RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, జనవరి 2026, గురువారం

ఘనాఘన సుందరా | Ghana Ghana Sundara | Song Lyrics | Bhakta Tukaram (1973)

ఘనాఘన సుందరా


చిత్రం :  భక్త తుకారాం (1973)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


హరి ఓం... హరి ఓం... హరి ఓం... 

ఆ... ఆ... ఆ...

ఘనాఘన సుందరా 

కరుణా రసమందిరా

ఘనాఘన సుందరా 

కరుణా రసమందిరా

అది పిలుపో మేలుకొలుపో 

నీ పిలుపో మేలుకొలుపో

అది మధుర మధుర 

మధురమౌ ఓంకారమో

పాండురంగ... పాండురంగ...


ఘనాఘన సుందరా 

కరుణా రసమందిరా


చరణం 1:


ప్రాభాత మంగళపూజావేళ

నీ పద సన్నిధి నిలబడి... 

నీ పదపీఠిక తలనిడి

ప్రాభాత మంగళపూజావేళ

నీ పద సన్నిధి నిలబడి... 

నీ పదపీఠిక తలనిడి


నిఖిల జగతి నివాళులిడదా... 

నిఖిల జగతి నివాళులిడదా

వేడదా... కొనియాడదా... 

పాండురంగ... పాండురంగ...


ఘనాఘన సుందరా 

కరుణా రసమందిరా


చరణం 2:


గిరులూ ఝరులూ 

విరులూ తరులూ...

నిరతము నీ పాద ధ్యానమే... 

నిరతము నీ నామ గానమే

గిరులూ ఝరులూ 

విరులూ తరులూ

నిరతము నీ పాద ధ్యానమే... 

నిరతము నీ నామ గానమే


సకల చరాచర లోకేశ్వరేశ్వరా... 

సకల చరాచర లోకేశ్వరేశ్వరా

శ్రీకరా... భవహరా...

పాండురంగ... పాండురంగ...


ఘనాఘన సుందరా 

కరుణా రసమందిరా

ఘనాఘన సుందరా 

కరుణా రసమందిరా

పాండురంగ... పాండురంగ... 

పాండురంగ... పాండురంగ...

పాండురంగ... పాండురంగ... 

పాండురంగ... పాండురంగ...

పాండురంగ... పాండురంగ... 

పాండురంగ... పాండురంగ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు