RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

31, జనవరి 2026, శనివారం

మల్లెపూలు గొల్లుమన్నవి | Mallepoolu Ghollumannavi | Song Lyrics | Anubandham (1984)

మల్లెపూలు గొల్లుమన్నవి 


చిత్రం : అనుబంధం (1984) 

సంగీతం : చక్రవర్తి 

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం : జానకి, బాలు 


పల్లవి : 


మల్లెపూలు గొల్లుమన్నవి 

పక్కలోనా 

వెన్నెలొచ్చి గుచ్చుకున్నది 

గుండెలోనా 

వేడుంది ఒంటిలో... 

జోరుంది వయసులో 

బోలెడంత కోరికుంది 

తీర్చుకోనా 


మల్లెపూలు గొల్లుమన్నవి 

పక్కలోనా 

చల్లగాలి గిల్లుతున్నది 

సంబరానా 

ఎర్రని పెదవిలో... 

బిర్రయిన వయసులో 

బోలెడంత కోరికుంది 

తీర్చుకోనా 


చరణం 1 : 


నీ చిలిపినవ్వులో... 

ఆ నువ్వు వెలుగులో 

నా సొగసు ఆరబోసి 

మెరిసిపోనా 

నీ ఒంటి నునుపులో... 

నీ పెదవి ఎరుపులో 

నా వయసు పొంగు నేను 

కలుపుకోనా 


గంగలాగా ఉరికి రానా... 

కడలిలాగా కలుపుకోనా 

నా గుడిలో ఉయ్యాల

లూగించనా 

నా ఎదకు నిను జేర్చి 

జోకొట్టనా 

నీతోటి బ్రతుకంతా... 

ఒక వింత గిలిగింత 

అనిపించి మెప్పించి 

ఒప్పించుకోనా 


మల్లెపూలు గొల్లుమన్నవి 

పక్కలోనా 

వెన్నెలొచ్చి గుచ్చుకున్నది 

గుండెలోనా 

ఎర్రని పెదవిలో... 

బిర్రయిన వయసులో 

బోలెడంత కోరికుంది 

తీర్చుకోనా 


చరణం 2 : 


నీ ముద్దు ముద్దులు... 

మురిపాల సద్దులు 

ముప్పొద్దు మునిగి తేలి 

మురిసిపోనా 

నీ మెత్త మెత్తని సరికొత్త 

మత్తులో నే చిత్త చిత్తరంగా 

హత్తుకోనా హోయ్... 

గుండెలోనా 

నిండిపోనా నిండిపోయి... 

ఉండిపోనా 

నీ ప్రేమ నూరేళ్లు 

పండించనా 

నీ ఇల్లు వెయ్యేళ్లు 

వెలిగించనా 

బంధాలు ముడివేసి... 

అందాల గుడిచేసి 

అనురాగ అర్చనలే 

చేయించుకోనా 


మల్లెపూలు గొల్లుమన్నవి 

పక్కలోనా 

చల్లగాలి గిల్లుతున్నది 

సంబరానా 

ఎర్రని పెదవిలో... 

బిర్రయిన వయసులో 

బోలెడంత కోరికుంది 

తీర్చుకోనా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు