.. కృతిగా.. ఆకృతిగా.. నిలిచే సుందరివో


మంచు ముత్యానివో..ఓ..హంపి రతనానివో..ఓ..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో

మంచు ముత్యానివో..ఓ..   



చరణం 2 :


కాళిదాసుని కావ్యకవితకు ఆకారానివో

దేవరాయని శిల్ప చరితకు ప్రాకారానివో

రెప్ప పాటుకు ..లిప్త చూపుకు..

అందరాని అందమైన మెరుపువో

మెరుపులోని పిలుపువో..పిలుపులోని తలపువో..

విరగబూసిన నిండు పున్నమికి..

తిరగబోసిన పండు వెన్నెలకు

ప్రతిగా.. కృతిగా ..ఆకృతిగా .. నిలిచే సుందరివో


మంచు ముత్యానివో..ఓ..హంపి రతనానివో..ఓ..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో..

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో..ఓ..

మంచు ముత్యానివో..ఓ..


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు