RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
Muralikrishna movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Muralikrishna movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఆగస్టు 2023, బుధవారం

ఊఁ అను ఊహూ అను | Oo anu Ohu anu | Song Lyrics | Muralikrishna (1964)

ఊఁ అను.. ఊహూ అను



చిత్రం :  మురళీకృష్ణ (1964)

సంగీతం :  మాస్టర్ వేణు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :


ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను

నా వలపంతా నీదని.. నీదేనని.. ఊఁ అనూ


ఊఁ అను.. ఊహూ అను..  ఔనను ఔనౌనను

నా వెలుగంతా నీవని.. నీవేనని.. ఊఁ అనూ


చరణం 1:


కలకల నవ్వే కలువకన్నులు..

కలకల నవ్వే కలువకన్నులు..

వలపులు తెలుపుటకే కాదా

పక్కన నిలిచిన చక్కని రూపము

చక్కిలిగింతలకే కాదా

చక్కిలిగింతలకే కాదా


ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను


చరణం 2:


పచ్చని ఆశల పందిరి నీడల 

వెచ్చగ కాపురముందామా

అహహా అహహా అహహా ఆ... ఆ... ఆ...

పచ్చని ఆశలపందిరి నీడల 

వెచ్చగ కాపురముందామా

కౌగిలి వీడక కాలము చూడక 

కమ్మని కలలే కందామా..

ఆఁ...

ఆఁ... కమ్మని కలలే కందామా


ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను


చరణం 3 :


మణిదీపాలై మదిలో వెలిగే 

అనురాగాలు మనవేలే

ఓ... ఓ... ఓ... ఓ...

మణిదీపాలై మదిలో వెలిగే 

అనురాగాలు మనవేలే

చిరునవ్వులతో చిగురులు తొడిగే 

జీవితమంటే మనదేలే

ఊఁ...

ఊఁ... జీవితమంటే మనదేలే


ఊఁ అను.. ఊహూ అను

ఔనను.. ఔనౌనను

నా వలపంతా నీదని..

నా వెలుగంతా నీవని..

ఊఁ అను.. ఊహూ అను

ఔనను.. ఔనౌనను

ఊఁ అనూ... హహహహ


పాటల ధనుస్సు  


27, ఆగస్టు 2023, ఆదివారం

నీ సుఖమే నే కోరుతున్నా | Nee Sukhame ne koruthunna | Song Lyrics | Muralikrishna (1964)

నీ సుఖమే నే కోరుతున్నా



చిత్రం :  మురళీకృష్ణ (1964)

సంగీతం :  మాస్టర్ వేణు

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


సాకి :

ఎక్కడ వున్నా ఏమైనా 

మనమెవరికి వారై వేరైనా


పల్లవి :


నీ సుఖమే నే కోరుతున్నా.. 

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుతున్నా


చరణం 1 :


అనుకున్నామని జరగవు అన్నీ 

అనుకోలేదని ఆగవు కొన్నీ

జరిగేవన్నీ మంచికని 

అనుకోవడమే మనిషి పని

నీ సుఖమే నే కోరుతున్నా ..

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుతున్నా..


చరణం 2 :


పసిపాపవలె ఒడి జేర్చినాను 

కనుపాప వలె కాపాడినాను

గుండెను గుడిగా చేసాను.....

గుండెను గుడిగా చేసాను.. 

నువ్వుండలేనని వెళ్ళావు


నీ సుఖమే నే కోరుతున్నా ..

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుతున్నా..


చరణం 2 :


వలచుట తెలిసిన నా మనసునకు 

మరచుట మాత్రము తెలియనిదా

మనసిచ్చినదే నిజమైతే... 

మన్నించుటయే రుజువు కదా


నీ సుఖమే నే కోరుతున్నా ..

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుతున్నా..


చరణం 3 :


నీ కలలే కమ్మగ పండనీ... 

నా తలపే నీలో వాడనీ

కలకాలం చల్లగ వుండాలనీ.. 

దీవిస్తున్నా నా దేవిననీ.. 

దీవిస్తున్నా నా దేవిని


ఎక్కడ వున్నా ఏమైనా 

మనమెవరికి వారై వేరైనా

నీ సుఖమే నే కోరుతున్నా ..

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుతున్నా..


పాటల ధనుస్సు 


26, ఆగస్టు 2023, శనివారం

కనులు కనులు కలిసెను | Kanulu Kanulu Kalisenu | Song Lyrics | Muralikrishna (1964)

కనులు కనులు కలిసెను



చిత్రం :  మురళీకృష్ణ (1964)

సంగీతం :  మాస్టర్ వేణు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


కనులు కనులు కలిసెను...  

కన్నె వయసు పిలిచెను

కనులు కనులు కలిసెను... 

కన్నె వయసు పిలిచెను

విసురులన్ని పైపైనే... 

అసలు మనసు తెలిసెను... 

అసలు మనసు తెలిసెను


చరణం 1 :


ముఖము పైన ముసురుకున్న 

ముంగురులే అందము

ముఖము పైన ముసురుకున్న 

ముంగురులే అందము

సిగ్గు చేత ఎర్రబడిన 

బుగ్గలదీ అందము

కోరిన చిన్న దాని కోర చూపే అందము 

కోర చూపే అందము


కనులు కనులు... మనసు తెలిసెను

విసురులన్ని పైపైనే... 

అసలు మనసు తెలిసెను... 

అసలు మనసు తెలిసెను


చరణం 2 :


దొండపండు వంటి పెదవి 

పిండుకొనుట ఎందుకు

దొండపండు వంటి పెదవి

పిండుకొనుట ఎందుకు

ముచ్చటైన పైటకొంగు 

ముడులు వేయుటెందుకు

పోవాలనుకొన్నా పోలేవు ముందుకు.. 

పోలేవు ముందుకు


కనులు కనులు... మనసు తెలిసెను

విసురులన్ని పైపైనే... 

అసలు మనసు తెలిసెను... 

అసలు మనసు తెలిసెను


చరణం 3 :


నడచినంత పిడికెడంత 

నడుము వణకిపోవును

నడచినంత పిడికెడంత 

నడుము వణకిపోవును

కసురుతున్న మనసులోనే 

మిసిమి వలపులూరును

కలిగిన కోపమంత కౌగిలిలో తీరును 

కౌగిలిలో తీరును


కనులు కనులు... మనసు తెలిసెను

విసురులన్ని పైపైనే... 

అసలు మనసు తెలిసెను... 

అసలు మనసు తెలిసెను...


పాటల ధనుస్సు  


ఏమని ఏమని అనుకుంటున్నది | Emani Emani anukuntunnadi | Song Lyrics | Muralikrishna (1964)

ఏమని ఏమని అనుకుంటున్నది



చిత్రం :  మురళీకృష్ణ (1964)

సంగీతం :  మాస్టర్ వేణు

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


ఏమని ఏమని అనుకుంటున్నది... 

నీ మనసేమని కలగంటున్నది

ఏమని ఏమని అనుకుంటున్నది... 

నీ మనసేమని కలగంటున్నది

విరిసిన పువ్వులు ముసిముసి నవ్వులు...  

కసిగా ఎందుకు కవ్విస్తున్నవి


ఏమని ఏమని అనుకుంటున్నది... 

నీ మనసేమని కలగంటున్నది



చరణం 1 :


ఏదో ఏదో వినపడుతున్నది... 

ఎదలో ఏదో కదులుతున్నది

ఏదో ఏదో వినపడుతున్నది... 

ఎదలో ఏదో కదులుతున్నది

తీయని తలపులు తలలెత్తి... 

తెలియని హాయిని వెదకుతున్నది


ఏమని ఏమని అనుకుంటున్నది... 

నీ మనసేమని కలగంటున్నది



చరణం 2 :


మెరమెరలాడే వయసున్నది... 

అది బిరబిర చరచర పరుగెడుతున్నది

మెరమెరలాడే వయసున్నది...  

బిరబిర చరచర పరుగెడుతున్నది

మిసమిసలాడే సొగసున్నది...  

అది గుసగుసలెన్నో చెబుతూ వున్నది


ఏమని ఏమని అనుకుంటున్నది... 

నీ మనసేమని కలగంటున్నది


చరణం 3 :


ఆడమన్నది పాడమన్నది.... ఓ...ఓ...ఓ...

ఆనందానికి ఎరవేయమన్నది

ఊరించే నను ఉడికించి....  

ఒంటరితనము ఓపనన్నది

ఒంటరి తనము ఓపనన్నది



ఏమని ఏమని అనుకుంటున్నది... 

నీ మనసేమని కలగంటున్నది

ఏమని ఏమని అనుకుంటున్నది... 

నీ మనసేమని కలగంటున్నది


పాటల ధనుస్సు 


22, ఆగస్టు 2023, మంగళవారం

మ్రోగునా ఈ వీణ | Mroguna ee veena | Song Lyrics | Muralikrishna (1964)

మ్రోగునా ఈ వీణ



చిత్రం :  మురళీకృష్ణ (1964)

సంగీతం :  మాస్టర్ వేణు

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  జానకి  



పల్లవి :


 మ్రోగునా....  ఈ వీణ...

మ్రోగునా ఈ వీణ... మ్రోగునా ఈ వీణ

మూగవోయిన రాగహీనా...  

అనురాగహీనా


మ్రోగునా ఈ వీణ... 

మూగవోయిన రాగహీనా అనురాగహీనా

మ్రోగునా ఈ వీణ... 

మూగవోయిన రాగహీనా అనురాగహీనా

మ్రోగునా ఈ వీణ



చరణం 1 :



పాటలెన్నో నేర్చినది... 

ప్రభువు రాకకై వేచినది

పాటలెన్నో నేర్చినది... 

ప్రభువు రాకకై వేచినది


వచ్చిన ప్రభువు... విని మెచ్చకనే...

వెడలిపోయేను... బ్రతుకే... 

వెలితి చేసెను..

బ్రతుకే... వెలితి చేసెను..


మ్రోగునా మధుర వీణ



చరణం 2 :



ఆదిలోనే అపశ్రుతి పలికెను...  

నాదమంతా ఖేదమాయెను

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

ఆదిలోనే అపశ్రుతి పలికెను...  

నాదమంతా ఖేదమాయెను


స్వరములు ఏడు సముద్రాలై...

స్వరములు ఏడు సముద్రాలై

ముంచి వేసెను... 

తంత్రులు త్రెంచి వేసెను

తంత్రులు త్రెంచి వేసెను


మ్రోగునా మధుర వీణ



చరణం 3 :



దేవుడులేని కోవెలలా... 

జీవితమంతా శిథిలము కాగా

దేవుడులేని కోవెలలా... 

జీవితమంతా శిథిలము కాగా


ప్రభువు నడిచే అడుగుజాడలె... 

వెతుకుచుంటిని శూన్యంలో

ప్రభువు నడిచే అడుగుజాడలె... 

వెతుకుచుంటిని శూన్యంలో

వెతుకుచుంటిని శూన్యంలో... 

శూన్యంలో... 



మ్రోగునా మధుర వీణ... 

మూగవోయిన రాగహీనా... 

అనురాగహీనా

మ్రోగునా మధుర వీణ...


పాటల ధనుస్సు  

17, ఆగస్టు 2023, గురువారం

వస్తాడమ్మా నీ దైవమూ | Vastadamma Nee Daivamu | Song Lyrics | Muralikrishna (1964)

వస్తాడమ్మా నీ దైవమూ



చిత్రం :  మురళీకృష్ణ (1964)

సంగీతం :  మాస్టర్ వేణు

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


వస్తాడమ్మా నీ దైవమూ.. 

వస్తుందమ్మా వసంతమూ

వస్తాడమ్మా నీ దైవమూ.. 

వస్తుందమ్మా వసంతమూ

కలలే నిజమై వలపే వరమై

కళ కళ లాడును జీవితము

వస్తాడమ్మా నీ దైవమూ 

వస్తుందమ్మా వసంతమూ


చరణం 1 :


పేరే కాదు ప్రేమకు కూడా 

శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు

పేరే కాదు ప్రేమకు కూడా 

శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు

తన ముద్దుల మురళిగ నిను మార్చి

తన ముద్దుల మురళిగ నిను మార్చి

మోహనరాగం ఆలపించును

వస్తాడమ్మా నీ దైవమూ 

వస్తుందమ్మా వసంతమూ


చరణం 2 :


పసిపాపవలే నిను ఒడి చేర్చి 

కనుపాపవలే కాపాడును

పసిపాపవలే నిను ఒడి చేర్చి 

కనుపాపవలే కాపాడును

నీ మనసే మందిరముగ చేసీ.. ఈ ...

నీ మనసే మందిరముగ చేసి 

దైవం తానై వరములిచ్చును

వస్తాడమ్మా నీ దైవమూ 

వస్తుందమ్మా వసంతమూ


చరణం 3 :


ఎక్కడివాడో ఇక్కడి వాడై 

దక్కినాడు నీ తపసు ఫలించి

ఎక్కడివాడో ఇక్కడి వాడై 

దక్కినాడు నీ తపసు ఫలించి

నాడొక చెట్టును మోడు చేసినా ఆ 

వాడే మోడుకు చిగురు పూర్చును

వస్తాడమ్మా నీ దైవమూ 

వస్తుందమ్మా వసంతమూ


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు