RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
pingali songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
pingali songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జనవరి 2022, ఆదివారం

నా మనసు నీ మనసు ఒకటై | Naa Manasu Nee Manasu | Song Lyrics | CID (1965)

 నా మనసు నీ మనసు ఒకటై



చిత్రం :  సి.ఐ.డి (1965)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


పల్లవి : 


నా మనసు నీ మనసు 

ఒకటై మనమొకటిగా

ఎలా ఏకమౌదుమో.. 

ఎలా కలిసిపోదుమో..

ఎలా ఏకమౌదుమో.. 

ఎలా కలిసిపోదుమో..


నా తనువు నీ తనువు 

వేరు వేరు వేరయినా

పాలు నీరు కలియనటులనే.. 

కలిసిమెలసి పోదము

పాలు నీరు కలియనటులనే.. 

కలిసిమెలసి పోదము 


చరణం 1 : 


నీ హక్కులు నా హక్కులు.. 

వేరు వేరు వేరయినా..ఆ..ఆ..

నీ హక్కులు నా హక్కులు.. 

వేరు వేరు వేరయినా


కీచులాట లేకుండా 

మచ్చికతో ఉందమా

కీచులాట లేకుండా 

మచ్చికతో ఉందమా


నా మనసు నీ మనసు 

ఒకటై మనమొకటిగా

ఎలా ఏకమౌదుమో.. 

ఎలా కలిసిపోదుమో.. 


చరణం 2 :


నీ ప్రాణము నా ప్రాణము 

ఒకటి ఒకటి ఒకటైనా..ఆ..ఆ..

నీ ప్రాణము నా ప్రాణము 

ఒకటి ఒకటి ఒకటైనా.. 

నీవంటే.. నీవనచు.. 

ఊఁ..ఆపావే?


నీవంటే.. నీవనచు.. 

కీచులాడుకొందుమా..


నా తనువు నీ తనువు 

వేరు వేరు వేరయినా

పాలు నీరు కలియనటులనే 

కలిసి మెలసి పోదము..

ఆ..ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ...ఆ..

ఊ..ఊ..ఊ..ఊ..


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు