RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
bangaru babu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bangaru babu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, అక్టోబర్ 2025, ఆదివారం

ఏడడుగుల సంబంధం | Yedadugula Sambandham | Song Lyrics | Bangaru Babu (1973)

ఏడడుగుల సంబంధం



చిత్రం : బంగారు బాబు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


చరణం 1:


ఎన్నో ఊసులు ఎదలో 

మెదిలే తొలిరోజు

అవి మాటలకందక 

మారాం చేసేదీరోజు

ఎన్నో ఊసులు ఎదలో 

మెదిలే తొలిరోజు

అవి మాటలకందక 

మారాం చేసేదీరోజు


ఈ రోజు కోసమే కన్నులు 

కాయలు కాచినవి

ఈ రోజు కోసమే కన్నులు 

కాయలు కాచినవి

ఈ రోజు కోసమే 

కన్నె సొగసులు దాచినది

ఈ రోజు కోసమే 

కన్నె సొగసులు దాచినది


ఇది... ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


చరణం 2:


మోజులు పెరగాలి వాటిని 

చేతలు చెయ్యాలి

సుఖాల లోతులు చూడాలి 

ఒడిలో సోలిపోవాలి

మోజులు పెరగాలి వాటిని 

చేతలు చెయ్యాలి

సుఖాల లోతులు చూడాలి 

ఒడిలో సోలిపోవాలి


అలుపు సొలుపు ఎరగని 

పరువం అంతు చూడాలి

ఎండ వాన రెండూ చూస్తూ 

పండిపోవాలి

అలుపు సొలుపు ఎరగని 

పరువం అంతు చూడాలి

ఎండ వాన రెండూ చూస్తూ 

పండిపోవాలి


ఇది... ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


చరణం 3:


ఆలుమగలుగ ఆనందం 

చవి చూశాము

అనురాగం పండి 

అమ్మానాన్నలమైనాము

ఆలుమగలుగ ఆనందం 

చవి చూశాము

అనురాగం పండి 

అమ్మానాన్నలమైనాము


ఈ రోజు కోసమే ఆడది 

తపస్సు చేసేది

ఈ రోజు కోసమే ఆడది 

తపస్సు చేసేది

ఈ బోసినవ్వుకే మగాడు 

జోలలు పాడేది

ఈ బోసినవ్వుకే మగాడు 

జోలలు పాడేది


ఇది... ఏడడుగుల సంబంధం 

ఏనాడో వేసిన బంధం

నిన్ను నన్ను పెనవేసిన బంధం

ఎన్నో జన్మల సంబంధం

ఎన్నెన్నో... జన్మల అనుబంధం


- పాటల ధనుస్సు 


ఏమనుకున్నావూ? Emanukunnavu | Song Lyrics | Bangaru Babu (1973)

ఏమనుకున్నావూ?  నన్నేమనుకున్నావూ?


చిత్రం : బంగారు బాబు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి :


ఏమనుకున్నావూ? .. 

నన్నేమనుకున్నావూ?

పిచ్చివాడి ననుకున్నావా..  

ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా?

ఏమనుకున్నావూ?..  

నన్నేమనుకున్నావూ?


చరణం 1 :


వెళ్ళినట్టె వెళ్ళావూ.. 

కళ్ళలోనె ఉన్నావూ

మరచిపోను వీలులేక.. 

మనసులోనె మెదిలావూ

వెళ్ళినట్టె వెళ్ళావూ.. 

కళ్ళలోనె ఉన్నావూ

మరచిపోను వీలులేక.. 

మనసులోనె మెదిలావూ


పిచ్చివాడి ననుకున్నావా?..  

బిచ్చగడి ననుకున్నావా?  

ఏమనుకున్నావూ? .. 

నన్నేమనుకున్నావూ?

పిచ్చివాడి ననుకున్నావా? .. 

ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా?


చరణం 2 :


నిన్నునేను రమ్మన్నానా?..  

మనసు నాకు ఇమ్మన్నానా?

వచ్చి వలపు రగిలించావూ..  

చిచ్చునాకు మిగిలించావూ

నిన్నునేను రమ్మన్నానా?..  

మనసు నాకు ఇమ్మన్నానా?

వచ్చి వలపు రగిలించావూ..  

చిచ్చునాకు మిగిలించావూ

పిచ్చివాడి ననుకున్నావా? 

బిచ్చగడి ననుకున్నావా?     

    

ఏమనుకున్నావూ? ..  

నన్నేమనుకున్నావూ?

పిచ్చివాడి ననుకున్నావా?.. 

ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా?


చరణం 3 :


ప్రేమంటేనే బాధన్నారూ.. 

ఆ బాధుంటేనే బ్రతుకన్నారూ

అది ప్రేమే కాదంటాను.. 

ఆ బ్రతుకే వద్దంటాను

అది ప్రేమే కాదంటాను.. 

ఆ బ్రతుకే వద్దంటాను  

ఏమనుకున్నావూ? .. 

నన్నేమనుకున్నావూ?


- పాటల ధనుస్సు


24, అక్టోబర్ 2025, శుక్రవారం

శ్రీరామచంద్రా నారాయణా | Srirama Chandra Narayana | Song Lyrics | Bangaru Babu (1973)

శ్రీరామచంద్రా నారాయణా



చిత్రం : బంగారు బాబు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


శ్రీరామచంద్రా నారాయణా.. 

ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. 

నాయనా

శ్రీరామచంద్రా నారాయణా.. 

ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. 

నాయనా


శ్రీరామచంద్రా నారాయణా.. 

ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. 

నాయనా

శ్రీరామచంద్రా నారాయణా.. 

ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. 

నాయనా


చరణం 1 :


పగలంతా ఇద్దరమూ 

ఆలుమగలమూ.. 

పడుకునే వేళకూ 

పక్కలే దూరమూ

పగలంతా ఇద్దరమూ 

ఆలుమగలమూ.. 

పడుకునే వేళకూ 

పక్కలే దూరమూ


ఊరివారికందమూ 

వుత్తుత్తి కాపురము..  

ఊరివారికందమూ 

వుత్తుత్తి కాపురము

నోరూరుతున్న మనకేమో 

ఓపలేని..  తాపము  . .  

అయ్యో..  

శ్రీరామచంద్రా నారాయణా.. 

ఎన్ని కష్టాలు వచ్చాయిరా 

నాయనా


చరణం 2 :


అన్ని ఉన్న అందగత్తె 

అందుబాటులో ఉన్నా.. 

అన్న మాట కోసమే 

ఆశలన్ని అణచుకున్నా

అన్ని ఉన్న అందగత్తె 

అందుబాటులో ఉన్నా.. 

అన్న మాట కోసమే 

ఆశలన్ని అణచుకున్నా


ఉన్నవన్ని ఉన్నట్టే 

ఊడ్చివ్వాలనుకున్నా . . 

ఉన్నవన్ని ఉన్నట్టే 

ఊడ్చివ్వాలనుకున్నా

కన్నెకున్న హద్దులకు కట్టుబడి..  

ఊరుకున్నా  


శ్రీరామచంద్రా నారాయణా..  

ఎన్ని కష్టాలు వచ్చాయిరా 

నాయనా

అయ్యయ్యో..  

శ్రీరామచంద్రా నారాయణా.. 

ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. 

నాయనా


చరణం 3 :


కళ్ళల్లోకి చూడకు.. 

కాళ్లు కలిపి నడవకు

మూడుముళ్ళు పడేవరకు 

మోమాట పెట్టకు

కళ్ళల్లోకి చూడకు.. 

కాళ్లు కలిపి నడవకు

మూడుముళ్ళు పడేవరకు 

మోమాట పెట్టకు


ఆ మంచిరోజు వచ్చును.. 

హద్దులెగిరిపోవును

మంచిరోజువచ్చును 

హద్దులెగిరిపోవును

కాచుకున్న వయసు కచ్చి.. 

అప్పుడే తీరును . .  

శ్రీరామచంద్రా నారాయణా.. 

ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. 

నాయనా

శ్రీరామచంద్రా నారాయణా.. 

ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. 

నాయనా


- పాటల ధనుస్సు


తగిలిందయ్యో తగిలింది పైరగాలి | Tagilindayyo Tagilindi | Song Lyrics | Bangaru Babu (1973)

తగిలిందయ్యో తగిలింది పైరగాలి



చిత్రం : బంగారు బాబు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  పి సుశీల


పల్లవి :


తగిలిందయ్యో తగిలింది పైరగాలి.. 

ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు

తగిలింది.. ఎగిరింది..  

య్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో

మనసే ఉరకలు వేసింది..  

నా మనసే ఉరకలు వేసింది . . 


తగిలిందయ్యో తగిలింది పైరగాలి..  

ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు

తగిలింది.. ఎగిరింది..  

య్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో

మనసే ఉరకలు వేసింది . . 

నా మనసే ఉరకలు వేసింది..  


చరణం 1 :


కొమ్మ కొమ్మనా జంటలు చూస్తే.. 

పువ్వు  పువ్వునా తుమ్మెదలుంటే

కొమ్మ కొమ్మనా జంటలు చూస్తే..  

పువ్వు  పువ్వునా తుమ్మెదలుంటే 


గువ్వల గుసగుస వింటుంటే.. 

గుండెలు రెపరెపమంటుంటే

అమ్మమ్మమ్మమ్మమ్మో.. 

వయసే బుసబుస పొంగిందీ.. 

నా మనసే ఉరకలు వేసింది..      


తగిలిందయ్యో తగిలింది పైరగాలి.. 

ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు

తగిలింది.. ఎగిరింది..  

య్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో

మనసే ఉరకలు వేసింది . . 

నా మనసే ఉరకలు వేసింది . .


చరణం 2 :


మబ్బును మబ్బు ముద్దులాడితే.. 

సిగ్గున నింగి ఎర్రబారితే

మబ్బును మబ్బు ముద్దులాడితే.. 

సిగ్గున నింగి ఎర్రబారితే

ఎన్నడు చూడని అందాలూ.. 

చూశానమ్మా ఈనాడు


అమ్మమ్మమ్మమ్మమ్మో..  

వయసు మనసూ ఒకటై

నా ఉసురు పోసుకున్నాయి.. 

నా ఉసురు పోసుకున్నాయి . .  


తగిలిందయ్యో తగిలింది పైరగాలి.. 

ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు

తగిలింది . . ఎగిరింది  

య్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో

మనసే ఉరకలు వేసింది . . 

నా మనసే ఉరకలు వేసింది . .


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు