RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, జనవరి 2026, ఆదివారం

అంకితం నీకే అంకితం | Ankitam Neeke Ankitam | Song Lyrics | Swapna (1980)

అంకితం.. నీకే అంకితం



చిత్రం :  స్వప్న (1980)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  ఎస్ పి బాలు 


పల్లవి :


అంకితం.. నీకే అంకితం

అంకితం.. నీకే అంకితం

నూరేళ్ళ ఈ జీవితం

అంకితం.. నీకే అంకితం

ఓ ప్రియా...  ఆ... ఆ... 

ఓ ప్రియా... ఓ ప్రియా..


చరణం 1 :


కాళిదాసు కలమందు చిందు 

అపురూప దివ్య కవిత

త్యాగరాయ కృతులందు వెలయు 

గీతార్ధసార నవత

నవ వసంత శోభనా మయూఖ..

లలిత లలిత రాగ చంద్రలేఖ..


స్వరము స్వరము కలయిక లో 

ఒక రాగం పుడుతుంది

మనసు మనసు కలయిక లో 

అనురాగం పుడుతుందీ...

స్వరము స్వరము కలయిక లో 

ఒక రాగం పుడుతుంది

మనసు మనసు కలయిక లో 

అనురాగం పుడుతుంది


ఆ అనురాగం ఒక ఆలయమైతే.. ఏ.. ఏ... 

ఆ ఆలయ దేవత నీవైతే..ఏ ఏ...

ఆ ఆలయ దేవత నీవైతే..

గానం గాత్రం గీతం భావం.. 

సర్వం అంకితం


అంకితం.. నీకే అంకితం


చరణం 2 :


లోక వినుత జయదేవ శ్లోక 

శృంగార రాగ ద్వీప

భరత శాస్త రమణీయ నాద 

నవ హావ భావ రూప

స్వర విలాస హాస చతుర నయన..

సుమ వికాస భాస సుందర వదన..


నింగి నేల కలయికతో 

ఒక ప్రళయం అవుతుంది

ప్రేమ ప్రేమ కలయికతో 

ఒక ప్రణయం పుడుతుందీ...

నింగి నేల కలయికతో 

ఒక ప్రళయం అవుతుంది

ప్రేమ ప్రేమ కలయికతో 

ఒక ప్రణయం పుడుతుంది


ఆ ప్రణయం ఒక గోపురమైతే.. ఏ ఏ .. 

ఆ గోపుర కలశం నీవైతే.. ఏ ఏ ..

ఆ గోపుర కలశం నీవైతే..

పుష్పం.. పత్రం.. ధూపం.. దీపం.. 

సర్వం అంకితం


అంకితం.. నీకే అంకితం

నూరేళ్ళ ఈ జీవితం

అంకితం... నీకే అంకితం

ఓ..ప్రియా.. ఆ.. ఆ..  

ఓ.ప్రియా.. ఓ.. ప్రియా.. 


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు