RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, జనవరి 2026, శనివారం

శరణం నీ దివ్య చరణం | Sharanam Nee Divya Charanam | Song Lyrics | Mattilo Manikyam (1971)

శరణం నీ దివ్య చరణం


చిత్రం : మట్టిలో మాణిక్యం (1971)

సంగీతం : సత్యం

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : భానుమతి  


పల్లవి :


శరణం నీ దివ్య చరణం..  

నీ నామమెంతొ మధురం

శరణం నీ దివ్య చరణం.. 

నీ నామమెంతొ మధురం.. 

శ్రీ శేషశైలవాసా

శరణం నీ దివ్య చరణం.. 

నీ నామమెంతొ మధురం.. 

శ్రీ శేషశైలవాసా

శరణం నీ దివ్య చరణం..  

నీ చరణం


చరణం 1 :


భక్తుల బ్రోచే స్వామివి నీవే..  

పేదల పాలిటి పెన్నిధి నీవే

భక్తుల బ్రోచే స్వామివి నీవే..  

పేదల పాలిటి పెన్నిధి నీవే


సకల జీవులను చల్లగ చూచే.. 

సకల జీవులను చల్లగ చూచే

కరుణామయుడవు నీవే..  

శరణం నీ దివ్య చరణం.. 

నీ చరణం


చరణం 2 :  


త్రేతా యుగమున శ్రీరాముడవై.. 

ద్వాపరమందున గోపాలుడవై

త్రేతా యుగమున శ్రీరాముడవై.. 

ద్వాపరమందున గోపాలుడవై


ఈ యుగమందున వెంకటపతివై..

ఆ ఆ ఆ ఆ..  

ఈ యుగమందున వెంకటపతివై

భువిపై వెలసితివీవే.. 

శరణం నీ దివ్య చరణం.. 

నీ చరణం


చరణం 3 :


నీ ఆలయమే శాంతికి నిలయం.. 

నిను సేవించే బ్రతుకే ధన్యం

నీ ఆలయమే శాంతికి నిలయం.. 

నిను సేవించే బ్రతుకే ధన్యం


తిరుమల వాసా శ్రీ వేంకటేశా.. 

తిరుమల వాసా శ్రీ వేంకటేశా.. 

మా ఇలవేలుపు నీవే

శరణం నీ దివ్య చరణం..  

నీ నామమెంతొ మధురం..  

శ్రీ శేషశైలవాసా

శరణం నీ దివ్య చరణం.. 

నీ చరణం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు