RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, జనవరి 2026, ఆదివారం

అందాలా శ్రీమతికి మనసైనా ప్రియసతికీ | Andala Srimathiki | Song Lyrics | Chinnanati Snehitulu (1971)

అందాలా శ్రీమతికి మనసైనా ప్రియసతికీ


చిత్రం :  చిన్ననాటి స్నేహితులు (1971)

సంగీతం :  టి. వి. రాజు

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


అందాలా శ్రీమతికి . . 

మనసైనా ప్రియసతికీ

వలపుల కానుకగా . . 

ఒక పాపను నేనివ్వనా


మబ్బులలో విహరించే . . 

మా వారి అనురాగం

వాడని మందారం . . 

నా పాపట సిందూరం


చరణం 1:


మా బాబు నయనాలూ.. 

లేత జాబిల్లి కిరణాలు

మా బాబు నయనాలూ.. 

లేత జాబిల్లి కిరణాలు


వీడే ఇంతవాడె అంతవాడై.. 

వెలుగుతాడూ

వీడే ఇంతవాడె అంతవాడై.. 

వెలుగుతాడూ

కలలు నిండారగా.. 

సిరులు కొండాడగా


అందాలా శ్రీమతికి.. 

మనసైనా ప్రియసతికీ

వలపుల కానుకగా.. 

ఒక పాపను నేనివ్వనా


మబ్బులలో విహరించే.. 

మా వారి అనురాగం

వాడని మందారం..  

నా పాపట సిందూరం


చరణం 2 :


శౌర్యంలో నేతాజీ..  

సహనంలో గాందీజీ

శాంతి గుణంలో నెహ్రూజీ..

శాంతి గుణంలో నెహ్రూజీ.. 

సాహసంలో శాస్త్రీజీ  


ఒరవడిగా.. వడివడిగా 

నీ నడవడి తీర్చి దిద్దుకుని

ఒరవడిగా..  వడివడిగా 

నీ నడవడి తీర్చి దిద్దుకుని 


సరిహద్దులలో పొంచిన ద్రోహుల 

తరిమి తరిమి కొట్టాలీ

వీర సైనికుడివై భరతావని 

పేరును నిలబెట్టాలీ

వందేమాతరం..  వందేమాతరం.. 

వందేమాతరం.. వందేమాతరం.. 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు