RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
cheeralettukellada chinni krishnudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
cheeralettukellada chinni krishnudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఏప్రిల్ 2026, గురువారం

చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు | Cheeralettukellada Chinni Krishnudu | Song Lyrics | Chilipi Krishnudu (1978)

చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు


చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి:


చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు

చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు

చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు

చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు


చూడబోతే వాడెంతో మంచివాడు

వాడికన్న వీడు మరీ కొంటేవాడు..


చరణం 1:


మల్లెపూల పడవలో..ఆ..ఆ

మంచుతెరల మాటులో..ఆ..ఆ

ఏటి నీటి పోటులా.. 

మాట వినని వయసులో

మల్లెపూల పడవలో 

మంచుతెరల మాటులో..

ఏటి నీటి పోటులా 

మాట వినని వయసులో


నీవే నా మురళివని 

పెదవి చేర్చినాడు..ఊ..

నీవే నా మురళివని 

పెదవి చేర్చినాడు..

ఆ పెదవిమీద తనపేరు 

రాసి చూసుకొన్నాడు


చీరలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు

చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు


చరణం 2:


మబ్బుచీర కట్టిందీ ఆకాశం

మెరపు చూపు విరిసిందీ నీ కోసం

మబ్బుచీర కట్టిందీ ఆకాశం

మెరపు చూపు విరిసిందీ నీ కోసం


తళుకులే చినుకులుగా 

చిలుకుతుంది వర్షం

తళుకులే చినుకులుగా 

చిలుకుతుంది వర్షం

తడిసిపోయి యవ్వనం.. 

వెతుకుతుంది వెచ్చదనం


చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు

చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు


చరణం 3:


పొన్నచెట్టు నీడలో..ఓ..ఓ..

ఎన్ని ఎన్ని ఊసులో..ఆ..ఆ..ఆ..

వెన్నముద్ద బుగ్గలో 

ఎన్ని ఎన్ని ముద్దులో

పొన్నచెట్టు నీడలో 

ఎన్ని ఎన్ని ఊసులో..

వెన్నముద్దబుగ్గలో 

ఎన్ని ఎన్ని ముద్దులో


నీవే నా రాధవు 

ఆ నాటి రాసక్రీడలో

నీవే నా రాధవు 

ఆ నాటి రాసక్రీడలో

నీవే నా రాగము 

ఈనాటి ప్రణయగీతిలో


చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు

చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు

చూడబోతే వాడేంతో మంచివాడు

వాడికన్న వీడుమరీ కొంటేవాడు..


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు