RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
mallela vela song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mallela vela song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మే 2024, శనివారం

మల్లెల వేళ అల్లరి వేళ | Mallela Vela Allarivela | Song Lyrics | Joodagadu (1979)

మల్లెల వేళ అల్లరి వేళ



చిత్రం: జూదగాడు (1979)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: జి. ఆనంద్, సుశీల


పల్లవి:


మల్లెల వేళ అల్లరి వేళ

మల్లెల వేళ అల్లరి వేళ

మదిలో మన్మధ లీల

నీవు నేనైన వేళ

వుండిపోవాలి ఇలా ఇలా


మల్లెల వేళ అల్లరి వేళ

మదిలో మన్మధ లీల

నీవు నేనైన వేళ

వుండిపోవాలి ఇలా ఇలా


చరణం 1:


ఒక మధుర మురళి మ్రోగింది

యమునా తటిలో మురళీ రవళి

ఒక రాగమేదొ జుమ్మంది

ఒక రాధ మనసు జల్లంది

బృందావనిలో అందాలొలికే

ఆ రాధా మాధవ రాస క్రీడలే

రసడోలలూగించు వేళ


మల్లెల వేళ అల్లరి వేళ

మదిలో మన్మధ లీల


చరణం 2:


ఒక నింగి వలచి చేరింది

ఒక నేల ముద్దులాడింది

నింగీ నేల ఉరిసీ మెరిసీ

ఒక మబ్బు ఉబ్బి ఉరిమింది

అది పెళ్ళి మేళమయ్యింది

దివిలో మేళం భువిలో తాళం

ఆ మేళ తాళాల మేళవింపులో

జగమెల్ల దీవించు వేళ


మల్లెల వేళ అల్లరి వేళ

మదిలో మన్మధ లీల

నీవు నేనైన వేళ

వుండిపోవాలి ఇలా ఇలా


మల్లెల వేళ అల్లరి వేళ

మదిలో మన్మధ లీల


- పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు