RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
radha saluja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
radha saluja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఏప్రిల్ 2023, బుధవారం

మారింది మారింది కాలం | Marindi marindi Kalam | Song Lyrics | Tiger (1979)

మారింది మారింది కాలం



చిత్రం : టైగర్ (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : సినారె 

నేపథ్య గానం : బాలు, సుశీల  



పల్లవి :


హ్హా..హ్హా..హే..ఆ..ఆ

అ అ అ అ అ ఆ ఆ ఆ అ అ... హేయ్


మారింది మారింది కాలం

మారింది మారింది లోకం 

ఎక్కడమారిందమ్మా... 

ఇంకాదిగజారిందమ్మా

ఇక ఏమని చెప్పేదమ్మా..


మారింది మారింది కాలం

మారింది మారింది లోకం..

ఎక్కడమారిందమ్మా....

ఇంకాదిగజారిందమ్మా..హ్హా

ఇక ఏమని చెప్పేదమ్మా.. 



దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు

దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు 



చరణం 1 :



మనిషిని మనిషి దగా చేసే..

మామూలు రోజులు  కావమ్మా 

ధనికులు పేదల అణి చేసే... 

మునుపటిరోజులు..కావమ్మా



దేవుడి నగలను నిలువున దోచే...

నాగన్నలున్నారమ్మా... 

నామాట నిజమేనమ్మా  కాదంటే... 

అప్పన్ననడగాలమ్మాసింహాద్రి... 

అప్పన్ననడగాలమ్మా  



మారింది మారింది..

కాలంమారింది మారింది..లోకం..  

ఎక్కడమారిందమ్మా... 

ఇంకాదిగజారిందమ్మా... 

అమ్మాఇక ఏమని చెప్పేదమ్మా.. 


దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు

దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు 



చరణం 2 :


హ్హ..హ్హా..హ్హ..హ్హా హ్హ..హ్హా..హ్హ..హ్హా 

నిరుపేదల పూరిళ్ళకు నిప్పంటించని రోజుందా  

నలుగురిలో నడివీధిలో తలలు నరికితే దిక్కుందా


ఆ రామరాజ్యం.... ఆ సామ్యవాదం

ప్రభవెలిగి పోతుందమ్మా..ఆ... హ్హా..బ్రతుకంటే మాదేనమ్మా 

ఈ శుభవార్త... గాంధీజీ చెప్పాలమ్మా

ఆ..పైనున్న... గాంధీజీ చెప్పాలమ్మా


మారింది మారింది కాలం

మారింది మారింది లోకం..ఆ 

ఎక్కడమారిందమ్మా...

ఇంకాదిగజారిందమ్మా..అమ్మా

ఇక ఏమని చెప్పేదమ్మా..


దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు

దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు

దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు

దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు


పాటల ధనుస్సు  


18, ఏప్రిల్ 2023, మంగళవారం

ఏం దెబ్బతీశావు | Em debba teesavu | Song Lyrics | Tiger (1979)

ఏం దెబ్బతీశావు ఏం ఎత్తు వేశావు



చిత్రం : టైగర్ (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


హా..ఓఓఓ..ఏం దెబ్బతీశావు..

ఏం ఎత్తు వేశావు

ఏం మాయచేశావబ్బీ..ఈ..

నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే...

కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..

కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది  


అహా..ఏం బాగా అన్నావు ..

ఏం ముద్దుగున్నావు

ఏం చూపుతున్నావమ్మీ....

నీ ఒంపులు సొంపులు చూస్తూ ఉంటే ...

ఒకలాగున్నది... మతిపోతున్నది..

అబ్భా..ఒకలాగున్నది... మతిపోతున్నది  



చరణం 1 :


ఓ..ఉరికేటి ఓ కొండవాగు..

ఒక కొంతసేపైన ఆగు

ఆ ఊపు తగ్గించుకొంటే....

నీ ఒంటికి బాగు బాగు


నాదేమో నునుపైన సొగసు... 

నీదేమో కరుకరుకున్న వయసు

నీతోటి సరితూగకుంటే... 

నీరౌను నా బేలమనసు


అహ్హా..అహా..ఏం బాగా ఉన్నావు..

ఏం ముద్దుగున్నావు... 

ఏం చూపుతున్నావమ్మీ..

నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే

కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..

కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది 


చరణం 2 :


నీకుంది పదునైన పొగరు... 

లేదెవరు నీకింక ఎదురు

నిను తలచుకుంటేనే చాలు... 

గుండెల్లో ఒక తీపి అదురు 


అరే..పడబోకు నావెంట వెంటా... 

ఉడికించకు ఓరకంటా..

పైటల్లె నను చూసుకుంటే... 

పదిలంగ నీతోనే ఉంటా..


హా..ఓఓఓ..ఏం దెబ్బతీశావు..

ఏం ఎత్తు వేశావు

ఏం మాయచేశావబ్బీ..ఈ..

నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే...

కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..

కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది  


అహా..ఏం బాగా అన్నావు ..

ఏం ముద్దుగున్నావు

ఏం చూపుతున్నావమ్మీ..అహా

నీ ఒంపులు సొంపులు చూస్తూ ఉంటే ...

ఒకలాగున్నది... మతిపోతున్నది..

అబ్భా..ఒకలాగున్నది... మతిపోతున్నది


పాటల ధనుస్సు 


17, ఏప్రిల్ 2023, సోమవారం

అంతా చూసాను ఎంతో చూసాను | Antha chusanu | Song Lyrics | Tiger (1979)

అంతా చూసాను ఎంతో చూసాను 



చిత్రం : టైగర్ (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


అహా..అహా..అంతా చూసాను 

ఎహే..ఎహే..ఎంతో చూసాను 


అహా..అహా..అంతా చూసాను..ఊఊఊ

ఎహే..ఎహే..ఎంతో చూసాను


చారెడు చారెడు కళ్ళల్లోన

బారెడు బారెడు కోరికలెన్నో


అహా..అహా..అంతా చూసాను 

ఎహే..ఎహే..ఎంతో చూసాను 



చరణం 1 :


అహా..ఓహో..నున్న నున్నని దానా

వన్నె నడకాలదాన

నున్న నున్నని దానా

వన్నె నడకాలదాన

నీ సొగసే చూడాలి... 

ఈ చుక్కల చీరలోన

నీ సొగసే చూడాలి... 

ఈ చుక్కల చీరలోన


ముద్దూ ముద్దుగ చీరకడతా..

అ ఆ హహ..హహ..

ముద్దూ ముద్దుగ చీరకడతా..

ముచ్చటగా కుచ్చెళ్ళు పెడతా 


అహా..అహా..అంతా చూసాను 

ఎహే..ఎహే..ఎంతో చూసాను 

మెత్తామెత్తని మాటలతోనే... 

మత్తెకించే ఎత్తులెన్నో


అహా..అహా..అంతా చూసాను 

ఎహే..ఎహే..ఎంతో చూసాను 


చరణం 2 :


అహా..విసురున్నా వేటగాడా 

అసలైన ఆటగాడా 

ఆ..అహా..విసురున్నా వేటగాడా 

అసలైన ఆటగాడా 

రోజు రోజు పెరుగుతుంది 

నీ జోరు సోకుమాడ 

రోజు రోజు పెరుగుతుంది 

నీ జోరు సోకుమాడ 


నువ్వనుకున్నది చెవిలో చెప్పు..మ్మ్..

నువ్వనుకున్నది చెవిలో చెప్పు... 

ఇవ్వకపోతే  నామీదొట్టు  


అహా..అహా..అంతా చూసాను 

ఎహే..ఎహే..ఎంతో చూసాను 


మెత్తా మెత్తని మాటలతోనే... 

మత్తెకించే గుత్తులెన్నో

అహా..అహా..అంతా చూసాను 

ఎహే..ఎహే..ఎంతో చూసాను 

ఊ..ఊ..ఊ..హా


పాటల ధనుస్సు  


16, ఏప్రిల్ 2023, ఆదివారం

ఏ తల్లి కన్నదిరో నీటుగాడా | Ye thalli kannadiro | Song Lyrics | Tiger (1979)

ఏ తల్లి కన్నదిరో నీటుగాడా



చిత్రం : టైగర్ (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


ఏ తల్లి కన్నదిరో నీటుగాడా

ఏ పిల్లకున్నదిరో నీతో జోడా

నీ నీడవుంటే..హా..మేడకడతా

నువు తోడు ఉంటే..హా..జోడుగుంటా 


ఏ తల్లి కన్నదిరో నీటుగాడా

ఏ పిల్లకున్నదిరో నీతో జోడా

నీ నీడవుంటే... మేడకడతా

నువు తోడు ఉంటే... జోడుగుంటా 


అహా..అహహా..ఒహోహో..

అహువా..అహువా

వహవహ అహవహవహా..ఆ 



చరణం 1 :


ఒంటిగుంటే ఒంటిగుంట...  

కొడుతుందయ్యో

అంటుకుంటె కొంపలంటుకుంటాయ్..

రయ్యో..హ్హా

ఒంటిగుంటే ఒంటిగుంట... 

కొడుతుందయ్యో

అంటుకుంటె కొంపలంటుకుంటాయ్..

రయ్యో 

నా యీడు చూశా... నీతోడు చూశా

నా యీడు చూశా..ఆ..

నీతోడు చూశా..అహా

మల్లెపూల మంచమేసి..

ఎన్నెలంతా పక్కేశా

ఏలా..ఏలా..ఏలకుంటే..

నీకూ నాకూ ఇంతేరోయ్..ఓలబ్బో


ఏ తల్లి కన్నదిరో నీటుగాడా

ఏ పిల్లకున్నదిరో నీతో జోడా

నీ నీడవుంటే... హా హా హా..మేడకడతా

నువు తోడు ఉంటే... జోడుగుంటా  


అహా..అహహా..ఒహోహో..

అహువా..అహువా

వహవహ అహవహవహా..ఆ


చరణం 2 :


నీ ఫోజు చూస్తే 

మోజు నాలో పెరుగుతున్నాది

నువ్వు సైగచేస్తే 

సన్నజాజి తెల్లబోయిందీ

నీ ఫోజు చూస్తే... 

మోజు నాలో పెరుగుతున్నాది

నువ్వు సైగచేస్తే... 

సన్నజాజి తెల్లబోయిందీ  


రాతిరంత చూసా... నా దారి చూశా

రాతిరంత చూసా..ఆ..

నా దారి చూశా..ఆహోయ్

అందమంతా పందిరేసి..

అందకుండ వచ్చేసా

ఏలా..ఏలా..ఏలకుంటే..

నీకూ నాకూ ఇంతేరోయ్


ఏ తల్లి కన్నదిరో నీటుగాడా

ఏ పిల్లకున్నదిరో నీతో జోడా

నీ నీడవుంటే... హా..మేడకడతా

నువు తోడు ఉంటే... జోడుగుంటా..ఆ 


అహా..అహహా..ఒహోహో..

అహువా..అహువా

వహవహ అహవహవహా..ఆ


పాటల ధనుస్సు  


9, మార్చి 2022, బుధవారం

ఒకటి రెండు మూడు | Okati Rendu Moodu | Song Lyrics | Tiger (1979)

ఒకటి..రెండు..మూడు



చిత్రం : టైగర్ (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


ఒకటి..రెండు..మూడు..నాలుగు..ఐదు..ఆరు..ఏడు

అబ్బో..అమ్మో..అయ్యయ్యో..

ఒకటా..రెండా..మూడా..ఓరి దేవుడో 

నా వల్ల కాదు కాదురో... ఓరి నాయనో

కళ్ళు తిరిగిపోతున్నాయ్... 

కాళ్ళు వణికిపోతున్నాయ్

తియ్యలేను గుంజీలు... 

తిప్పలు పెట్టకురో..ఓఓఓ 


ఒకటి..రెండు,మూడు... తీయ్ గుంజీలు

వల్లకాదు కాదంటే... చెల్లదమ్మడూ

కళ్ళు తిరిగిపోతున్నా... 

కాళ్ళువణికిపోతున్నా

తియ్యాలి గుంజీలు... 

తిమ్మిరి అణిగేదాకా


ఒకటా..రెండా..మూడా... 

ఓరి దేవుడో

హహహా..వల్లకాదు కాదంటే... 

చెల్లదమ్మడూ..




చరణం 1 :



మబ్బులేని మెరుపల్లే ఎవ్వడు రమ్మన్నాడు..

ఆహా ఆహా హా హా హా...ఆ

మల్లెపూల జల్లులో తడిపేసి పొమ్మన్నాడు..ఊ

ఆహా ఆహా హా హా హా...ఆ 


అందుకే వేస్తున్నా... అందమైన శిక్షా

అందుకే వేస్తున్నా... అందమైన శిక్షా

తీర్చుకొంటున్నా... తియ్య తియ్యగా కక్షా


ఏమిటి పరీక్షా?


ఒకటా..రెండా..మూడా... ఓరి దేవుడో

నీ వల్లకాదు కాదంటే..

చెల్లదమ్మడూ... అమ్మడూ  



చరణం 2 :



చలిగాలి వడదెబ్బ..

ఎవ్వడు తీయమన్నాడు..

ఊ..ఊ అహహా

సూదిమెరుపంటి చూపుల్తో..

చురకేసి పొమ్మన్నాడూ..

ఊ..అట్లగా..ఒహోహో

వయసొచ్చి చేసింది వలపన్న నేరం

వయసొచ్చి చేసింది వలపన్న నేరం

కౌగిట్లో ఖైది చేసేయ్... నను జీవితాంతం..

అయ్యో పాపం 


ఒకటి..రెండు,మూడు... తీయ్ గుంజీలు

వల్లకాదు కాదంటే... చెల్లదమ్మడూ


కళ్ళు తిరిగిపోతున్నాయ్... 

కాళ్ళు వణికిపోతున్నాయ్

తియ్యలేను గుంజీలు... 

తిప్పలు పెట్టకురో..ఓ.. 


ఒకటా..రెండా..మూడా..ఓరి దేవుడో

నీ..వల్లకాదు కాదంటే... 

చెల్లదమ్మడూ... అమ్మడూ


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు