RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
mundarunna chinnadani andamemo song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mundarunna chinnadani andamemo song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జులై 2024, బుధవారం

ముందరున్న చిన్నదాని అందమేమో | Mundarunna Chinnadani Andamemo | Song Lyrics | Kalam Marindi (1972)

ముందరున్న చిన్నదాని అందమేమో



చిత్రం : కాలం మారింది (1972)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

సాహిత్యం : దాశరథి

గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


ముందరున్న చిన్నదాని అందమేమో

చందమామ సిగ్గు చెంది

సాగిపోయే... దాగిపోయే


ముందరున్న చిన్నదాని అందమేమో

చందమామ సిగ్గు చెంది

సాగిపోయే... దాగిపోయే


పొందుగోరు చిన్నవాని తొందరేమో

మూడుముళ్ళ మాట కూడ

మరచిపోయే... తోచదాయే


చరణం 1 :


పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో

ఎందుకోసమో

పైట కొంగు కులికింది ఎవరికోసమో

ఎవరికోసమో


నీలోని పొంగులు నావేనని 

నీలోని పొంగులు నావేనని

చెమరించు నీ మేను తెలిపెలే


ఆ...ఆ..ఓ..ఓ...


పొందుగొరు చిన్నవాని తొందరేమో

మూడు ముళ్ళ మాట కూడ

మరచిపోయే... తోచదాయే


చరణం 2 :


కొంటే చూపు రమ్మంది ఎందుకోసమో

ఎందుకోసమో

కన్నెమనసు కాదంది ఎందుకోసమో

ఎందుకోసమో


సరియైన సమయం రాలేదులే

సరియైన సమయం రాలేదులే

మనువైన తొలిరేయి మనదిలే


ఓ..ఓ..ఆ..ఆ...


ముందరున్న చిన్నదాని అందమేమో

చందమామ సిగ్గు చెంది

సాగిపోయే... దాగిపోయే


చరణం 3 :


ఎన్నాళ్ళు మనకీ దూరాలు

ఏనాడు తీరు ఈ విరహాలు

ఎన్నాళ్ళు మనకీ దూరాలు

ఏనాడు తీరు ఈ విరహాలు


కాదన్న వారు అవునన్ననాడు

కౌగిళ్ళ కరిగేది నిజములే


ముందరున్న చిన్నదాని అందమేమో...

చందమామ సిగ్గు చెంది

సాగిపోయే ...దాగిపోయే


పొందుగోరు చిన్నవాని తొందరేమో...

మూడుముళ్ళ మాటకూడ

మరచిపోయే... తోచదాయే


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు